• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న కడియం

JN: లింగాల గణపురం మండలం గుమ్మడివల్లి గ్రామస్తులతో నేడు ఎమ్మెల్యే కడియం ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు సాగు నీరు అందడం లేదని తెలుపగా వెంటనే ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి రేపు కాలువను పరిశీలించి గుమ్మడివెల్లి చెరువులోకి నీరు చేరే విధంగా చర్యలు తీసుకువాలని సూచనలు చేశారు.

March 9, 2026 / 06:10 PM IST

ACB వలకు చిక్కిన ఇద్దరు SIలు

TG: హైదరాబాద్‌లో ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్లు ఏసీబీ వలకు చిక్కారు. ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఆర్మ్‌డ్ రిజర్వ్ SIగా పనిచేస్తున్న ప్రమోద్ గౌడ్, జాతావత్ బాబు నాయక్ ఒక సైబర్ క్రైమ్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు రూ. లక్ష లంచం డిమాండ్ చేశారు. ఈ లంచం మొత్తాన్ని స్వీకరిస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

March 9, 2026 / 06:09 PM IST

సీసీ రోడ్లకు భూమి పూజ

ASF: దహెగాం మండలం చౌక గ్రామపంచాయతీలో నూతనంగా మంజూరైన సీసీ రోడ్డు పనులకు సర్పంచ్, ఉప సర్పంచ్‌లు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. తమ పదవీ కాలంలో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమని, ప్రజలకు మెరుగైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పెద్ద పాల్గొన్నారు.

March 9, 2026 / 06:07 PM IST

సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు

ఖమ్మం కిన్నెర నర్సింగ్ కళాశాల విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ డీఎస్పీ ఫణిందర్ మాట్లాడుతూ.. టెక్నాలజీ యుగంలో విద్యార్థులు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని ఆయన స్పష్టం చేశారు.

March 9, 2026 / 06:07 PM IST

యాదాద్రి కలెక్టర్‌కు ఎమ్మెల్యే అభినందనలు

BHNG: జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనురాగ్ జయంతిని MLA కుంభం అనిల్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. MLAతో పాటు మున్సిపల్ ఛైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ ఛైర్ పర్సన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు కలెక్టర్‌ను కలిసి అభినందనలు తెలియజేశారు.

March 9, 2026 / 06:06 PM IST

అసంపూర్తిగా తెనాలి గోలిడొంక రోడ్డు పనులు

GNTR: తెనాలిలోని ఐతానగర్ నుంచి గోలిడొంక వెళ్లే రోడ్డు పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రూ.40 లక్షల అంచనాతో 270 మీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మాణానికి టెండర్లు ఖరారైనప్పటికీ, సగం పనులు మాత్రమే చేసి వదిలేశారు. దీంతో రాకపోకలు నరకప్రాయంగా మారాయని, వెంటనే అధికారులు స్పందించి పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

March 9, 2026 / 06:05 PM IST

డ్రంకెన్ డ్రైవ్.. భారీగా జరిమానా..!

VZM: మద్యం సేవించి వాహనాలు నడిపిన 107 మందికి జిల్లా కోర్టు రూ.10.70 లక్షల భారీ జరిమానా విధించింది. ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఫైన్ పడిందని ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ సోమవారం తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లాలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ పేర్కొన్నారు.

March 9, 2026 / 06:05 PM IST

బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సినీ నిర్మాత

KMR: నర్సింగ్ పల్లిలోని ఇందూరు తిరుమల క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు 2 రోజుకు చేరాయి. దేవనాథ జీయర్ స్వామి మాట్లాడుతూ.. నమ్మకంతో దేవుడిని కొలిస్తే అసాధ్యమైన కోరికలు కూడా నెరవేరుతాయని తెలిపారు. లోక కల్యాణం కోసమే బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారని, భక్తుల మొక్కులను గరుత్మంతుడు స్వామివారికి చేరవేస్తాడని వివరించారు. ఈ వేడుకల్లో ధర్మకర్తలు సినీ నిర్మాత దిల్ రాజు ఉన్నారు.

March 9, 2026 / 06:04 PM IST

విషాదం.. కుమారుడితో చెరువులో దూకిన తల్లి

AP: కాకినాడ(D) కోటనందూరు(M) కాకరాపల్లిలో విషాదం చోటుచేసుకుంది. మూడేళ్ల కుమారుడితో కలిసి చెరువులో దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది. మృతులను నర్సీపట్నం పెదబొడ్డేపల్లికి చెందిన భాగ్యలక్ష్మి, సాయిగా గుర్తించారు. భర్త, అత్తమామల వేధింపులే కారణమని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుమార్తె మరణానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

March 9, 2026 / 06:04 PM IST

రౌడీషీటర్లు, అనుమానితులకు పోలీసుల కౌన్సెలింగ్

TPT: ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా రౌడీషీటర్లు, అనుమానితులకు పోలీస్ అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. చట్టాన్ని గౌరవిస్తూ సత్ప్రవర్తనతో మెలగాలని, భవిష్యత్తులో చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓజిలిలో రౌడీ షీటర్లు, అనుమానితులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.

March 9, 2026 / 06:04 PM IST

పీజీ పరీక్షలు.. 30 మంది గైర్హాజరు

NZB: టీయూ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పీజీ, ఇంటిగ్రేటెడ్ ఫీజు మొదటి, MBA 7వ సెమిస్టర్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం 4 పరీక్షా కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 529 మంది విద్యార్థులకు 499 మంది హాజరు కాగా 30 మంది గైర్హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు.

March 9, 2026 / 06:02 PM IST

ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి

MBNR: జడ్చర్ల పట్టణం క్లబ్ రోడ్‌లోని కువాతుల్ ఇస్లాం మజీద్‌లో రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా సోమవారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అల్లా ఆశీస్సులు అందరిపైనా ఉండాలని ఆకాంక్షించారు. అలాగే రంజాన్ మాసం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

March 9, 2026 / 06:02 PM IST

కష్టపడి చదివితే మంచి మార్కులు: కలెక్టర్

SRD: విద్యార్థులు కష్టపడి చదివితే మంచి మార్కులు వస్తాయని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ఇవాళ ఇస్నాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని చెప్పారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి ఎలా చదువుతున్నారని అడిగి తెలుసుకున్నారు.

March 9, 2026 / 06:02 PM IST

అమ్మాయి పెళ్లికి వివాహ కానుకగా రూ. 10,016 అందజేత

NLG: చిట్యాల మండలం పెద్ద కాపర్తి సర్పంచ్‌గా కాటం వెంకటేశం గెలవగానే, గ్రామంలో అమ్మాయిల పెళ్లికి రూ. 10,016 ఇస్తానని దేవస్థాన ఛైర్మన్ ఓర్సు రాజకుమార్ ప్రకటించారు. తాజాగా నూతి శ్రీను కుమార్తె జ్ఞానేశ్వరి వివాహం సందర్భంగా.. సోమవారం ఈ నగదును సర్పంచ్ ఆమెకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

March 9, 2026 / 06:01 PM IST

ఉపాధి కూలీలకు వారం కూలీ చెల్లించాలి: CPM

WNP: ఉపాధి హామీ కూలీలకు వారానికి ఒకసారి కూలీ చెల్లించాలని CPM జిల్లా కార్యదర్శి ఆంజనేయులు డిమాండ్ చేశారు. సోమవారం వనపర్తి మండలంలోని దత్తాయపల్లి, అంజనగిరి, చందాపూర్ ఉపాధి కూలీలను పార్టీ జిల్లా కమిటీ కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. గత 4వారాలుగా చేసిన పనికి కూలి చెల్లించకపోవడంతో కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

March 9, 2026 / 06:01 PM IST