NLR: బుచ్చి పట్టణంలోని 20 వార్డులలో దోమల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి సమయంలో దోమలు విపరీతంగా పెరగడంతో తాము అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని వాపోతున్నారు. దోమల నివారణకు అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారని మండిపడుతున్నారు. అధికారులు స్పందించి దోమల నివారణపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
సత్యసాయి: హిందూపురంలోని మూడో వార్డులలో హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ రమేశ్ కుమార్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే 3వ వార్డులో సచివాలయం సందర్శించి, రికార్డులను పరిశీలించారు. సచివాలయ సిబ్బంది విధులు నిర్వహణపై మాట్లాడారు. ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని అర్హులైన వారందరికీ అందేలా చూడాలన్నారు.
కాకినాడ: జిల్లాలో 48 మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడిన శోంటిని గంగాధర్‌ను పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. పిఠాపురం గౌరవ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు నిందితుడిని హాజరపరచగా ఒక్కో కేసుకు 2 సం.ల జైలుశిక్ష విధించారని తెలిపారు. అయితే ఈ వాహనాల కొన్న 6 మంది వ్యక్తులకు రూ. 3వేలు జరిమానా విధించారని సీఐ శ్రీనివాస్ తెలిపారు.
UPలోని హమీర్‌పూర్‌లో ఫిబ్రవరి 24న వివాహమైన జంట కొన్ని గంటలకే విడిపోయింది. అత్తవారింటికి వెళ్లిన వధువు మిథిలేష్ కుమారి.. తల్లిదండ్రుల బలవంతం వల్లే ఈ పెళ్లి జరిగిందని, తాను వేరొకరిని ప్రేమిస్తున్నానని అత్తవారింట్లో తేల్చి చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు ఇరు కుటుంబాల అంగీకారంతో వారు తక్షణమే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.
VKB: పెద్దేముల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ DMHO రవీందర్ యాదవ్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రిలో రికార్డులను, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించి అక్కడున్న రోగులతో వైద్య సేవలు ఎలా అందుతున్నాయని? అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మౌలిక సదుపాయాలు అందిస్తున్నారా లేదా? అంటూ కలియతిరిగి పరిశీలించారు.
SRPT: హుజూర్నగర్లో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం దొడ్డ వెంకటయ్య అధ్యక్షతన జరిగింది. గత కార్యక్రమాల సమీక్షతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ మాట్లాడుతూ.. మార్చి 9న కార్మిక, రైతు పార్లమెంట్, మార్చి 10 నుంచి ఏప్రిల్ 13 వరకు దేశవ్యాప్తంగా మహాపంచాయత్‌లు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
SRPT: తెలంగాణ సాయుధ పోరాట యోధులు, స్వాతంత్ర సమరయోధులు, కామ్రేడ్ చిల్లంచర్ల రఘునాథం సతీమణి చిల్లంచర్ల వరలక్ష్మి మృతి అత్యంత బాధాకరమని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందిన ఆమె పార్థివ దేహాన్ని ఆయన సందర్శించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుబటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ELR: నాటుసారా నిర్మూలనే లక్ష్యంగా చింతలపూడి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు శుక్రవారం నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత దాడులు నిర్వహించారు. పాత కేసుల్లోని నిందితులను మండల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్లు అధికారులు తెలిపారు. మెజిస్ట్రేట్ బైండోవర్ విధించారని, అక్రమ మద్యం తయారీ, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు.
SRPT: మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఎస్సై మోహన్ బాబు తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టామన్నారు. ‘అరైవ్-అలైవ్’ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ప్రజలకు చైతన్యం కల్పిస్తున్నామని చెప్పారు. పిల్లలకు వాహనాలు ఇవ్వడం నేరమని, ప్రమాదాలు జరిగితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
WGL: వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను ఎంపీ కడియం కావ్య పరిశీలించారు. ఉత్తర తెలంగాణకు తలమానికంగా నిలిచే ఈ ఆసుపత్రి ద్వారా వరంగల్‌తో పాటు పలు జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, త్వరలోనే ఓపీ, ఐపీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని అన్నారు.
TPT: ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు జిల్లా వ్యాప్తంగా నమోదైన వివిధ నేరాలపై సవివరంగా సమీక్షించి, స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో బాలలపై నేరాలు, పోక్సో కేసులు, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ, గ్రీవెన్స్ పిటిషన్లు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. సైబర్ నేరాలు, గాంజాయి నియంత్రణలో “జీరో టోలరెన్స్” విధానం సూచించారు.
అన్నమయ్య: జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగంపై డ్రోన్లతో నిఘాను మరింత పటిష్టం చేసి, జీరో టోలరెన్స్ విధానంతో కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. కూల్ లిప్ అనే నికోటిన్ పదార్థాన్ని పాఠశాలలు, కళాశాలల్లో నిషేధించాలని సూచించారు. ఎన్జీవోల సమన్వయంతో డి-అడిక్షన్ కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలన్నారు. జిల్లా ఎస్పీ పాల్గొన్నారు.
SRCL: జిల్లాకు చెందిన 12 గ్రామాల ప్రజలు ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కలిసి తమ సమస్యలను వివరించారు. ప్రస్తుతం పెద్ద లింగాపూర్ సబ్‌స్టేషన్ ఎదుట నిరాహార దీక్ష కొనసాగిస్తున్నామని, తమ దీక్షకు మద్దతుగా రావాలని తీన్మార్ మల్లన్నను కోరారు. 4న దీక్షా శిబిరానికి స్వయంగా హాజరై రైతులకు మద్దతు ఇస్తా అన్నారు.
HYD: చార్మినార్ పరిధిలోని జామ మసీద్ చౌక్‌లో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ మాసం అవడంతో నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఎంఐఎం నేతలు, స్థానిక ముస్లింలు పాల్గొన్నారు.
NDL: మహానంది దేవస్థానానికి గత 27 రోజుల్లో రూ. 25,05,573 ఆదాయం వచ్చినట్లు EO కాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. జిల్లా దేవాదాయశాఖ అధికారి మోహన్ పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది. మహానందీశ్వర స్వామి, కామేశ్వరీదేవి, సీతా కోదండ రామాలయాల హుండీల్లో రూ.34,64,108 వసూలవగా, గో సంరక్షణ నిధికి రూ.16,825, అన్నదాన హుండీకి రూ.24,640తో పాటు 2 USA డాలర్లు వచ్చాయి.