• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మీ ఏరియాలో సమస్యలు ఉన్నాయా.?

KDP: మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రథమ ప్రాధాన్యత అని జమ్మలమడుగు మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. డ్రైనేజీలు కాలువల్లో పూడిక పేరుకుపోయి నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారినా, మంచినీటి సరఫరాలో అంతరాయం ఉన్నా 8074267513 నంబరుకు ఫోన్ చేయాలన్నారు.

March 23, 2026 / 06:02 PM IST

గణితం పరీక్షకు 15 మంది గైర్హాజరు

KRNL: పెద్దకడబూరులో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు కట్టుదిట్టమైన భద్రతా నడుమ జరుగుతున్నాయి. ఇవాళ జరిగిన గణితం పరీక్షకు KGBV పాఠశాలలో 135 మందికి గానూ 133 మంది హాజరు కాగా, ఇద్దరు గైర్హాజరయ్యారు. APమోడల్ స్కూల్‌లో 277 మందికి గాను 270మంది హాజరు కాగా, 7గురు గైర్హాజరయ్యారు. ZP పాఠశాల 254 మందికి గాను 248 మంది హాజరు కాగా, 6మంది గైర్హాజరైనట్లు MEO ఉస్మాన్ తెలిపారు.

March 23, 2026 / 06:02 PM IST

‘ధరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి’

ASF: ప్రజావాణి ధరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ హరిత అన్నారు. సోమవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇల్లు, భూ కొలతలు, రహదారి పనుల బిల్లులు, వ్యవసాయ బావులు, ప్రభుత్వ భూముల పట్టాలు వంటి వివిధ సమస్యలపై ధరఖాస్తులు స్వీకరించారు.

March 23, 2026 / 06:01 PM IST

సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎస్పీ

SRPT: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’లో ఎస్పీ కె. నరసింహ బాధితుల నుంచి 6 ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలను చట్టపరంగా, త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రజలు నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. బాధితులకు అండగా ఉంటూ శాంతి భద్రతలను కాపాడడమే తమ ప్రాధాన్యతని ఆయన అన్నారు

March 23, 2026 / 06:00 PM IST

GP భూమి విక్రయం.. గ్రామస్తుల దర్నా

NLG: శాలి గౌరారం ఊట్కూరు గ్రామపంచాయతీ భవనం కోసం దాత ఇచ్చిన భూమిని నిబంధనలకు విరుద్ధంగా విక్రయించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి నిరసనగా ఉపసర్పంచ్ రంగు రాములు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి ధర్నా నిర్వహించారు. సర్పంచ్, ఆమె భర్త అక్రమంగా తక్కువ ధరకు భూమిని విక్రయించారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

March 23, 2026 / 06:00 PM IST

50వ సారి రక్తదానం చేసిన శివకుమార్

KMR: ఆపదలో నేను సైతం ఉన్నానంటూ రక్తదాతల సమూహ నిర్వాహకుడు బోనగిరి శివకుమార్ 50వ సారి రక్తదానం చేశారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఎనిమియాతో బాధపడుతూ చికిత్స పొందుతున్న దోమకొండకు చెందిన వ్యక్తికి O పాజిటివ్ రక్తం మూడు యూనిట్ల అవసరమయ్యింది. దీంతో విషయం తెలుసుకున్న ఆయన కామారెడ్డి బ్లడ్ సెంటర్‌కి వెళ్లి రక్తదానం చేశారు.

March 23, 2026 / 06:00 PM IST

లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయి: చంద్రబాబు

AP: రాష్ట్రాన్ని పునఃనిర్మాణం చేస్తామని ఎన్నికల్లో చెప్పామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ‘అభివృద్ధి చేసి చూపించాం. ఏ పని ప్రారంభించినా నాకు పూర్తిగా సహాకరిస్తున్న మిత్రుడు పవన్ కళ్యాణ్‌ను అభినందిస్తున్నాను. మరోవైపు యువనాయకుడు లోకేష్ కూడా బాగా కృషి చేశారు. ఈ భారీ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయి’ అని పేర్కొన్నారు.

March 23, 2026 / 06:00 PM IST

స్వయంగా అర్జీలను స్వీకరించిన మంత్రి నాదెండ్ల

GNTR: కొల్లిపర మండల కేంద్రంలో ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ పరిధిలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి స్వయంగా ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వారి సమస్యలను ఓపికగా, శ్రద్ధగా విని సమస్యల పరిష్కారానికై కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

March 23, 2026 / 06:00 PM IST

‘ధురంధర్ 2’కు షాక్.. హైకోర్టులో పిటిషన్

‘ధురంధర్-2’ చిత్రాన్ని రాజకీయ వివాదాలు చుట్టుముట్టాయి. ఈ మూవీని తమిళనాడులో తక్షణమే నిషేధించాలంటూ మద్రాస్ హైకోర్టులో ఓ అడ్వకేట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సినిమాలో అభ్యంతరకర రాజకీయ అంశాలు ఉన్నాయని, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఈ చిత్రాన్ని ప్రదర్శించకపోవడమే ఉత్తమమని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది.

March 23, 2026 / 05:59 PM IST

‘ధురంధర్ 2’ను నిషేధించాలంటూ హైకోర్టులో పిటిషన్

‘ధురంధర్-2’ చిత్రాన్ని రాజకీయ వివాదాలు చుట్టుముట్టాయి. ఈ మూవీని తమిళనాడులో తక్షణమే నిషేధించాలంటూ మద్రాస్ హైకోర్టులో ఓ అడ్వకేట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సినిమాలో అభ్యంతరకర రాజకీయ అంశాలు ఉన్నాయని, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఈ చిత్రాన్ని ప్రదర్శించకపోవడమే ఉత్తమమని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది.

March 23, 2026 / 05:59 PM IST

సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్

KMM: వీధుల్లో అధ్వానంగా ఉన్న మట్టి రోడ్ల స్థానంలో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను సర్పంచ్ శెట్టిపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. వైరా మండలం కేజీ సిరిపురంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గ్రామస్థుల చిరకాల కోరిక మేరకు, అంతర్గత రహదారుల నిర్మాణానికి సర్పంచ్ సోమవారం శ్రీకారం చుట్టారు.

March 23, 2026 / 05:59 PM IST

ఉద్రిక్త వాతావరణం నడుమ వేలం వాయిదా.!

ATP: రాయదుర్గం పురపాలక సంఘపు మార్కెట్ వేలం పాటలు సోమవారం మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి కార్యాలయంలో నిర్వహించారు. 31 మంది వేలం పాటలో పాల్గొన్నారు. వేలం పాటల సందర్భంగా ఘర్షణ జరగడంతో ఈసారి కూడా ఘర్షణ జరుగుతుందనే ఉద్దేశంతో ఇన్‌స్పెక్టర్ జయ నాయక్, ఎస్సై ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరో మారు ఉద్రిక్తత చోటుచేసుకోగా బుధవారానికి వేలం వాయిదా వేశారు.

March 23, 2026 / 05:58 PM IST

భద్రాచల రాముడి వివాదం.. విచారణ వాయిదా

TG: భద్రాచల రాముడి వివాదంపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా పడింది. భద్రాచల సీతారాముల గోత్ర, ప్రవరపై వివాదం నడుస్తోంది. ఓ వర్గం దశరథ రాముడని, మరో వర్గం రామనారాయణుడని వాదిస్తున్నారు. 2012 వరకు శ్రీరాముడిని దశరథ పుత్రుడిగా వశిష్ట గోత్రోద్భవడిగా, సీతమ్మ వారిని గౌతమస గోత్రంగా పూజించేవారని, తర్వాత మార్చారని అంటున్నారు. వాస్తవాలు తేల్చేందుకు కోర్టు ఐదుగురితో కమిటీ వేసింది.

March 23, 2026 / 05:56 PM IST

ఓడీసీలో ‘రైతన్న మీ కోసం’

సత్యసాయి: ఓడీసీ మండలంలో ‘రైతన్న మీ కోసం’ కార్యక్రమాన్ని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి నిర్వహించారు. స్థానిక అధికారులు, కూటమి నాయకులతో కలిసి రైతులకు వ్యవసాయ అభివృద్ధిపై అవగాహన కల్పించారు. సాగును లాభసాటిగా మార్చే పంచ సూత్రాలతో కూడిన కరపత్రాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

March 23, 2026 / 05:56 PM IST

‘వినతుల పరిష్కారంలో ఆలస్యం సహించబోం’

VZM: కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS), రెవెన్యూ క్లినిక్‌కు ప్రజల నుండి మంచి స్పందన లభించింది. మొత్తం 202 వినతులు అందగా, వాటిలో అధికంగా 93 రెవెన్యూ శాఖకు చెందినవే ఉన్నాయి. వినతుల పరిష్కారంలో ఆలస్యం సహించబోమని, పెండింగ్ కేసులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

March 23, 2026 / 05:55 PM IST