SKLM: పాతపట్నం రైల్వే స్టేషన్‌లో రాజారాణి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ హాల్ట్‌ను శుక్రవారం కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే మామిడి గోవిందరావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఈ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ హాల్ట్‌తో ఈ ప్రాంత ప్రజల చిరకాల కల సాకారమయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
➠ కోఠి ఉమెన్స్ యూనివర్సిటీకి రూ.400 కోట్లు➠ శాంతిభద్రతలకు రూ.11.907 కోట్లు➠ గోదావరి పుష్కరాలకు రూ.500 కోట్లు➠ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత ఆరోగ్య భద్రత పథకం. ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డు➠ వరంగల్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి భూసేకరణ పూర్తి➠ RRRకు సమాంతరంగా రైలు మార్గం ఏర్పాటు
NLG: దేవరకొండ రూరల్ బీజేపీ మండల అధ్యక్షుడు నేనావత్ రామునాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నాటి సురేష్, జిల్లా ఉపాధ్యక్షులు వానం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నెరవేర్చని రాష్ట్ర ప్రభుత్వ హామీలను తక్షణమే అమలు చేయాలని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
సత్యసాయి: పెనుకొండలోని BTR కాలనీలో ఎంపీపీ పాఠశాలను మంత్రి సవిత శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యంగా, పరిశుభ్రంగా ఉండాలని స్పష్టం చేశారు. ఆహార నాణ్యతలో ఎలాంటి లోపాలు కనిపించినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
BHPL: మల్హర్ (M) తాడిచర్ల గ్రామంలో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్ ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. ఛైర్మన్ మాట్లాడుతూ.. కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని, మహిళా సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తూ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు.
అన్నమయ్య: రాజంపేటలోని జనసేన పార్టీ ఆధ్వర్యంలో CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నేత యల్లటూరు శ్రీనివాసరాజు బాధితులకు ఆర్థిక సహాయం రూపంలో CMRF చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందుతున్న సహాయనిధి పేదలకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.
SRPT: అనంతగిరి మండలం ఖానాపురం నర్సరీని ఎంపీడీవో హరి సింగ్ నాయక్ ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా మొక్కల పెంపకం, సంరక్షణను పరిశీలించారు. మొక్కల స్థితిగతులపై సిబ్బందిని అడిగి వివరాలను తెలుసుకున్న ఆయన, సంరక్షణలో మరింత శ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం గ్రామపంచాయతీని సందర్శించి, గ్రామపంచాయతీలో పలు రికార్డులను పరిశీలించారు.
ADB: సోనాల మండలంలోని కోట (కే) బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్ శుక్రవారం పర్యటించారు. గ్రామానికి చెందిన శంకర్ కుమారుడు అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న గజేందర్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.
BDK: చంద్రుగొండ మండలం తిప్పనపల్లి రెవిన్యూ, వెంకటాపురం గ్రామంలో అసైన్డ్ భూములను ఆక్రమిస్తున్న గిరిజనేతరులపై ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని శుక్రవారం ఆదివాసీ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. సర్వేనెంబర్ 116 లో ఉన్న అసైన్డ్ అక్రమలపై చర్యలు తీసుకోకపోతే తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఈనెల 23న ధర్నా నిర్వహిస్తున్నామని పిలుపునిచ్చారు.
MDK: నివాసాల మధ్య ఉన్న చికెన్ షాపును వెంటనే తొలగించాలని కోరుతూ కాళ్లకల్ గ్రామస్థులు గురువారం ఆందోళనకు దిగారు. షాప్ వల్ల వచ్చే దుర్వాసనతో అనారోగ్యం పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
AKP: పోలీస్ సిబ్బంది సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎస్పీ తుహీన్ సిన్హా అన్నారు. శుక్రవారం ఎస్పీ సంపర్క్ ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా సిబ్బందితో ఫోన్లో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పోస్టింగ్స్, బదిలీలు, సెలవులు, ఆరోగ్య సమస్యలను సిబ్బంది ఎస్పీకి వివరించారు.
VZM: నెల్లిమర్లలో ఉన్న ఈవీఎం గోదాములను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. మూడు నెలలకు ఒకసారి జరిగే తనిఖీలో భాగంగా యంత్రాల నిల్వను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై సమీక్ష చేసి, సీసీ కెమెరాల పర్యవేక్షణను కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు.
TG: అసెంబ్లీలో రూ.3.24 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. కొత్తగా 5 పథకాలను ప్రతిపాదించారు. అందులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, సీఎం ఓవర్సీస్ ఎంప్లాయీమెంట్ ప్రోగ్రాం, దివ్యాంగ విద్యార్థులకు వాహనాల పథకం ఉంది.
KNR: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని ఆరోపిస్తూ బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన చేపట్టారు. ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. రైతు రుణమాఫీ, మహిళలకు నగదు బదిలీ వంటి పథకాల్లో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు.
కృష్ణా: స్వాతంత్య్ర సమరయోధులు భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవనం నిర్మాణం ఏర్పాటు చేయాలని కూటమి నాయకులు, స్వచ్ఛంద సంస్థలు మున్సిపల్ కమిషనర్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. పట్టాభి భవనానికి ఎన్‌ఓసీ మంజూరు చేసినందుకు కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కోనేరు సెంటర్‌లో తోట నరసయ్య నాయుడు పేరు పెట్టి విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు.