మధ్యప్రదేశ్ షాడోల్ జిల్లా పురానీబస్తీలో విషాదం నెలకొంది. ఆన్‌లైన్ గేమ్‌లో సర్వం కోల్పోయిన శంకర్ లాల్ కుటుంబం.. కూల్‌డ్రింక్‌లో విషం కలుపుకుని తాగారు. ఈ క్రమంలో కూతురు స్వాతి, శంకర్ లాల్ మృతి చెందారు. భార్య రాజకుమారి పరిస్థితి విషమంగా ఉండగా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ATP: జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ సమక్షంలో పలువురు యువకులు పార్టీలో చేరారు. యువమోర్చా నాయకులు తేజశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో దివాకర్ నాయక్, రజక శ్రీకాంత్, చక్రధర్ రెడ్డి, మనిదీప్, సురేంద్ర పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి రాజేష్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు ఉంటుందని రాజేష్ తెలిపారు.
KNR: జమ్మికుంటలో ఈరోజు ఉదయం 11 గంటలకు సీపీ గౌస్ ఆలం ఆధ్వర్యంలో వినాయక ఫంక్షన్ హాల్లో మోటారు వాహనాల డ్రైవర్ల కోసం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ తెలిపారు.హెవీ గూడ్స్, ఆటో ట్రాక్టర్ డ్రైవర్లు శిబిరానికి హాజరై పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అవసరమైన వారికి ఉచిత కళ్లజోడు కమిషనర్ చేతుల మీదుగా పంపిణీ చేస్తారని అన్నారు.
HYD: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ విత్ ఇంటెలెక్చువల్ డిసెబిలిటీస్ ఆధ్వర్యంలో యూత్ 4 జాబ్స్ సహకారంతో దివ్యాంగుల కోసం ప్రత్యేక జాబ్ మేళా ఈనెల 27న సికింద్రాబాద్‌లోని NIEPID క్యాంపస్‌లో జరగనుంది. అర్హులైన అభ్యర్థులు తమ బయోడేటా, ఆధార్ కార్డు, దివ్యాంగ ధృవీకరణ పత్రం లేదా UDID కార్డు, విద్యార్హత సర్టిఫికేట్లు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు తీసుకురావాలన్నారు.
AP: వైసీపీ హయాంలో గృహ నిర్మాణంలో అక్రమాలు జరిగాయని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. ‘గత ప్రభుత్వకాలంలో ఇళ్ల పట్టాలిచ్చి భూములు ఇవ్వలేదు. భూములు కొని ఇస్తామని ప్రజలను మభ్య పెట్టారు. పేదలకు అర్బన్‌లో 2 సెంట్లు, రూరల్‌లో 3 సెంట్లు.. ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’ అని వెల్లడించారు.
MLG: రాష్ట్ర ప్రభుత్వం భారీగా కలెక్టర్‌ను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల్లో ఏటూరునాగారం ITDA ప్రాజెక్టు అధికారి చిత్ర మిశ్రాను కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా నియమించారు. చిత్ర మిశ్రా 2019లో ఏటూరునాగారం ITDA POగా బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు చిత్ర మిశ్రాకు శుభాకాంక్షలు తెలిపారు.
MDCL: ఉప్పల్లో ఇంటర్మీడియట్ పరీక్షకు వచ్చిన ఓ విద్యార్థినికి సెంటర్ తెలియక ఉప్పల్ చౌరస్తా వద్ద ఆందోళనతో ఏడుస్తూ ఉండగా.. అక్కడే విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ 3656 శ్రీనివాస్ పరిస్థితి తెలుసుకుని వెంటనే స్పందించారు. తన బైక్ పై కేవలం 3 నిమిషాల్లోనే విద్యార్థినిని శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్, ఐడిఏ ఉప్పల్‌కు సురక్షితంగా చేర్చారు.
AP: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై వైసీపీ అసత్యాలు చెబుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై వైసీపీ ఎమ్మెల్సీల ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. 2020లోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపేశారని పేర్కొన్నారు. ఆ సమయంలో జగన్ సీఎంగా ఉన్నారని తెలిపారు.
BDK: చుంచుపల్లి మండలం కంకర మిల్లు సమీపంలో ఓ కంటైనర్‌లో నిషేధిత గంజాయి తరలిస్తున్నట్లు సమాచారంతో పోలీసులు గురువారం తనిఖీ నిర్వహించారు. ఓ కంటైనర్ను తనిఖీ చేయగా గంజాయి ఉన్నట్లు తేలింది. దీంతో ఆ కంటైనర్ను పోలీస్ స్టేషన్‌కు తరలించి డ్రైవర్ల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
NLG: దేవరకొండ పట్టణంలో మూడవ వార్డు శాలిబండలో ఒక విద్యుత్ స్తంభం గాలి దుమారానికి వంగిపోయి కూలిపోయే స్థితికి చేరింది. ఇది ఎప్పుడైనా ఇళ్లపై పడే అవకాశం ఉండటంతో స్థానికులు ముఖ్యంగా చిన్న పిల్లల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. స్తంభం పక్కనే కొత్తది అందుబాటులో ఉన్నందున కనెక్షన్లను దానికి మార్చి పాత స్తంభాన్ని తొలగించాలని కాలనీవాసులు కోరుతున్నారు.
శ్రీకాకుళం నగరంలో ఐదు వార్డు సచివాలయాల పరిధిలో ఈనెల 23 నుంచి డయేరియా ప్రధాన సమస్యగా మారింది. గరిష్టంగా 102 కేసులు నమోదు కావడంతో యంత్రాంగాన్ని ఆందోళన గురి చేసింది. ఈ నేపథ్యంలో గురువారం నాటికి కొంతవరకు తగ్గు ముఖం పట్టింది. ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించి, ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు.
SDPT: సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ ఆదేశాల మేరకు పట్టణంలో పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయి. పట్టణంలోని పలు కాలనీలలో నిండుకున్న డ్రైనేజీలు పారిశుద్ధ్య కార్మికులు క్లీన్ చేస్తున్నారు. ప్రధాన రోడ్లపై ఉన్న చెత్తాచెదారం మట్టిని తొలగించారు. ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించి డంపింగ్ యార్డ్‌కు తరలించారు.
HYD: రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలుకు బొల్లారం స్టేషన్‌లో స్టాపేజ్ కల్పించారు. తిరుపతి నుంచి సాయంత్రం 5:35 బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5:40 సమయానికి సికింద్రాబాద్ చేరుకుంటుంది. బొల్లారం వచ్చేసరికి ఉదయం 6:15 అవుతుందని రైల్వే అధికారులు తెలిపారు. తిరుగు ప్రయాణంలో బొల్లారంలో సాయంత్రం 4:09 గంటలకు రైలు అందుబాటులో ఉంటుందని SCR అధికారులు తెలిపారు.
తిరుపతి స్విమ్స్ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు మార్చి 3 నుంచి 6వ తేదీ వరకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. మెడికల్ ఆఫీసర్లు-4, స్టాఫ్ నర్సులు-4, ఏఎన్ఎం-4, మమోగ్రఫీ టెక్నీషియన్-2, కార్డియో వాస్క్యలర్ టెక్నీషియన్ గ్రేడ్-2, డీఏవో-2, పీఆర్వో-2, మెడికో సోషల్ వర్కర్-2, ఎలక్ట్రిషియన్-62, డ్రైవర్లు-2 పోస్టులు ఉన్నాయి. svimstpt.ap.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.
KMM: ఖమ్మం రెవెన్యూ డివిజనల్ అధికారి జి. నరసింహారావును జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి బదిలీ చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి లోకేష్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో మెట్‌పల్లిలో విధులు నిర్వర్తిస్తున్న ఎన్.శ్రీనివాస్ను ఖమ్మం ఆర్డీఓగా నియమించారు. పరస్పర బదిలీల్లో భాగంగా ఈ నియామకాలు జరిగాయి.