• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘రైతులు సకాలంలో రుణాలు చెల్లించాలి’

PDPL: ధర్మారం మండలం నంది మేడారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా 2025- 26 ఆర్థిక సంవత్సరం జమా, ఖర్చులు 2026 -27 అంచనా ఆమోదించారు. రైతులు సకాలంలో రుణాలు చెల్లించి సంఘం అభివృద్ధికి తోడ్పడాలని సీఈవో మల్లేశం తెలిపారు.

March 23, 2026 / 08:00 PM IST

ప్రజావాణికి 96 దరఖాస్తులు: కలెక్టర్

KMR: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 96 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను శాఖల వారీగా విభజించి, బాధితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏసీఎల్‌బీ మధుమోహన్, జడ్పీ సీఈవో చందర్ నాయక్, ఆర్డీవో వీణ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

March 23, 2026 / 08:00 PM IST

‘గ్రామ స్థాయి కమిటీలు త్వరతిగతిన పూర్తి చేయాలి’

VZM: పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా వైసీపీ గ్రామ స్థాయి కమిటీల ఏర్పాటు త్వరతిగతిన పూర్తి చేయాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈమేరకు సోమవారం గరివిడిలో వైసీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చెయ్యాలని కోరారు. అలాగే, స్థానిక ఎన్నికలో వైసీపీ జెండా ఎగరాలని నాయకులకు దిశ నిర్దేశం చేశారు.

March 23, 2026 / 08:00 PM IST

‘అక్రమ అరెస్టులతో పోరాటాలని ఆపలేరు’

SRCL: అక్రమ అరెస్టులతో పోరాటాలను ఆపలేరని బీజేపీ జిల్లా కోశాధికారి రామలింగారెడ్డి అన్నారు. అసెంబ్లీ ముట్టడికి బయలుదేరుతున్న బీజేపీ నాయకులు పోలీసులు సోమవారం అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కోశాధికారి లింగారెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే నిరసనలు చేసే హక్కు పార్టీలకు ఉందన్నారు.

March 23, 2026 / 07:59 PM IST

పన్ను కట్టని దుకాణాల సీజ్

VKB:  తాండూరు పట్టణంలోని పోట్లీ మహారాజ్ ఆలయ కాంప్లెక్స్‌లో ఆస్తిపన్ను చెల్లించని దుకాణాలను మున్సిపల్ అధికారుల సోమవారం సీజ్ చేశారు. కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో కొన్నేళ్లుగా మొండి బకాయిలు ఉన్న యజమానులకు రెడ్ నోటీసులు జారీ చేసిన స్పందించకపోవడంతో దుకాణాలకు తాళాలు వేశారు.

March 23, 2026 / 07:57 PM IST

పోలవరానికి నిధులు కేటాయించాలి: మిథున్ రెడ్డి

AP: పోలవరంపై ఎంపీ మిథున్ రెడ్డి పార్లమెంట్‌లో మాట్లాడారు. ‘పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించొద్దు. కేంద్ర బడ్జెట్ ఎత్తు 41.15 మీటర్లుగా నిర్ణయించారు.. వాస్తవానికి పోలవరం ఎత్తు 45.72 మీటర్లు ఉండాలి. నిర్మాణానికి రూ.55 వేల కోట్లు కేటాయించాలి. పోలవరం నిల్వ సామర్థ్యం తగ్గించడం అంటే.. ఏపీ అన్యాయం చేయడమే’ అని పేర్కొన్నారు.

March 23, 2026 / 07:54 PM IST

డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని కలెక్టర్ ఆదేశం

KMM: గత ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తుపై అధికారులు స్పందించి, మానవీయ కోణంలో చర్యలు చేపట్టారని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. తల్లాడ మండలానికి చెందిన రమేష్, సులోచన దంపతులకు సొంత ఇల్లు లేని కారణంగా ఇబ్బంది పడుతున్నట్లు సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సత్వరంగా స్పందించిన కలెక్టర్ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలన్నారు.

March 23, 2026 / 07:49 PM IST

50 అర్జీలను స్వీకరించిన జిల్లా ఎస్పీ

SS: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఎస్పీ సతీష్ కుమార్ 50 అర్జీలను స్వీకరించారు. బాధితులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ కలహాలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీలపై వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. బాధితులకు చట్టపరిధిలో న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

March 23, 2026 / 07:48 PM IST

ఫోర్ లైన్ రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించిన కలెక్టర్

KNR: మానకొండూరు మండలం ఈదులగట్టెపల్లి వద్ద ఫోర్ లైన్ రోడ్డు నిర్మాణ పనులను సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వీస్ రోడ్డు నిర్మించే అంశంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్వీస్ రోడ్డు నిర్మించే అంశంపై సాధ్యా సాధ్యాలపై అధ్యయనం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

March 23, 2026 / 07:48 PM IST

బడ్జెట్‌పై బీఆర్ఎస్ విమర్శలు హాస్యాస్పద.. కాంగ్రెస్ కౌంటర్

WGL: వర్ధన్నపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించిన సమావేశంలో ఇవాళ మున్సిపాలిటీ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్‌పై బీఆర్ఎస్ విమర్శలను ఖండించి, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బడుగు బలహీన వర్గాలు, రైతులు, యువతకు ఉపయోగపడేలా రూపొందించబడిందని తెలిపారు. ఎమ్మెల్యే నాగరాజుపై అబద్ధ ప్రచారం చేస్తే సహించబోతున్నారు.

March 23, 2026 / 07:48 PM IST

హోటళ్లపై అధికారుల దాడులు

KDP: వంట గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో హోటళ్లకు తరలిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో, సోమవారం మధ్యాహ్నం ఎన్ఫోర్స్‌మెంట్ డీటీ సుధీర్ ఆధ్వర్యంలో పులివెందులలో రెవెన్యూ అధికారులు హోటళ్లపై దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 60 వంట గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దాడుల విషయం తెలుసుకున్న హోటళ్ల యజమానులు తమ షాపులను మూసివేశారు.

March 23, 2026 / 07:48 PM IST

దొమ్మేటి వెంకటరెడ్డికి కలెక్టర్ నివాళి

ELR: ప్రముఖ సంఘ సంస్కర్త దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు సోమవారం ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో ఘనంగా నిర్వహించారు. దొమ్మేటి వెంకటరెడ్డి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. దొమ్మేటి వెంకటరెడ్డి గొప్ప సంఘ సంస్కర్తని, స్వాతంత్య్ర సంగ్రామంలో జాతీయోద్దరణకు కృషి చేశారన్నారు.

March 23, 2026 / 07:46 PM IST

‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా పాక్ ఓపెనర్

పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ ఫిబ్రవరి నెలకు గానూ ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును కైవసం చేసుకున్నాడు. T20 WCలో అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన ద్వారా అతడు ఈ గౌరవాన్ని దక్కించుకున్నాడు. ఈ రేసులో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్, అమెరికా పేసర్ షాడ్లీ వాన్ షాల్క్‌విక్‌ను వెనక్కి నెట్టి ఫర్హాన్ ఈ అవార్డును కైవసం చేసుకోవడం విశేషం.

March 23, 2026 / 07:46 PM IST

మిల్క్ ట్యాంకర్‌ను ఢీ కొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్

NLG: చిట్యాల మండలం పెద్ద కాపర్తి సర్వీసు రోడ్డులో సోమవారం మిల్క్ ట్యాంకర్‌ను ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్ మినహా ఎవరూ లేకపోవడంతో పెద్ద ముప్పు తప్పింది. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న ఫ్లైఓవర్ పనుల కారణంగా ట్రాఫిక్‌ను సర్వీసు రోడ్డు గుండా మళ్లిస్తుండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు.

March 23, 2026 / 07:45 PM IST

భూధాన్ భూముల అక్రమార్కులపై కేసులు నమోదు

KMM: ఖమ్మం అర్బన్ పరిధిలోని వెలుగుమట్ల రెవెన్యూ ప్రాంతంలోని భూదాన్, ప్రభుత్వ భూములపై అక్రమ వ్యాపారాలకు, ఆక్రమణలకు పాల్పడిన వారిపై పలు సెక్షన్లు నమోదు చేసి సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు టౌన్ ఏసీపీ రమణమూర్తి సోమవారం తెలిపారు. ఆయా కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుందని పేర్కొన్నారు.

March 23, 2026 / 07:45 PM IST