ASF: దహెగాం మండలం చౌక గ్రామపంచాయతీలో నూతనంగా మంజూరైన సీసీ రోడ్డు పనులకు సర్పంచ్, ఉప సర్పంచ్లు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. తమ పదవీ కాలంలో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమని, ప్రజలకు మెరుగైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పెద్ద పాల్గొన్నారు.