• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మంత్రి నివాసం ముందు ఆశా వర్కర్ల ధర్నా

SRD: నెలకు 18 వేల రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని మంత్రి దామోదర్ నివాసం ముందు ఆశా వర్కర్లు శుక్రవారం ధర్నా నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు విశాలాక్షి మాట్లాడుతూ… నెలకు 18 వేల రూపాయల వేతనం ఇవ్వాలని పోరాటాలు చేస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. ధర్నాలో ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

March 20, 2026 / 01:39 PM IST

తిరుపతిలో ఫుట్‌పాత్‌పై గుర్తుతెలియని వ్యక్తి మృతి

తిరుపతి మెడికల్ కాలేజీ-రుయా హాస్పిటల్ రోడ్డులో ఫుట్‌పాత్‌పై గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వద్ద లభించిన ఆధారాలను బట్టి అతను మదనపల్లె, పొన్నిపాల్యం, కుమరపురం, నమాజ్ కట్ట ప్రాంతానికి చెందినవాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయా మార్చురీకి తరలించారు.

March 20, 2026 / 01:37 PM IST

‘గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యం’

W.G: గ్రామాలను అభివృద్ధి చేయడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలం ఎల్.విఎన్ పురం-అనాకోడేరు గ్రామంలో రూ.4.7 కోట్లతో రోడ్డు పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. 5.2 కిమీ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. రోడ్డు నిర్మాణాన్ని నాణ్యతతో నిర్మించాలని కాంట్రాక్టర్లకు సూచించారు.

March 20, 2026 / 01:36 PM IST

విద్యార్థులకు నీటి ప్రాముఖ్యతపై అవగాహన

SDPT: బెజ్జంకి మండలం దాచారం గ్రామ ఉన్నత పాఠశాలలో నీటి సంరక్షణ దినోత్సవం సందర్భంగా బాలవికాస సమితి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు గ్రామంలో ప్రదర్శన చేపట్టి ప్రజలకు నీటి ప్రాముఖ్యత వివరించారు. అనంతరం నీటిని ఆదా చేయాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సమితి ప్రతినిధులు అన్నమేరి, వట్టి సుజాత పాల్గొన్నారు.

March 20, 2026 / 01:35 PM IST

‘రాంనగర్‌లో సిసి డ్రైనేజీ నిర్మాణ పనుల ప్రారంభం’

MLG: కోయగుడ గ్రామపంచాయతీ పరిధిలోని రాంనగర్‌లో సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులను స్థానిక సర్పంచ్ పోరీక సరిత ప్రారంభించారు. డ్రైనేజీ నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనులను సకాలంలో పూర్తిచేసేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సర్పంచ్ సూచించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు జయకృష్ణ, తదితరులు ఉన్నారు.

March 20, 2026 / 01:34 PM IST

ఠాణు నాయక్ గొప్ప రైతాంగ పోరాట యోధుడు

BDK: టేకులపల్లి మండలంలో లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జాటోత్ ఠాణు నాయక్ 76 వర్ధంతి సందర్బంగా వారి చిత్రపటానికి నివాళి అర్పించారు. ఠాణు నాయక్ తెలంగాణ ప్రాంతానికి చెందిన గొప్ప రైతాంగ పోరాట యోధుడు అని అన్నారు. ఆయన జనగామ తాలూకా ప్రాంతంలో జన్మించి, చిన్నప్పటి నుంచే పేదల కష్టాలు, భూస్వాముల దోపిడీని చూసి పోరాట మార్గాన్ని ఎంచుకున్నారని తెలిపారు.

March 20, 2026 / 01:33 PM IST

పోచారం గ్రామంలో పశు వైద్య శిబిరం కార్యక్రమం

HNK: పరకాల మండలంలోని పోచారంలో పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని పరకాల మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాజిరెడ్డి ప్రారంభించారు. పశు సంరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని, పాడి రైతులు నిత్యం పశువుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

March 20, 2026 / 01:33 PM IST

‘కళాకారులకు అవార్డులు గర్వకారణం’

KRNL: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకలు సందర్భంగా ఎమ్మిగనూరు నియోజకవర్గానికి చెందిన కళాకారులు ప్రతిభ చాటుకుని పురస్కారాలు అందుకోవడం గర్వకారణమని MLA జయనాగేశ్వర రెడ్డి ఇవాళ అన్నారు. డ్రామా విభాగంలో అవార్డు సాధించిన నీలం ఓంకార స్వామి, మినియేచర్ ఆర్ట్ విభాగంలో పురస్కారం పొందిన మచ్చని శివ కేశవలను ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు.

March 20, 2026 / 01:31 PM IST

గుత్తిలో రంజాన్ మాసం ఆఖరి జుమా ప్రార్థనలు

ATP: రంజాన్ మాసం ఆఖరి జుమా సందర్భంగా గుత్తి కేబీఎన్ మసీదులో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మసీదు ఇమామ్ సాబ్ హుస్సేన్ ఉపవాసం, దానధర్మాలు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతపై ప్రసంగించారు. పవిత్ర మాసంలో చేసే నమాజ్, సత్కార్యాలకు అధిక పుణ్యం లభిస్తుందని వివరించారు. ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

March 20, 2026 / 01:30 PM IST

రేపటి నుంచి నైట్ బజార్ బంద్.!

HYD: రంజాన్ పర్వదినం సందర్భంగా పాతబస్తీలో నెల రోజులుగా సాగుతున్న నైట్ బజార్ రేపటితో ముగియనుంది. చార్మినార్, లాడ్ బజార్ ప్రాంతాలు రాత్రివేళల్లో కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. రేపు పండుగ కావడంతో ఈ ప్రత్యేక షాపింగ్‌కు తెరపడనుంది. మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో సాయంత్రం నుంచే పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

March 20, 2026 / 01:29 PM IST

తెలంగాణ బడ్జెట్: హైలెట్స్

➠ RRR అవతల అగ్రికల్చర్ ప్రాసెసింగ్ యూనిట్లు➠ పరిపాలన అభివృద్ధికి 3 కార్పొరేషన్లుగా GHMC విభజన➠ హైదరాబాద్‌కు గ్లోబల్ సిటీ➠ హైదరాబాద్‌లో నాలుగు పోలీస్ కమిషనరేట్లు➠ హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్ కేబులింగ్➠ హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద నాలెడ్జ్ టవర్➠ కొత్తగా 274 మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాలు

March 20, 2026 / 01:29 PM IST

పడిపోయిన వెండి ధర.. సామాన్యుడికి రిలీఫ్

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు ఇవాళ పతనమయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఏకంగా రూ.5,000 తగ్గి, ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,60,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా దాదాపు ఇవే ధరలు అమల్లో ఉన్నాయి. తగ్గిన వెండి ధర కొనుగోలుదారులకు కాస్త ఊరటనిచ్చింది. వెండి ఆభరణాలు లేదా కాయిన్స్ కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి సమయమని నిపుణులు చెబుతున్నారు.

March 20, 2026 / 01:28 PM IST

‘కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ నియామకాలు’

KDP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల నియామకాలు చేపట్టిందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి శుక్రవారం ప్రొద్దుటూరులో తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నారని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో ఒక్క సచివాలయ ఉద్యోగులను తప్ప ఎవరికీ ఉద్యోగాలు కల్పించలేదని విమర్శించారు.

March 20, 2026 / 01:27 PM IST

దుప్పటి గట్టులో పంచాయతీ కార్యాలయం ప్రారంభం

NRPT: కొత్తపల్లి మండలంలోని దుప్పటి గట్టులో పంచాయతీ భవనం లేక అద్దె భవనంలో పనులు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాత అంగన్వాడీ భవనాన్ని సర్పంచ్ గోనేటి వెంకటేశ్ పంచాయతీ కార్యాలయంగా ప్రారంభించారు. అద్దె భవనంలో ఇబ్బందులు ఉండడంతో వినియోగంలోకి తెచ్చామని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ వెంకటయ్య, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

March 20, 2026 / 01:26 PM IST

ప్రాథమిక పాఠశాలను సందర్శించిన ఎంఈవో

GDWL: మానవపాడు మండలంలోని అమరవాయి ప్రాథమిక పాఠశాలను శుక్రవారం ఎంఈవో శివప్రసాద్ సందర్శించారు. ఆయన పాఠశాల రికార్డులను పరిశీలించి, విద్యార్థుల హాజరు శాతాన్ని సైతం పరిశీలించారు. అనంతరం తరగతి గదులకు వెళ్లి అధ్యాపకులు బోధన ఎలా చెప్తున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు తరగతి విద్యార్థులతో తెలుగు, ఇంగ్లిష్ పాఠ్య పుస్తకాలను చదివించారు.

March 20, 2026 / 01:26 PM IST