KMR: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 96 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను శాఖల వారీగా విభజించి, బాధితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏసీఎల్బీ మధుమోహన్, జడ్పీ సీఈవో చందర్ నాయక్, ఆర్డీవో వీణ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.