MLG: ఏటూరునాగారం పట్టణంలోని ప్రభుత్వ RITI (T)లో అప్రెంటిస్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు మార్చి 2 నుంచి 15 వరకు దరఖాస్తు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు వరంగల్ ITI బాయ్స్ క్యాంపస్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.