• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఎల్లారెడ్డిపేట సీఐగా వెంకటేష్

SRCL: ఎల్లారెడ్డిపేట సీఐగా ఓదెల వెంకటేష్ నియామకమయ్యారు. ఎల్లారెడ్డిపేట సీఐగా పనిచేస్తున్న శ్రీనివాస్ గౌడ్ బదిలీ అయ్యారు. కరీంనగర్ పోలీస్ కంట్రోల్ రూమ్‌లో పనిచేస్తున్న సీఐ ఓదెల వెంకటేష్‌ను ఎల్లారెడ్డిపేటకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

March 6, 2026 / 03:41 PM IST

‘కూలీల బకాయిలు చెల్లించాలి’

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని గ్రామీణ ఉపాధి హామీ పనులను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రాయి కంటి శ్రీనివాస్ సందర్శించారు. కార్మికుల సమస్యలు తెలుసుకున్న ఆయన, కూలీల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేసి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని కోరారు.

March 6, 2026 / 03:40 PM IST

రేపు మహిళా యూనివర్సిటీలో కాన్వకేషన్

తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో శనివారం (రేపు) 22వ కాన్వకేషన్ నిర్వహించనున్నారు. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగే ఈ కార్యక్రమానికి గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సందర్భంగా మొత్తం 1,601 మంది విద్యార్థినులకు డిగ్రీ పట్టాలు అందజేయనున్నారు.

March 6, 2026 / 03:40 PM IST

టీ కేఫ్‌లో పోలీసుల ఆకస్మికంగా తనిఖీలు

ATP: యాడికి మండల వ్యాప్తంగా ఉన్న టీ కేఫ్‌లో పోలీసులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. ఎస్సై శ్రీనివాసులు తన సిబ్బందితో కలిసి టీ కేఫ్ నిర్వాహకులకు పలు సూచనలు సలహాలు చేశారు. నిబంధనలు పాటించకుంటే సహించే ప్రసక్తే లేదన్నారు. టి కేఫ్‌‌లో పరిసర ప్రాంతాలలో అనుమానితుల వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.

March 6, 2026 / 03:40 PM IST

రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ

TG: HYD అంబర్ పేట ఫ్లై ఓవర్ కింద నిలిచిపోయిన సర్వీస్ రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు సహకరించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. భూ సేకరణలో ఎదురవుతున్న అడ్డంకుల వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. రూ. 265 కోట్ల వ్వయంతో 1.5 కిలోమీటర్లు పొడవైన 4 వరుసల ఫ్లై ఓవర్ ను కేంద్రం నిర్మించిందని గుర్తు చేశారు.

March 6, 2026 / 03:38 PM IST

అసంఘటిత కార్మికులకు బీమా కల్పించాలి: ఎమ్మెల్సీ

MDK: రాష్ట్రంలోని అసంఘటిత, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, SSA ఉద్యోగులకు రూ.60 లక్షల ప్రమాద బీమా కల్పించాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి కోరారు. ఈ మేరకు మెదక్ కలెక్టరేట్లో మంత్రి వివేక్ వెంకటస్వామికి ఆయన వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. ఆపద కాలంలో కార్మికులకు బీమా సౌకర్యం కల్పించి ఆదుకోవాలని కోరారు.

March 6, 2026 / 03:38 PM IST

’99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి’

PDPL: 99 రోజుల కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు. శుక్రవారం పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. మార్చి 6 నుంచి 15 వరకు జరిగే ప్రత్యేక డ్రైవ్‌లో ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కౌన్సిలర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు.

March 6, 2026 / 03:38 PM IST

‘ఈనెల 15 నుంచి ఉగాది ఉత్సవాలు ప్రారంభం’

ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ఈనెల 15 నుండి 62వ వార్షిక జాతర మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ శాశ్వత ఛైర్మన్ రాజాన పండు తెలిపారు. ఇందుకు సంబంధించి ఆహ్వాన పత్రికలను శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు. 15వ తేదీ నుండి 22వ తేదీ వరకు అమ్మవారికి శేష పూజా కైంకర్యాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

March 6, 2026 / 03:38 PM IST

ఈర్నపాడులో ఎంపీడీవో గాయత్రి పర్యటన

నంద్యాల: బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామంలో శుక్రవారం ఎంపీడీవో గాయత్రి శుక్రవారం పర్యటించారు. ఇంటి పన్ను, కులాయి పన్నులు సక్రమంగా చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని ప్రజలకు సూచించారు. పారిశుద్ధ్య పనులు సరిగా లేవని, దోమల బెడద పెరిగిందని గ్రామస్తులు చెప్పగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

March 6, 2026 / 03:36 PM IST

దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేసిన ఎంపీ

NTR: విస్సన్నపేట మండలంలో ఎంపీ కేశినేని చిన్ని శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన ముచ్చటించారు. టీడీపీ కార్యాలయం వద్ద ఇద్దరు దివ్యాంగులకు ట్రై సైకిళ్లను మండల పార్టీ నాయకులతో కలిసి ఎంపీ అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

March 6, 2026 / 03:35 PM IST

అప్రెంటిస్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

MLG: ఏటూరునాగారం పట్టణంలోని ప్రభుత్వ RITI (T)లో అప్రెంటిస్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు మార్చి 2 నుంచి 15 వరకు దరఖాస్తు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు వరంగల్ ITI బాయ్స్ క్యాంపస్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.

March 6, 2026 / 03:33 PM IST

కార్యకర్తలే పార్టీకి నిజమైన హీరోలు: మాజీ మంత్రి

సత్యసాయి: తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే నిజమైన హీరోలని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన మండల కమిటీ సభ్యుల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

March 6, 2026 / 03:33 PM IST

‘చిన్నారులకు సరైన పౌష్టికాహారం అందించాలి’

VKB: అంగన్వాడీ కేంద్రాలలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచి చిన్నారులకు సరైన పౌష్టికాహారం అందించాలని కౌన్సిలర్ విశ్వనాథం రాఘవేందర్ పేర్కొన్నారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని 23వ వార్డు వెంకటేశ్వరనగర్ కాలనీలో ప్రజాపాలన 99 రోజుల ప్రణాళికలు స్థానికులతో ప్రతిజ్ఞ చేయిస్తూ రాబోయే 99 రోజులలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు.

March 6, 2026 / 03:33 PM IST

రేపే ‘ధురంధ‌ర్ 2’ ట్రైలర్

రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ మూవీ ట్రైలర్ రేపు ఉ.11:01 గంటలకు విడుదల కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో సంజయ్ దత్, మాధవన్, సారా అర్జున్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘ధురంధర్’ రూ.1,300 కోట్లకు పైగా వసూళ్లతో భారీ విజయాన్ని అందుకోవడంతో సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

March 6, 2026 / 03:33 PM IST

మృత్యుపాశంలా తెరిచి ఉన్న గేట్ వాల్

NLG: జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ మలుపు వద్ద తెరిచి ఉన్న గేట్ వాల్ వాహనదారులకు ప్రాణసంకటంగా మారింది. స్కూల్ వెనుక వైపు నివసించే స్థానికులు, వాహన దారులు ఈ మలుపు వద్ద తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో, మున్సిపల్ అధికారులు వెంటనే ప్రమాదాలను నివారించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

March 6, 2026 / 03:32 PM IST