• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదలకు ఆర్థిక భరోసా

SKLM: సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదలకు ఆర్థిక భరోసా కలుగుతుందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో ఎల్‌ఎన్ పేట మండలానికి చెందిన యశోదమ్మకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ. 70,322లక్షల వేల చెక్కులను పంపిణీ చేశారు. ఈ నిధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వారు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.

March 3, 2026 / 12:26 PM IST

డ్రైనేజ్ కాలువ పనులు ప్రారంభం

KDP: బద్వేల్ పరిధిలోని ఆంజనేయ నగర్ ప్రాంతంలో 15వ ఆర్థిక సంఘం రూ.7,50,000 నిధులతో డ్రైనేజ్ కాలువ పనులు ప్రారంభమైనట్లు మున్సిపల్ కమీషనర్ నరసింహారెడ్డి గారు తెలిపారు. ఈ పనులు పూర్తయిన తర్వాత మురుగు నీటితో పాటు వర్షాకాలంలో నీరు నిల్వ కాకుండా సాఫీగా వెళ్లే విధంగా సదుపాయం కలుగుతుందని తెలిపారు.

March 3, 2026 / 12:26 PM IST

ఈ వారం ఓటీటీ మూవీలివే..!

➠ ‘విత్ లవ్’- నెట్‌ఫ్లిక్స్ – మార్చి 6➠ ‘హలో బచ్చో’ – నెట్‌ఫ్లిక్స్ – మార్చి 6➠ ‘ఓం శాంతి శాంతి శాంతిః’ – ఆహా – మార్చి 4➠ ‘చరిత కామాక్షి’ – ఈటీవీ విన్ – మార్చి 5➠ ‘గాంధీ టాక్స్’ – జీ5 – మార్చి 6➠ ‘సుబేదార్’ – అమెజాన్ ప్రైమ్ -మార్చి 5.

March 3, 2026 / 12:26 PM IST

నూతన వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు

ASF: వాంకిడి మండలంలోని గ్రామపంచాయతీల్లో నూతన వార్డు సభ్యులకు ఈనెల 4వ తేదీ నుంచి 5రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు MPDO పాటిల్ జ్యోత్స్న మంగళవారం ప్రకటనలో తెలిపారు. విధులు, బాధ్యతలు, అభివృద్ధిలో సభ్యుల పాత్ర అనే అంశాలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. వార్డు సభ్యులందరూ ఈ శిక్షణకు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.

March 3, 2026 / 12:25 PM IST

సీఐ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు

VZM: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఆదేశాలతో కొత్తవలస సీఐ షణ్ముఖరావు ఆధ్వర్యంలో గురుదేవా చారిటబుల్ ట్రస్టు సహకారంతో ఉచిత మెడికల్ క్యాంపు మంగళవారం నిర్వహించారు. ఉచిత మెడికల్ క్యాంపులో డా. కామాక్షి పాల్గొని, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగితెలుసుకుని మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళ పోలీసులు పాల్గొన్నారు.

March 3, 2026 / 12:25 PM IST

ప్రజలకు కేసీఆర్ హోలీ శుభాకాంక్షలు

TG: రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రంగుల పండుగ ప్రజల మధ్య ప్రేమ, సోదరభావాన్ని పెంపొందించాలని ఆయన కోరుకున్నారు. ప్రకృతిలో వసంత కాలానికి చిహ్నమైన హోలీ.. అందరి జీవితాల్లో కొత్త ఆశలు, ఆత్మవిశ్వాసాన్ని నింపాలని ఆకాంక్షించారు. సామాజిక సామరస్యం వెల్లివిరియాలని తన సందేశంలో కేసీఆర్ పేర్కొన్నారు.

March 3, 2026 / 12:23 PM IST

విజయ్‌పై నటుడు సత్యరాజ్‌ సంచలన వ్యాఖ్యలు

TVK అధినేత విజయ్‌పై నటుడు సత్యరాజ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. విషయం లేని వాళ్లే.. సినిమా డైలాగులు మాట్లాడతారని ఎద్దేవా చేశారు. పంచ్ డైలాగులు జనం చప్పట్లకు మాత్రమే ఉపయోగపడతాయని తెలిపారు. సినిమా వేరు.. రాజకీయాలు వేరని స్పష్టం చేశారు. పనికిమాలిన మాటలు.. ప్రతి నటుడూ చెబుతాడని అన్నారు. రాజకీయాలకు సిద్ధాంతాలు తప్పనిసరి అని తెలిపారు.

March 3, 2026 / 12:21 PM IST

సమస్యల పరిష్కారానికి కృషి..!

MNCL: లక్షెటిపేట మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని వార్డు కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ అన్నారు. మంగళవారం వార్డులోని పలు కాలనీలలో అనే పర్యటించారు. ఈ సందర్భంగా స్తంభాలకు నిరుపయోగంగా వున్న వెలగని దీపాలను మున్సిపాలిటీ సిబ్బందితో తీసివేయించి నూతన విద్యుత్ దీపాలను అమర్చారు. వార్డులో సమస్యలు ఉంటే తనకు తెలపాలన్నారు.

March 3, 2026 / 12:19 PM IST

శ్రీరామనవమి బ్రహ్మరథోత్సవాల ఏర్పాట్లు పై సమావేశం

సత్యసాయి: మడకశిర మండలం నీలకంఠాపురంలో శ్రీరామనవమి బ్రహ్మరథోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం కీలక సమీక్షా సమావేశం జరిగింది. ఆలయ కమిటీ ఛైర్మన్ రఘువీరా రెడ్డి ఆధ్వర్యంలో గోవిందాపురం, గంగలవాయి పాళ్యం పంచాయతీల గ్రామ పెద్దలతో కలిసి ఉత్సవాల నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించారు. సామూహిక ఉచిత వివాహాలు, బ్రహ్మరథోత్సవం, పుట్ల పురుష నిర్వహించనున్నారు.

March 3, 2026 / 12:19 PM IST

పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

E.G: రంగంపేట మండలం వడిశలేరులో సుమారు రూ.98 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు నిర్మాణానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.15 లక్షలతో బోర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే, స్థానిక సొసైటీ వద్ద శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

March 3, 2026 / 12:18 PM IST

టీమిండియా ఫీల్డింగ్ సరిగా లేదు: మహ్మద్ ఆమిర్

టీమిండియాపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ ఆమిర్ మరోసారి తన అక్కసు వెల్లగక్కాడు. టీమిండియా సరైన క్రికెట్ ఆడటం లేదని.. ఫీల్డింగ్ సరిగా లేదని వ్యాఖ్యానించాడు. భారత ప్లేయర్లు కనీసం 4 క్యాచ్‌లు వదిలేశారని అన్నాడు. బంతిని ఆపే క్రమంలో తడబాటుకు గురయ్యారని చెప్పాడు. అలాగే, హార్దిక్ పాండ్యా పెద్ద జట్లపై సరైన ప్రదర్శన చేయలేడని తెలిపాడు.

March 3, 2026 / 12:16 PM IST

డోన్‌లో రోటరీ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

NDL:డోన్‌లో రోటరీ క్లబ్ 2026-27 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. క్లబ్ సభ్యులు సమావేశమై కొత్త అధ్యక్షుడిగా గంగిరెడ్డిని కార్యదర్శిగా మల్లారెడ్డిని ఎంపిక చేశారు. గత సంవత్సరాల్లో క్లబ్ నిర్వహించిన సేవా కార్యక్రమాలను మరింత విస్తరించే దిశగా కొత్త కార్యవర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు. సభ్యులందరూ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియాజేశారు.

March 3, 2026 / 12:16 PM IST

ఈ నెల 6న జిల్లాలో జాబ్ మేళా

PPM: గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఈనెల 6న ఉదయం10 గంటలకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వహీదా తెలిపారు. మేళాలో 14 రకాల కంపెనీలు 1500కి పైగా ఖాళీలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. 18 సంవత్సరాలు పైబడిన టెన్త్, ITI, డిప్లమో, డిగ్రీ పాస్ అయిన వారు అర్హులు. https://forms.gle /XBJDhj1QVsGZtek68 లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

March 3, 2026 / 12:16 PM IST

హామీని అమలు చేసిన కార్పొరేటర్

కరీంనగర్ నగర పాలక సంస్థ 14వ డివిజన్ చింతకుంట వాసుల ఏళ్లనాటి కష్టానికి తెరపడింది. శ్మశానవాటిక సమీపంలోని డంప్ యార్డు వల్ల స్థానికులు పడుతున్న ఇబ్బందులను ఎన్నికల సమయంలో కార్పొరేటర్ గడ్డి ప్రదీప్ గుర్తించారు. ఇచ్చిన హామీ మేరకు అధికారులతో కలిసి ఇవాళ పర్యవేక్షించి, యార్డును అక్కడి నుంచి ఇతర ప్రాంతానికి తరలించారు. దీంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

March 3, 2026 / 12:15 PM IST

వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత: FRO

ADB: అడవుల, వన్యప్రాణుల సంరక్షణ మనందరి బాధ్యత అని ఇచ్చోడ FRO నాగవత్ స్వామి అన్నారు. సిరికొండ మండలంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతు.. అభయారణ్యం విశిష్ఠత గురించి ప్రజలకు, విద్యార్థులకు వివరించారు. అడవులు వన్యప్రాణులు ఉంటేనే మనిషికి భవిష్యత్తు ఉంటుందని FRO నాగవత్ స్వామి వెల్లడించారు. కార్యక్రమంలో FSOలు చంద్రరెడ్డి, తదితరులు ఉన్నారు.

March 3, 2026 / 12:15 PM IST