• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నిద్ర పట్టడం లేదా? ఈ ట్రిక్ మీకోసమే!

ఆరోగ్యవంతమైన జీవనానికి గాఢ నిద్ర ఎంతో అవసరం. పక్కపై చేరగానే నిద్ర పట్టక ఇబ్బంది పడేవారికి ‘మిలిటరీ మెథడ్’ అద్భుత పరిష్కారం. మొదట ముఖ కండరాలను సడలించి, భుజాలను కిందికి వదిలేస్తూ శ్వాసను నెమ్మదిగా వదలాలి. కాళ్లు, చేతులను భారరహితంగా ఉంచి మనసును ప్రశాంతమైన స్థితిలోకి తీసుకురావాలి. 6 వారాల నిరంతర సాధనతో ఈ పద్ధతి ద్వారా బెడ్ ఎక్కిన నిమిషాల్లోనే గాఢ నిద్రలోకి జారుకోవచ్చు.

March 23, 2026 / 12:35 AM IST

‘స్పిరిట్’ షూటింగ్‌పై క్రేజీ అప్‌డేట్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్‌లో వస్తోన్న మూవీ ‘స్పిరిట్’. తాజాగా ఈ మూవీ షూటింగ్‌పై కీలక అప్‌డేట్ వచ్చింది. బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఓబెరాయ్ కీలక పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. గోవాలో వివేక్ ఒబెరాయ్, మరికొందరితో షూటింగ్ జరుగుతోందట. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్ త్వరలోనే చేరనున్నారనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

March 22, 2026 / 11:39 PM IST

పుత్తూరులో అందమైన షాదీమహల్ నిర్మించాం: రోజా

AP: చిత్తూరు జిల్లా పుత్తూరు మున్సిపాలిటీలో 99 శాతం అభివృద్ధి పనులు YCP అధికారంలో ఉండగా చేశామని మాజీమంత్రి రోజా అన్నారు. ‘పుత్తూరులో అందమైన షాదీమహల్ నిర్మించాం. అది పూర్తయినా ప్రారంభించకుండా నిర్లక్ష్యంగా ఉంచారు. జగన్ పాలనలో మూడేళ్లలో 4 అర్బన్ హెల్త్ సెంటర్లు నిర్మించాం. పుత్తూరు ప్రభుత్వ హాస్పిటల్‌ను ఆధునికీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం’ అని పేర్కొన్నారు.

March 22, 2026 / 11:00 PM IST

కారు, బైక్ ఢీకొని గేదె మృతి

MDK: నిజాంపేట మండలంలోని నందిగామ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా దూసుకువచ్చిన కారు, బైక్ ఒక గేదెను ఢీకొనడంతో ఆ గేదె అక్కడికక్కడే మృతి చెందింది. అదృష్టవశాత్తూ వాహనాల్లో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

March 22, 2026 / 10:19 PM IST

‘పేదలకు అండ‌గా సీఎం సహాయనిధి’

WGL: అవసరమైన సమయంలో ప్రభుత్వం నుంచి అందే ఆర్థిక సహాయం పేదలకు పెద్ద ఊరటగా నిలుస్తుందని TPCC సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి తెలిపారు. ఇవాళ నెక్కొండ పట్టణానికి చెందిన సయ్యద్ అజీముల్లాకు మంజూరైన రూ.17,500 విలువగల చెక్కును పంపిణీ చేశారు. ఆసుపత్రుల్లో చికిత్స ఖర్చులు భరించలేని పేదలకు సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.

March 22, 2026 / 10:05 PM IST

నారీ శక్తిపై అవగాహన కల్పించిన ఎస్సై

SKLM: పలాస(M) తర్లాకోటలో ఆదివారం ఎస్సై నరసింహమూర్తి ఆధ్వర్యంలో నారీ శక్తి యాప్‌పై స్థానిక మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి మహిళ తమ సెల్ ఫోన్‌లో నారి శక్తి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. సైబర్ క్రైమ్, మైనర్ బాలికల వివాహాలపై కలిగే అనర్ధాలు గూర్చి వివరించారు.

March 22, 2026 / 10:02 PM IST

చేనేత కళాకారులకు కూటమి ప్రభుత్వం అండ: మంత్రి

సత్యసాయి: రాష్ట్రంలోని చేనేత కళాకారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి ఎస్. సవిత తెలిపారు. విజయవాడలో నిర్వహిస్తున్న గాంధీ బునకర్ మేళాను ఆమె సందర్శించారు. 50 ఏళ్లు నిండిన చేనేతలకు రూ. 4,000 పెన్షన్, ఏప్రిల్ నుంచి ఉచిత విద్యుత్ అందించనున్నట్లు పేర్కొన్నారు. నాలుగు రోజుల్లోనే రూ. 47.35 లక్షల అమ్మకాలు జరగడంపై హర్షం వ్యక్తం చేశారు.

March 22, 2026 / 10:00 PM IST

గరికపాటి వ్యాఖ్యలపై నిరసన

BPT: పేద విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహారావు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బాపట్లలో వివిధ ప్రజాసంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా ఆదివారం సీపీఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ మాట్లాడుతూ.. పేద విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన పథకాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు.

March 22, 2026 / 10:00 PM IST

కూటమి బలోపేతంపై పల్లా దిశానిర్దేశం

VSP: గాజువాకలో టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కూటమి నాయకుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. కూటమి బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి లక్ష్యాలపై నాయకులతో చర్చించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందన్నారు.

March 22, 2026 / 09:57 PM IST

గజవాహన సేవలో భక్తులను మంత్రముగ్ధులను చేసిన రాముడు

TPT: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి గజవాహన సేవ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారు గజవాహనంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులను మంత్రముగ్ధులను చేశారు. గజరాజులు, వృషభాలు, అశ్వాలు ముందుకు సాగుతుండగా భజన బృందాలు కోలాటాలు ఆడుతూ ఉత్సవాన్ని మరింత వైభవంగా తీర్చిదిద్దాయి.

March 22, 2026 / 09:53 PM IST

అరుణాచలంలో లడ్డూ ప్రసాదం నిలిపివేత

గ్యాస్ కొరతతో తమిళనాడులోని అరుణాచలేశ్వరస్వామి ఆలయంలో లడ్డూ ప్రసాదం తయారీ నిలిచిపోయింది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో గ్యాస్ సరఫరా తగ్గడంతో మూడేళ్లుగా ఇస్తున్న ఉచిత లడ్డూల తయారీకి బ్రేక్ పడింది. అయితే భక్తుల డిమాండ్ మేరకు ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిపై ప్రసాదం చేయాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి రాగానే కట్టెల పొయ్యిపై లడ్డూలు చేసి పంపిణీ చేయనున్నారు.

March 22, 2026 / 09:49 PM IST

మాది రైతు రాజ్యం: పొన్నం

TG: తమది రైతు రాజ్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎలాంటి వాతావరణంలోనైనా పామాయిల్ సాగు చేయొచ్చని తెలిపారు. రైతులు పామాయిల్ సాగు వైపు దృష్టి పెట్టాలని సూచించారు. పామాయిల్ ఫ్యాక్టరీని రైతులు ఉపయోగించుకోవాలని కోరారు. రైతుల కోసం సీఎం రేవంత్ నిత్యం ఆలోచిస్తునే ఉంటాడని చెప్పారు.

March 22, 2026 / 09:48 PM IST

పడుకునేటప్పుడు జీన్స్ వేసుకుంటున్నారా?

కొందరు రాత్రి వేళల్లో జీన్స్ ప్యాంట్ ధరించే నిద్రపోతారు. ఇలా చేస్తే ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. రాత్రి పూట వీటిని ధరిస్తే కంఫర్ట్ లేక సరిగ్గా నిద్రపట్టదు. శరీర ఉష్ణోగ్రత పెరిగి నిద్రాభంగం కలుగుతుంది. జీన్స్ బిగుతుగా ఉండటంతో ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. అలర్జీ, దద్దుర్లు, నడుం నొప్పి, ఉబ్బరం, లైంగిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుంది.

March 22, 2026 / 09:46 PM IST

దుబ్బాకకు సాగునీరు ఇవ్వాలి: రఘనందన్

TG: సిద్దిపేట జిల్లాలోని నర్మెటలో సీఎం రేవంత్ రెడ్డి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ మాట్లాడుతూ.. ‘తపసుపల్లి నుంచి కొండపాకకు నీళ్లు అందించాలి. దుబ్బాక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలి. మల్లన్న సాగర్ భూములు ఇచ్చిన చాలా మంది రైతులకు ఇంకా పరిహారం అందలేదు. ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన దుబ్బాకకు సాగునీరు ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు.

March 22, 2026 / 09:45 PM IST

హుసేన్ నాయక్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే

MHBD: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ తండ్రి లచ్చునాయక్ ఇటీవల మరణించారు. ఈ క్రమంలో వరంగల్ పశ్చిమ MLA నాయిని రాజేందర్, టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావులు ఆదివారం గూడూరు మండలం మచ్చర్ల గ్రామంలోని ఆయన ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం హుస్సేన్ నాయక్ కుటుంబసభ్యులను పరామర్శించి తమ సానుభూతి తెలిపారు.

March 22, 2026 / 09:45 PM IST