E.G: దేవరపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో HPV టీకాపై ఎంపీపీ కేవీకే దుర్గారావు అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. మండలంలో అర్హులైన 524 మంది బాలికలను గుర్తించడం జరిగిందన్నారు. వారికి త్వరలోనే టీకాలు అందజేస్తామని PHC వైద్యాధికారి డి.సంజీవ్ కుమార్ తెలిపారు. స్త్రీలలో గర్భాశయ క్యాన్సర్ రాకుండా నిరోధించే HPV టీకా పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు.
ASR: హుకుంపేట మండలం ములియపుట్టు సచివాలయాన్ని ఆర్డీవో లోకేశ్వరరావు సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి, సచివాలయ సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం సందర్శించారు. రెవెన్యూ సిబ్బంది, వీఆర్వోలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.
AP: కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని MLC వరుదు కళ్యాణి ఆరోపించారు. ‘రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. సుగాలి ప్రీతి కేసు ఏం చేశారు? అరవ శ్రీధర్‌పై ఏం చర్యలు తీసుకున్నారు? శాంతిభద్రతల అమలులో ప్రభుత్వం విఫలమైంది. సీఎంకి మహిళ దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అర్హత లేదు’ అని విమర్శించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం, మూకమామిడి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, వంటశాల, భోజనశాల, పరిశుభ్రత పరిస్థితులను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యతపై ఆరా తీశారు.
అనంతపురంలోని 40వ డివిజన్ ఆజాద్ నగర్ హసేన్ మసీదు వద్ద సోమవారం మహబూబ్ ఖాన్ ఏర్పాటు చేసిన రంజాన్ తోఫా కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ బల్లా పల్లవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రంజాన్ మాసం శాంతి, ప్రేమ, సోదరభావానికి ప్రతీక అని కొనియాడారు. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
సత్యసాయి: ఫిర్యాదులకు తక్షణమే న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశించారు. సోమవారం పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి 63 ఫిర్యాదులను స్వీకరించారు.
TG: రాజకీయాలు కలుషితం అవుతున్నాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కొందరు రాజకీయ నేతలు ధనార్జనపైనే దృష్టి పెడుతున్నారని విమర్శించారు. రాజకీయాల్లో ప్రక్షాళన అవసరమని తెలిపారు. మావోయిస్టులు ప్రజల్లోకి రావడం శుభపరిణామం అని కొనియాడారు. కాంగ్రెస్ సోషల్ సెక్యులర్ పార్టీ అని అన్నారు. ప్రజాసేవ కోసం వచ్చేవారిని ఆహ్వానిస్తామన్నారు.
అన్నమయ్య: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని సోమవారం చిన్నమండెం మండలం బోరెడ్డి గారి పల్లెలో మంత్రి నివాసంలో రాయచోటి మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన రమణారెడ్డి మంత్రికి పూల బొకే అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాయచోటి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని మున్సిపల్ కమిషనరుకు సూచించారు.
MNCL: విద్యార్థులకు విద్యాపరంగా ఎటువంటి ఇబ్బంది ఉన్నా అందరికీ అందుబాటులో ఉండి సమస్య పరిష్కారానికి అన్ని విధాలుగా కృషి చేస్తానని MLA ప్రేమ్ సాగర్ రావు హామీ ఇచ్చారు. సోమవారం మంచిర్యాల ITI కాలేజీలో ఏర్పాటు చేసిన షార్ట్ టర్మ్ కోర్సులను కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వం అందించిన విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని MLA పిలుపునిచ్చారు.
ADB: సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పట్టణంలోని విద్యాశాఖ కార్యాలయం ముందు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. డీఎస్సీ నియామకంలో 30% వెయిటేజ్, కనీస వేతనం, ఉద్యోగ భద్రత, హెల్త్ కార్డులను అందజేయాలని కోరారు. కార్యక్రమంలో ఉద్యోగులు దేవదర్శన్, మంజుల, ప్రియాంక, తేజస్వి, కాశీనాథ్, అశ్వక్, తదితరులు పాల్గొన్నారు.
T20 WCలో భారత్ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో HYD నుంచి T20 WC విజయంలో భాగమైన తిలక్ వర్మ, సిరాజ్‌లను TG ప్రభుత్వం ఘనంగా సన్మానించనున్నట్లు తెలుస్తోంది. సిరాజ్‌కు గతంలోనే భారీ రివార్డ్ ప్రకటించిన నేపథ్యంలో తిలక్ వర్మకు ఈ సారి భారీ నజరానాతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
JN: జనగామ జిల్లా కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్‌తో కలిసి ప్రజల నుంచి 157 అర్జీలను స్వీకరించారు. వచ్చిన వినతులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశించారు.
GDWL: జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ రావు ప్రజల నుంచి 96 దరఖాస్తులను స్వీకరించారు. ప్రజల ఫిర్యాదులను ఏమాత్రం జాప్యం చేయకుండా వేగంగా పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రతి అర్జీపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి బాధితులకు న్యాయం చేయాలని స్పష్టం చేశారు.
CTR: సుగుటూరు గంగమ్మ జాతర నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఇవాళ అధికారులతో పుంగనూరు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది మంగళ, బుధవారాల్లో సెలవు పెట్టవద్దని కమిషనర్ సూచించారు. అనంతరం విధి విధానాలపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. జాతర రెండు రోజుల పాటు ఎవరూ సెలవు పెట్టకూడదని, అలా చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
SDPT: పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ప్రగతి వనంలో సిబ్బందితో కలిసి కమిషనర్ చెత్త క్లీన్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. పట్టణ పచ్చదనం, పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని కోరారు. చెత్తాచెదారం ఎక్కడపడితే అక్కడ వేయొద్దన్నారు.