• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు’

BPT: ప్రభుత్వ స్థలాలను ఆక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బాపట్ల తహసీల్దార్ షేక్ సలీమా హెచ్చరించారు. శనివారం తహసీల్దార్ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. మరుప్రోలువారిపాలెం గ్రామంలోని సర్వే నం. 234/5లో 12 సెంట్ల భూమిని కోడూరు హనుమంతరావు, కోడూరు రామకృష్ణ, మున్నం వెంకటేశ్వరరెడ్డి, కోకి పోలిరెడ్డి తమదని కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.

February 21, 2026 / 03:55 PM IST

పేరేచర్ల లేఅవుట్‌ను పరిశీలించిన కలెక్టర్

GNTR: మేడికొండూరు మండలంలోని పేరేచర్ల భారీ గృహ లేఅవుట్‌ను కలెక్టర్ అన్సారియా శనివారం సందర్శించారు. మొత్తం 18,090 ఇళ్లలో, 9,600 అర్బన్ గృహాలు ఉన్నాయని.. ఈ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు త్వరగా ఇళ్లను అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

February 21, 2026 / 03:55 PM IST

చెత్త రహిత తిరుపతికి ప్రజల సహకారం అవసరం

TPT: చెత్త రహిత, సుందర తిరుపతి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇవాళ దండి మార్చ్ వద్ద ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫోర్ బిన్ సిస్టం ద్వారా తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలు, ఈ-వేస్ట్‌గా చెత్తను వేరు చేయాలని సూచించారు.

February 21, 2026 / 03:55 PM IST

‘మెనూ సక్రమంగా అమలు చేయాలి’

SKLM: అంగన్వాడీలు సమయపాలన పాటించాలని మందస సీడీపీవోపీ అరుణ అన్నారు. శనివారం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రీ స్కూల్ సిలబస్ ప్రకారం అమలు జరపాలని సూచించారు. మెనూ సక్రమంగా అమలు చేయాలని ఆదేశించారు. చిన్నారులకు ఈ కేవైసీ, ఆధార్ పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. టేక్ హోమ్ రేషన్ శత శాతం అమలు జరపాలని సూచించారు.

February 21, 2026 / 03:55 PM IST

ఘనంగా దేవాలయ మొదటి వార్షికోత్సవం

RR: చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని రామంతపూర్‌లో ఎల్లమ్మ దేవాలయం మొదటి వార్షికోత్సవాన్ని గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పురవీధుల గుండా ఊరేగించారు. కౌన్సిలర్ బండ్లగూడ ప్రశాంత్, గ్రామ పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

February 21, 2026 / 03:54 PM IST

మిలీనియం క్యాంపస్ డ్రైవ్‌లో 20 మంది ఎంపిక

VSP: డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా రంగాల్లో అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్‌లో 20 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. మిలీనియం సాఫ్ట్ వేర్ సొల్యూష‌న్స్ సెంట్రల్ మేనేజర్ రవికుమార్ తెలిపారు. సుమారు 55 మంది అభ్యర్థులు పాల్గొనగా, సోషల్ మీడియా, గ్రాఫిక్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహింవారు.

February 21, 2026 / 03:52 PM IST

స్వచ్చాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

PLD: చిలకలూరిపేట పట్టణంలోని 12వ వార్డు దాసరి కాలనీలో శనివారం నిర్వహించిన స్వచ్చాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఇందులో మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులతో కలిసి పరిసరాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాల వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

February 21, 2026 / 03:52 PM IST

పెదభోగిలలో సంచార వైద్య పరీక్షలు

PPM: సీతానగరం పెదభోగిల పంచాయతీ సుంకరవీధిలో శనివారం డాక్టర్ ఉషారాణి ఆధ్వర్యంలో సంచార వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీపీ, షుగర్, హెమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేసారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు బీపీ, షుగర్ పరీక్షల అనంతరం ప్రతి నెల ఏ మేరకు మెరుగవుతుందో పరిశీలించారు. అనంతరం వడదెబ్బ గురించి అవగాహన కల్పించారు.

February 21, 2026 / 03:52 PM IST

భక్తుల మనోభావాలను గౌరవించాలి: గోవా గవర్నర్

శ్రీవారి భక్తుల మనోభావాలను అందరూ గౌరవించాలని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. అసెంబ్లీలోకి స్వామివారి ఫొటోలు తీసుకురావడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. దేవుడి చిత్రపటాలను అవమానపరచకూడదని, ఇది భక్తుల నమ్మకాలకు సంబంధించిన విషయమని హితువు పలికారు. ముఖ్యంగా ప్రసాదాల నాణ్యత, పవిత్రత విషయంలో భక్తుల్లో పూర్తిస్థాయిలో విశ్వాసాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

February 21, 2026 / 03:52 PM IST

‘అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి’

NRML: ప్రజలు అపరిచిత వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కడెం ఎస్సై సాయికిరణ్ సూచించారు. కడెం మండలంలోని అంబర్పేట్ గ్రామపంచాయతీ ఆవరణలో అపరిచితుల గురించి సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. బైక్ నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని గ్రామంలోకి ఎవరైనా అపరిచిత వ్యక్తులు వచ్చినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

February 21, 2026 / 03:52 PM IST

కానిస్టేబుల్ కుమారుడికి 7 లక్షల సహాయం అందజేత

NTR: మాచవరం పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దిలీప్ కుమారుడికి అనారోగ్యం నిమిత్తం ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు 20 లక్షలు నగదు అవసరం అయింది. విషయం తెలుసుకున్న సెంట్రల్ ఏసీపీ దామోదర్ సజ్జ కిషోర్, చారిటబుల్ ట్రస్ట్‌తో మాట్లాడి ఏడు లక్షల నగదును శనివారం ఇప్పించారు. ఈ మేరకు బాలుడికి ఆపరేషన్ చేయించనున్నట్లు సమాచారం.

February 21, 2026 / 03:50 PM IST

భద్రగిరి ఆసుపత్రికి సీసీ రోడ్డు నిర్మాణ పనులు

PPM: గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో గల భద్రగిరి 50 పడకల ఆసుపత్రికి సీసీ రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రూ.7 లక్షల 65 వేల NREGS నిధులతో చేపట్టిన రోడ్డు పనులు చివరి దశకు వచ్చాయని ఐటీడీఏ ఏఈఈ సింగంపల్లి అప్పారావు తెలిపారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నామని వెల్లడించారు. రహదారి పనులు పూర్తయిన వెంటనే ప్రారంభిస్తామన్నారు.

February 21, 2026 / 03:49 PM IST

వినుకొండ అభివృద్ధికి నిధులు కేటాయించాలని వినతి

PLD: వినుకొండ విచ్చేసిన సీఎం చంద్రబాబుకు శనివారం ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా పట్టణంలో స్టేడియం నిర్మాణానికి రూ. 50 కోట్లు కేటాయించాలని, అలాగే పెండింగ్‌లో ఉన్న ఇతర సమస్యలను పరిష్కరించాలని సీఎంను కోరారు.

February 21, 2026 / 03:49 PM IST

విద్యార్థులకు పరీక్షల కిట్ అందజేసిన మాజీ కార్పొరేటర్

RR: శేరిలింగం పల్లి నియోజకవర్గం హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అలీ తలాబ్ చెరువు వద్ద ఉన్న తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కాలేజీలో క్షత్రియ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పదవ తరగతి, జూనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షల కిట్ (జామెట్రీ బాక్స్, ప్యాడ్, కలములు) విద్యార్థులకు మాజీ కార్పొరేటర్ నర్నె శ్రీనివాస్ రావు అందచేశారు.

February 21, 2026 / 03:48 PM IST

ముంచంగిపుట్టు సంతలో రైతుల సమస్యలపై ఆరా

ASR: ముంచంగిపుట్టులోని స్థానిక వారపు సంతను అగ్రికల్చర్ మార్కెట్ ఛైర్మన్ బోరి బోరి లక్ష్మి శనివారం పరిశీలించారు. కనీస వసతులు లేక ఎండ, వానలకు ఇబ్బందులు పడుతున్నామని రైతులు, వ్యాపారులు ఆమె ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సంతలో తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అప్పలస్వామి, పోతురాజు, సుబ్బారావు పాల్గొన్నారు.

February 21, 2026 / 03:48 PM IST