AP: అనకాపల్లిలో స్టీల్‌ప్లాంట్ శంకుస్థాపనకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 23న సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు హోంమంత్రి అనిత ఏర్పాట్లు పరిశీలించారు. పటిష్ట బందోబస్తు, ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.