• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: డీసీసీ

ADB: గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ పేర్కొన్నారు. గుడిహత్నూర్ మండలంలోని తోషం తండా, సోయం గూడ, లెండి గూడ, కమలాపూర్ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ చేసి ప్రారంభించారు. మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆయన తెలిపారు.

March 23, 2026 / 06:36 PM IST

ఉగ్ర హెచ్చరికలను లెక్కచేయని స్టీవ్ స్మిత్

PSLలో పాల్గొనే విదేశీ క్రికెటర్లను లక్ష్యంగా చేసుకుంటామని పాక్ మిలిటెంట్ గ్రూప్ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ బెదిరింపులను ఏమాత్రం లెక్కచేయకుండా ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ పాకిస్థాన్‌కు చేరుకున్నాడు. ఈ సీజన్‌లో స్మిత్ సియాల్‌కోట్ స్టాలియన్స్ జట్టు తరపున బరిలోకి దిగబోతున్నాడు. మార్చి 26 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది.

March 23, 2026 / 06:36 PM IST

‘మార్చి చివరికి ఓటర్ల జాబితా మ్యాపింగ్ పూర్తి చేయాలి’

VSP: జిల్లాలో ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ నుంచి జనగణన-2027 ప్రారంభంకానున్న నేపథ్యంలో ముందస్తుగా ఈ పనులు పూర్తి చేయాలన్నారు. శాఖల మధ్య సమన్వయంతో వేగవంతంగా, పారదర్శకంగా ప్రక్రియ నిర్వహించాలని సూచించారు.

March 23, 2026 / 06:35 PM IST

ఆసుపత్రికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

ELR: ప్రభుత్వ భవనాల నిర్మాణానికి దాతలు అందించే సహకారం మరువలేనిదని దెందులూరు MLA చింతమనేని ప్రభాకర్ అన్నారు. సోమవారం పెదవేగి మండలం ముండూరులో నూతన ఆయుష్ ఆసుపత్రి భవనానికి ఆయన భూమి పూజ చేశారు. గ్రామానికి చెందిన మహంకాళి సుబ్రహ్మణ్యం గుప్త ఆసుపత్రి కోసం స్థలాన్ని దానంగా ఇవ్వడం గొప్ప విషయమని కొనియాడారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని అన్నారు

March 23, 2026 / 06:34 PM IST

కనీస వేతనం చెల్లించాలని వినతి

MDK: మున్సిపల్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేస్తూ 2వ పీఆర్సీలో కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో సిబ్బందితో కలిసి ఛైర్ పర్సన్ రజిని రాఘవేందర్ గౌడ్‌కు వినతి పత్రం అందజేశారు. వివిధ విభాగాలలో పనిచేస్తున్న కార్మికులకు డీఏ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

March 23, 2026 / 06:34 PM IST

‘భగత్ సింగ్ ఆశయాలను నెరవేర్చాలి’

MLG: ఏటూరునగరం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇవాళ భగత్ సింగ్ వర్ధంతిని జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా వారు చేసిన పోరాటం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని, వారి త్యాగాలు నేటి యువతకు మార్గదర్శకమని పేర్కొన్నారు.

March 23, 2026 / 06:34 PM IST

ఏప్రిల్ 3న బండలాగుడు పోటీలు

KDP: పెండ్లిమర్రి(M) రంపతాడులో ఏప్రిల్ 3న జరగనున్న అంకాలమ్మ తల్లి తిరుణాల సందర్భంగా ఓల్డ్ కేటగిరి ఎద్దులతో బండలాగుడు పోటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఇందులో మొదటి బహుమతి రూ.50,000 ఇస్తున్నట్టు తెలిపారు. ఇలా ఎనిమిది బహుమతుల వరకు ఉంటాయన్నారు. పోటీల్లో పాల్గొనదలచిన ఎద్దుల యజమానులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు.

March 23, 2026 / 06:33 PM IST

‘ప్రజాసమస్యల పరిష్కారమే మా లక్ష్యం’

VKB: ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి పరిష్కరించడమే తమ లక్ష్యమని వికారాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్ గడ్డం అనన్య అన్నారు. సోమవారం పట్టణంలోని 13వ వార్డు ఆలంపల్లిలో అధికారులతో కలిసి ఆమె పర్యటించారు. కాలనీలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన నిధులు మంజూరు చేయించి, అన్ని వార్డులను అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుపుతామని హామీ ఇచ్చారు.

March 23, 2026 / 06:32 PM IST

రైతులకు రుణాలు అందజేసిన పాక్స్ ఛైర్మన్

NTR: తిరువూరు లక్ష్మీపురం పాక్స్ పరిధిలోని రైతులకు సొసైటీ అధ్యక్షురాలు ప్రమీల చేతుల మీదుగా రూ. కోటి విలువైన ‘రైతు నేస్తం’ చెక్కులను అందజేశారు. గేదెలు, గొర్రెలు కొనుగోలు నిమిత్తం ఈ దీర్ఘకాలిక రుణాలు మంజూరు చేశారు. ఇప్పటి వరకు సొసైటీ ద్వారా రూ. 8.25 కోట్ల దీర్ఘకాలిక రుణాలు, రూ. 1.22 కోట్ల పంట రుణాలు రైతులకు అందించినట్లు ఆమె తెలిపారు. రైతుల ఆర్థికాభివృద్ధే లక్ష్యమని పేర్కొన్నారు.

March 23, 2026 / 06:32 PM IST

బడ్జెట్ పై లక్ష్మారెడ్డి తీవ్రమైన విమర్శ

MBNR: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి జడ్చర్లలో విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ ప్రజలను నిరాశపరిచిందని విమర్శించారు. ఆరు గ్యారంటీలు, ఇతర హామీల అమలుకు ఎదురుచూసిన రైతులు, మహిళలకు బడ్జెట్‌లో “గుండు సున్నా” మాత్రమే మిగిలిందని ఆయన ఎద్దేవా చేశారు. పండుగకాలంలో ప్రజలకు మేలు అందుతుందని ఆశించినవారిని ప్రభుత్వం వంచిందని తీవ్రంగా మండిపడ్డారు.

March 23, 2026 / 06:30 PM IST

పదో తరగతి పరీక్షకు 99.82 శాతం హాజరు

MDK: జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 11,236 మందికి గాను 11,216 మంది (99.82%) హాజరైనట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పరీక్షా కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యార్థులకు కల్పించిన మౌలిక సదుపాయాలను, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

March 23, 2026 / 06:30 PM IST

వారి త్యాగాలను ప్రతి నిత్యం స్మరించుకోవాలి: CP

NZB: దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను భారతీయులందరూ నిత్యం స్మరించుకోవాలని సీపీ పి. సాయి చైతన్య పిలుపునిచ్చారు. కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ, మేరా యువ భారత్ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ‘సమర్పణ దివస్’ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ప్రాణత్యాగాలను కొనియాడారు.

March 23, 2026 / 06:30 PM IST

డంపింగ్ యార్డును తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

MBNR: మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని వీరన్నపేట డంపింగ్ యార్డ్‌ను అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ సోమవారం సందర్శించారు. ఎండల తీవ్రత దృష్ట్యా పొడి చెత్తపై ప్రతి రెండు రోజులకోసారి నీళ్లు చల్లాలని, తద్వారా అగ్నిప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా యార్డ్ నిర్వహణపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు.

March 23, 2026 / 06:30 PM IST

గోశాలను పరిశీలించిన ఈవో

SRCL: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో ఉన్న తిప్పాపూర్ గోశాలలోని కోడెలు, గోవులను సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆలయ ఈవో ఎల్. రమాదేవి అన్నారు. సంబంధిత అధికారులతో కలిసి గోశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని గోశాలలో గోవులకు కల్పిస్తున్న సౌకర్యాలను సమీక్షించారు.

March 23, 2026 / 06:30 PM IST

వ్యవసాయ మార్కెట్‌లో నేటి ధరలు

NGKL: అచ్చంపేట వ్యవసాయ మార్కెట్‌‌లో సోమవారం వేరుశనగ, మినుములు, మొక్కజొన్న ధరలు ఈ విధంగా ఉన్నాయి వేరుశనగ ధర గరిష్ఠంగా క్వింటాలు ధర రూ.8,697 పలికింది. కనిష్ఠ ధర రూ.5,001 నమోదైంది. అలాగే మినుములు క్వింటాలు ధర రూ.8,406, మొక్కజొన్న రూ.1,702 ధర లభించింది. మార్కెట్‌కు మొత్తం 1441 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు.

March 23, 2026 / 06:30 PM IST