TPT: చంద్రగిరి పట్టణంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కైలాస ధామంకు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కైలాస ధామంలో నిర్మిస్తున్న పరిపాలన భవనం, కమ్యూనిటీ హాల్, వెయిటింగ్ హాల్ పనులను ఎమ్మెల్యే పులివర్తి నాని పరిశీలించారు. నాణ్యతలో రాజీ పడకుండా పనులు చేయాలని కాంట్రాక్టర్‌కి తెలిపారు. ఈ కార్యక్రమంలో కైలాస ధామం కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బాపట్ల: పంగులూరు పరిధిలోని కాశ్యాపురం గ్రామంలో పోలీసులు విస్తృత CASO ఆపరేషన్ నిర్వహించారు. ఇంటింటి తనిఖీలు చేపట్టి అనుమానాస్పద వ్యక్తులను గుర్తించే ప్రయత్నం చేశారు. ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న పోలీసులు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. మాదక ద్రవ్యాల హెచ్చరికలు జారీ చేశారు.
అన్నమయ్య: తిరుపతిలో మదనపల్లెకు చెందిన ఓ యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మెడికల్ కళాశాల-రుయా ఆస్పత్రి రోడ్డులోని ఫుట్‌పాత్‌పై యువకుడి మృతదేహం కనిపించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, మృతుడిని అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని పొన్నిపాల్యం, కుమారపురం, నమాజ్ కట్ట ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
RR: మియాయర్ మెట్రో గ్రౌండ్‌లో, మియాపూర్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ సీజన్-1 ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ ఇవాళ ప్రారంభించారు. యువతతో కలిసి క్రికెట్ అడి, టోర్నమెంట్ టీమ్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
మహిళల్లో డిమెన్షియా ముప్పును 25 ఏళ్ల ముందే గుర్తించే పి-టావ్217 అనే జీవ సూచికను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. రక్తంలో దీని మోతాదు ఎక్కువగా ఉంటే భవిష్యత్తులో జ్ఞాపకశక్తి తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా 70 ఏళ్లు పైబడిన వారు, హార్మోన్ చికిత్స తీసుకునే వారిలో ఈ పరీక్ష ద్వారా ప్రమాదాన్ని ముందే పసిగట్టవచ్చు. తద్వారా నివారణ చర్యలు ముందుగానే చేపట్టే వీలుంటుంది.
SRCL: పర్యావరణ పరిరక్షణకు పాటుపడకపోతే భవిష్యత్తు అంధకారమేనని, వేములవాడ న్యూ అర్బన్ కాలనీ పాఠశాల హెచ్ఎం విక్కుర్తి లక్ష్మీనారాయణ అన్నారు. వేములవాడ న్యూ అర్బన్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో ప్రపంచ పిచ్చుకల దినోత్సవం నిర్వహించారు. పాఠశాల హెచ్ఎం లక్ష్మీనారాయణ పాఠశాల విద్యార్థులతో పిచ్చుక గూళ్ళు, ఆహార ధాన్యాలు, నీటి సమకూర్చుటపై ప్రాజెక్టు నిర్వహించారు.
TG: ఈ ఏడాది నుంచి స్కూళ్లలో కొత్తగా బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. కొత్తగా జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే, చేయూత పథకం కింద రూ.2 లక్షల మందికి కొత్త పెన్షన్లు, కోహెడలో రూ.47 కోట్లతో చేపల మార్కెట్ నిర్మిస్తామన్నారు.
NLG: చేనేత సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 25న HYD ఇందిరా పార్కు వద్ద ‘మహా ధర్నా’ నిర్వహించనున్నట్లు తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి గంజి మురళీధర్ తెలిపారు. చేనేత భరోసా, త్రిఫ్ట్ పథకం, నేతన్న భీమా, రుణమాఫీ, సహకార ఎన్నికల నిర్వహణే ప్రధాన డిమాండ్లతో మహా ధర్నా జరుగుతుందని పేర్కొన్నారు. గత పోరాటాల వల్లే రుణమాఫీ సాధ్యమైందని గుర్తు చేశారు.
ADB: పార్టీ బలోపేతం కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందని యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రుపేష్ రెడ్డి అన్నారు. నూతనంగా ఎన్నికైన జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లి రజినికాంత్‌ను యువజన కాంగ్రెస్ నాయకులతో కలిసి శుక్రవారం శాలువాతో ఘనంగా సత్కరించారు. నాయకులు విట్టల్ రెడ్డి, నాగరాజు, రాకేష్, రవి తదితరులున్నారు.
నంద్యాల వైసీపీ నాయకుడు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దేశం సుధాకర్ రెడ్డి బైక్ ప్రమాదంలో గాయపడగా, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి ఆయనను శుక్రవారం పరామర్శించారు. నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.
NZB: సిరికొండ మండలం రావుట్ల-పిప్పిరి మార్గంలో శుక్రవారం తెల్లవారుజామున కురిసిన వడగండ్ల వానకు వరి పంట తీవ్రంగా దెబ్బతిన్నది. కోతకు వచ్చిన పంట గింజలు నేలరాలడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. అధికారుల సర్వే నిర్వహించి పంట నష్టపరిహారం అందించి ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. చేతికొచ్చిన పంట చేజారిపోవడంతో మండల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
MNCL: జన్నారం మండలంలోని రేండ్లగూడ మందపల్లిలో నిర్వహించే పశువుల సంత వేలంపాటను మళ్ళీ వాయిదా వేశామని గ్రామ సర్పంచ్ మాధవి రవి, కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో వారసంత వేలం పాటను నిర్వహించిన నిర్దేశిత అప్సెట్ ధర రాకపోవడంతో మార్చి 24కు వేలం పాటను వాయిదా వేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భూపతి, వార్డ్ సభ్యులు ఉన్నారు.
హైదరాబాద్‌లోని అమీర్‌పేట్-రాయదుర్గం మెట్రో మార్గంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం కలిగింది. సుమారు 20 నిమిషాల పాటు సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మెట్రో సిబ్బంది వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టారు. ప్రస్తుతం సమస్య పరిష్కారం కావడంతో సర్వీసులు యథావిధిగా కొనసాగుతున్నాయి.
NRPT: దామరగిద్ద మండలంలోని క్యాతన్పల్లి గ్రామ శివారులో కొలువై ఉన్న భద్రకాళి సమేత శ్రీ వీరభద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్ష ఉపాధ్యక్షుడు నారాయణ తెలిపారు. శనివారం అంకురార్పణ, 22 న మహా రుద్రాభిషేకం, 23న మహాపురవంతుల సేవ అదే రోజు రాత్రి స్వామి వారి రథోత్సవం, 24 మంగళవారం పుట్ట పూజతో ముగుస్తాయన్నారు.
వెండితెరపై అలరించేందుకు మరో విజువల్ వండర్ సిద్ధమవుతోంది. ఇద్దరు వెర్సటైల్ నటులు విజయ్ సేతుపతి, సాయి పల్లవి ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. దర్శకుడు మణిరత్నం వీరిద్దరితో ఓ క్లాసిక్ లవ్ స్టోరీని ప్రకటించారు. దీనికి AR రెహమాన్ సంగీతం అందించనున్నారు. త్వరలోనే పట్టాలెక్కనున్న మణిరత్నం మార్క్ రొమాంటిక్ డ్రామాపై సినీ ప్రియుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.