MHBD: ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద స్వయం ఉపాధి పొందే ఎస్సీ యువత కోసం సబ్సిడీ వాహనాల (ఈవీ టూవీలర్లు, ఆటోలు, సోలార్ పంపుసెట్లు) దరఖాస్తుల స్వీకరణ ఇవాళ ఆఖరిరోజని జిల్లా కార్యనిర్వాహక సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. 70-90% సబ్సిడీ లభించే ఈ వాహనాలకు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరని, అర్హులు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.