KDP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల నియామకాలు చేపట్టిందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి శుక్రవారం ప్రొద్దుటూరులో తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నారని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో ఒక్క సచివాలయ ఉద్యోగులను తప్ప ఎవరికీ ఉద్యోగాలు కల్పించలేదని విమర్శించారు.
NRPT: కొత్తపల్లి మండలంలోని దుప్పటి గట్టులో పంచాయతీ భవనం లేక అద్దె భవనంలో పనులు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాత అంగన్వాడీ భవనాన్ని సర్పంచ్ గోనేటి వెంకటేశ్ పంచాయతీ కార్యాలయంగా ప్రారంభించారు. అద్దె భవనంలో ఇబ్బందులు ఉండడంతో వినియోగంలోకి తెచ్చామని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ వెంకటయ్య, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
GDWL: మానవపాడు మండలంలోని అమరవాయి ప్రాథమిక పాఠశాలను శుక్రవారం ఎంఈవో శివప్రసాద్ సందర్శించారు. ఆయన పాఠశాల రికార్డులను పరిశీలించి, విద్యార్థుల హాజరు శాతాన్ని సైతం పరిశీలించారు. అనంతరం తరగతి గదులకు వెళ్లి అధ్యాపకులు బోధన ఎలా చెప్తున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు తరగతి విద్యార్థులతో తెలుగు, ఇంగ్లిష్ పాఠ్య పుస్తకాలను చదివించారు.
NRPT: కృష్ణ మండలంలోని చేగుంట ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. కలెక్టర్, డీఈవో, ఎంఈవో పాత్రల్లో విద్యార్థులు పాఠశాలను సందర్శించి పరిశీలించడం ఆకట్టుకుంది. కలెక్టర్‌గా సన్నిధి, డీఈవోగా శివప్రసాద్, ఎంఈవోగా నిరజా బాధ్యతలు నిర్వర్తించారు.
MDK: రామాయంపేట పట్టణ బస్టాండ్ వద్ద ఏబీవీపీ నాయకులు తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ పోలీసులు నిరసనను నిలిపివేయాలని ఆదేశించడంతో పోలీసులకు, ఏబీవీపీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ కో-కన్వీనర్ ప్రశాంత్ పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.
➠ విద్యుత్ సబ్సిడీ రూ.14 వేల కోట్లు➠ బియ్యం సబ్సిడీ రూ.3 వేల కోట్లు➠ యంగ్ ఇండియా స్కూళ్లకు రూ.5 వేల కోట్లు➠ మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ రూ.1500 కోట్లు➠ ఉస్మానియా యూనివర్సిటీకి రూ.వెయ్యి కోట్లు➠ మెట్రో రైలు ఫేజ్-2 రూ.600 కోట్లు➠ రూ.73,383 కోట్ల కొత్త రుణాలకు ప్రతిపాదన
SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు ఈశ్వర్ గారి సురేష్ శర్మకు ఉగాది పురస్కారం లభించింది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో దేవాదాయ ధర్మాదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన అర్చకులు సురేష్ శర్మ ఉగాది పురస్కారం పొందారు. మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.
ELR: జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం CI బి.వెంకటేశ్వరరావు, SI వి.క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు భద్రత ప్రాముఖ్యతను వివరించి, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. పోలీసుల సూచనలతో పలువురు వాహనదారులు అక్కడికక్కడే హెల్మెట్లను కొనుగోలు చేశారు.
AP: గోదావరి నదిలోకి దిగిన ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. పోలవరం జిల్లా ఏటపాక మండలం కూనవరం వద్ద భద్రాచలానికి చెందిన ఏడురుగు స్నానం కోసం నదిలోకి దిగారు. ఈ క్రమంలో లోతు తెలియక ఐదుగురు గల్లంతవగా.. మిగిలిన ఇద్దరు ఒడ్డుకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు బోట్లు, గజఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MBNR: జిల్లా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ (MT) పూల్‌లో హైడ్రాలిక్ లిఫ్ట్ షెడ్ నిర్మాణానికి జిల్లా ఎస్పీ డి. జానకి భూమిపూజ నిర్వహించారు. ఈ లిఫ్ట్ ద్వారా వాహనాల ఆయిల్ మార్పిడి, వాషింగ్, మరమ్మత్తులు సులభంగా జరగడంతో పాటు ఖర్చులు తగ్గి, వాహనాలు ఎప్పటికప్పుడు డ్యూటీకి సిద్ధంగా ఉంటాయని ఆమె తెలిపారు.
HYD: కోరిన కోర్కెలు తీర్చే చిలుకూరు బాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు ఈనెల 27 నుంచి ఘనంగా జరుగనున్నాయి. 8 రోజుల పాటు వేడుకలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 27న అంకురార్పణ, 28న ధ్వజారోహణ, శేషవాహన సేవలు, 29న గోపవాహనం, హనుమంతవాహనం, 30న కళ్యాణోత్సవం, 31న వసంతోత్సవం, ఏప్రిల్ 1న పల్లకీసేవ, రథోత్సవం, 2న మహాభిషేకం, 3న ముగింపు వేడుకలు ఉంటాయన్నారు.
HNK: చదువు మన తలరాతను మారుస్తుందని కుడా ఛైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి అన్నారు. ఆత్మకూరులోని సెయింట్ థెరీసా స్కూల్‌లో అకాడమిక్ ఎక్సలెంట్ అవార్డ్స్ పంపిణీ కార్యక్రమానికి ఛైర్మన్ హాజరయ్యారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే క్రమశిక్షణతో కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలన్నారు.
KRNL: ఎంపీ బస్తిపాటి నాగరాజు శుక్రవారం జిల్లాలోని ముస్లిం సోదర, సోదరీమణులకు ముందస్తు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ శాంతి, ఐక్యత, దానధర్మాలు, మానవత్వానికి ప్రతీక అని, నెల రోజుల ఉపవాస దీక్ష తర్వాత వచ్చే ఈ పండుగ సోదరభావాన్ని, ప్రేమానురాగాలను పెంపొందిస్తుందని ఆయన పేర్కొన్నారు. అలాగే, మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
➠ ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం➠ అన్ని గురుకులాల్లో వంటశాలల ఆధునీకరణ➠ వంటశాలలకు రూ.100 కోట్ల ప్రతిపాదనలు➠ 57 పాలిటెక్నిక్ కాలేజీల్లో 15 కొత్త కోర్సులు➠ స్కిల్డ్ లేబర్‌ను తయారు చేయడమే లక్ష్యం➠ పరిశ్రమల అవసరాలకు యువతకు నైపుణ్యాలు➠ యువతను బ్లాక్ కాలర్ ఉద్యోగాలకు సన్నద్ధం➠ OU, JNTU తరహాలో స్కిల్ యూనివర్సిటీ
E.G: రాజానగరం మండలం పాత తుంగపాడులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి ఏడిద బాబీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని MLA బత్తుల బలరామకృష్ణ సందర్శించి శిబిరాన్ని ప్రారంభించారు. ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు.