MBNR: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మానవపాడు, వడ్డెపాడు మిర్చి రైతులు గిట్టుబాటు ధర లేక విలవిల్లాడుతున్నారు. అష్టకష్టాలు పడి పండించిన పంటను పక్క రాష్ట్రానికి తీసుకెళ్లగా అక్కడ దగా పడ్డామని, తమకు తెలియకుండానే కోల్డ్ స్టోరేజీ యజమానులు నిల్వలను విక్రయించుకున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమ్మినందుకు తమను నట్టేట ముంచారని రైతులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.