KDP: వంట గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో హోటళ్లకు తరలిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో, సోమవారం మధ్యాహ్నం ఎన్ఫోర్స్మెంట్ డీటీ సుధీర్ ఆధ్వర్యంలో పులివెందులలో రెవెన్యూ అధికారులు హోటళ్లపై దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 60 వంట గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దాడుల విషయం తెలుసుకున్న హోటళ్ల యజమానులు తమ షాపులను మూసివేశారు.