• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘ఉద్యోగులకు కనీస వేతనం ఇవ్వాలి’

NRPT: అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు నెలకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకట్ రామిరెడ్డి అన్నారు. సోమవారం నారాయణపేట మున్సిపల్ పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కనీస వేతనం అమలు చేస్తూ బడ్జెట్ సమావేశంలో తీర్మానించాలని డిమాండ్ చేశారు.

March 23, 2026 / 05:17 PM IST

పొగతాగితే కంటిచూపు మందగిస్తుందా?

పొగతాగడం వల్ల కేవలం ఊపిరితిత్తులకే కాదు, కంటిచూపుకు కూడా తీవ్ర ముప్పు ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ధూమపానం చేసేవారిలో కంటిలోని ముఖ్యమైన కణాలు దెబ్బతిని, 50 ఏళ్లు దాటాక చూపు మందగించే అవకాశం నాలుగు రెట్లు పెరుగుతుంది. అంతేకాకుండా, కంటి శుక్లాలు వచ్చే ప్రమాదం మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది.

March 23, 2026 / 05:16 PM IST

ఏలూరులో బీజేపీ జనతా వారధి ప్రోగ్రాం

ELR: బీజేపీ ప్రతిష్టత్మకంగా నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమాని సోమవారం ఏలూరులో నిర్వహించారు. ఈ మేరకు ఏలూరు బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ చౌటపల్లి విక్రమ్ కిషోర్ ఆధ్వర్యంలో పలు సమస్యలపై జిల్లా కలెక్టర్‌ కె.వెట్రి సెల్వికు బీజేపీ శ్రేణులు వినతిపత్రాలు అందజేశారు. అలాగే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్‌ను కోరారు.

March 23, 2026 / 05:15 PM IST

‘ఆదేశాలకు అనుగుణంగా జన గణన చేయాలి’

SRCL: ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జనగణ చేయాలని సిరిసిల్ల కలెక్టర్ గరీమ అగర్వాల్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో సాంకేతిక సహాయకులకు సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల రూపకల్పనకు వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు జనగణ ఉపయోగపడుతుందని తెలిపారు.

March 23, 2026 / 05:15 PM IST

అపరాల సాగుతో అధిక దిగుబడులు

ASR: అపరాల పంటల సాగులో నాణ్యమైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని జీకేవీధి మండల ఏవో గిరిబాబు అన్నారు. ఆత్మ పథకం సౌజన్యంతో సోమవారం అపరాల పంటల సాగుపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా రైతులు అధిక దిగుబడులు ఇచ్చే మేలైన రకాలను ఎంచుకోవాలని సూచించారు.

March 23, 2026 / 05:13 PM IST

నిజాయితీ చాటుకున్న యువకుడిపై ప్రశంసలు

విజయనగరం పట్టణంలోని ఓ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న రెడ్డి సీతారాం అనే యువకుడికి సుమారు రెండు తులాల బంగారు బ్రాస్లెట్ నిన్న సాయంత్రం దొరికింది. సదరు యువకుడు క్షణం కూడా ఆలోచించకుండా 2వ పట్టణ పోలీస్ స్టేషన్‌‌లో బ్రాస్లెట్‌ను అప్పగించాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు యువకుడి నిజాయితీపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

March 23, 2026 / 05:11 PM IST

మీ పాలనలో ఇచ్చినా హామీ గుర్తులేదా సార్: CITU

GDWL: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా అంగన్వాడీలకు ఇచ్చిన రూ. 18 వేల వేతన హామీని నేటికీ నెరవేర్చలేదని సీఐటీయు జిల్లా నేతలు ఉప్పేర్ నరసింహ, వివి నరసింహ పేర్కొన్నారు. సోమవారం గద్వాల కలెక్టరేట్ ముందు నిర్వహించిన ధర్నాలో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఇప్పటికైనా హామీలను నెరవేర్చాలని కోరారు.

March 23, 2026 / 05:11 PM IST

పెన్షన్ కోసం కలెక్టర్‌కు విజ్ఞప్తి

JGL: మల్యాల గ్రామంలో పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల ఫించన్లను మంజూరు చేయాలని సోమవారం 16వ వార్డు మెంబర్ గాండ్ల జ్యోతి జిల్లా కలెక్టర్‌ను ప్రజావాణి కార్యక్రమంలో కోరారు. 100 శాతం సదరం సర్టిఫికెట్ ఉన్నప్పటికీ ఫించన్ అందని బీసీ కాలనీకి చెందిన ఖాసీం బీ (23)ను తీసుకెళ్లి ప్రత్యక్షంగా దరఖాస్తు సమర్పించారు. అర్హులందరికీ త్వరితగతిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

March 23, 2026 / 05:10 PM IST

136 మంది విద్యార్థులు.. 30 మందికే భోజనం

గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని మహాకవి తిక్కన ఎస్‌పీకేహెచ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలులో తీవ్ర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించగా.. పాఠశాలలో నమోదైన 136 మంది విద్యార్థులకు సరుకులు తీసుకున్నప్పటికీ, కేవలం 30 మందికే సరిపడా భోజనం తయారు చేసినట్లుగా గుర్తించారు. దీనిపై వివరణ ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు.

March 23, 2026 / 05:10 PM IST

112వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు

NGKL: చారకొండ మండలం ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా వాసులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారంతో 112వ రోజుకు చేరుకున్నాయి. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ప్రాథమిక నోటిఫికేషన్‌‌‌ ను వెంటనే రద్దు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించి తమ ఊర్లకు ముంపు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

March 23, 2026 / 05:09 PM IST

భీమవరంలో భగత్ సింగ్ 95వ వర్ధంతి

W.G: భీమవరంలో భగత్ సింగ్ 95వ వర్థంతి సందర్బంగా భగత్ సింగ్ చిత్రపటానికి సీపీఐ నాయకులు సోమవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జోహార్ భగత్ సింగ్ అంటూ నినాదాలు చేశారు. అలాగే నేటి యువత భగత్ సింగ్ ఆశయ సాధనాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. ఆయన పోరాట పట్టిమ ఎంతోమందికి ఆదర్శం అన్నారు.

March 23, 2026 / 05:08 PM IST

GOOD NEWS: భారీ జీతంతో ఉద్యోగాలు

ఏపీ హైకోర్టులో వివిధ విభాగాల్లో 300 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 30 నుంచి ఏప్రిల్ 19 వరకు అధికారిక వెబ్‌సైట్ aphc.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. పోస్టును బట్టి నెలకు రూ.25 వేల నుంచి రూ.80 వేల వరకు జీతం ఉంటుంది.

March 23, 2026 / 05:07 PM IST

పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదల

SKLM: అంబేద్కర్ యూనివర్సిటీ పీజీ ఆర్ట్స్ & సైన్స్ కోర్సులకు సంబంధించి 4వ సెమిస్టర్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్‌ను యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారిని డాక్టర్ యు. కావ్యజోష్ణ విడుదల చేశారు. అభ్యర్థులు పరీక్ష ఫీజు రూ.800, ప్రాక్టికల్ ఫీజు రూ.250లతో కలిపి మొత్తం రూ.1,050 చెల్లించాలని పేర్కొన్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించి సకాలంలో ఫీజును చెల్లించాలని కోరారు.

March 23, 2026 / 05:06 PM IST

అమర జవానుకు ఘన నివాళి

NLG: దేశ రక్షణతో పాటు సామాజికాభివృద్ధికి కృషి చేసిన మాజీ సైనికుడు బెల్లి జనార్ధన్ సేవలు వెలకట్టలేనివని చందంపల్లి సర్పంచ్ చంద్రకళ కొనియాడారు. చందంపల్లి పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రమాదవశాత్తు మరణించిన జనార్ధన్ ఆశయాలను యువత కొనసాగించాలని సర్పంచ్ పిలుపునిచ్చారు.

March 23, 2026 / 05:06 PM IST

గంజాయి అక్రమ రవాణాపై రైల్వే పోలీసుల ఉక్కు పాదం

HYD: సికింద్రాబాద్ రైల్వే పోలీసులు, ఈగల్ బృందం, రైల్వే రక్షణ దళం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఒడిశా నుంచి ఢిల్లీకి గంజాయి తరలిస్తున్న ఇద్దరు నిందితులు దీపక్ సాహు(26), దీపక్ గౌడ(20)ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 10.089 కిలోల గంజాయి (విలువ రూ.5,04,450)తో పాటు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సాయిశ్వర గౌడ్, మాధవ్ పాల్గొన్నారు.

March 23, 2026 / 05:06 PM IST