• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ప్రపంచ దేశాలపై ఆర్థిక దాడులకు నిరసన

KMM: అమెరికా సామ్రాజ్యవాదం అనుసరిస్తున్న యుద్ధోన్మాదం, ప్రపంచ దేశాలపై ఆర్థిక దాడులకు నిరసనగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు పేర్కొన్నారు. మార్చి 23 జాతీయోద్యమ అమరవీరుల భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ అమరత్వం పొంది 95 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సోమవారం ప్రదర్శన నిర్వహించారు.

March 23, 2026 / 07:20 PM IST

‘భగత్ సింగ్ ఆశయాలను కొనసాగిస్తాం’

KMM: బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి భారత స్వాతంత్ర సంగ్రామంలో యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన విప్లవ వీరుడు సర్దార్ భగత్ సింగ్ అని AISF జిల్లా అధ్యక్షులు మడుపల్లి లక్ష్మణ్ అన్నారు. సోమవారం స్థానిక మధిర బీసీ బాయ్స్ హాస్టల్ భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అమరవీరుల ఆశయాలను కొనసాగించి, వారి స్ఫూర్తితో ఉద్యమించాలన్నారు.

March 23, 2026 / 07:20 PM IST

సమస్యలపై 28 ఫిర్యాదులు

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. బాధితుల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 28 ఫిర్యాదుల అందినట్టు అధికారులు వెల్లడించారు. ఇందులో చీటింగ్ 6, కుటుంబ తగాదాలు 5, భూతగాదాలు 6 ఫిర్యాదులు అందాయన్నారు.

March 23, 2026 / 07:18 PM IST

లారీల బ్యాటరీలను ఎత్తుకెళ్లిన దుండగులు

KDP: సింహాద్రిపురంలో శనివారం రాత్రి మూడు లారీల బ్యాటరీలను దొంగలు ఎత్తుకెళ్లారు. స్థానిక హెచ్.పీ గ్యాస్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న మైదానంలో మూడు టిప్పర్ లారీలను పార్కింగ్ చేయగా.. గుర్తు తెలియని వ్యక్తులు టిప్పర్ల నుంచి మూడు డబుల్ లారీలను దొంగతనం చేశారు. వీటి విలువ రూ.90వేలు ఉంటుందని బాధితుడు సుధీర్ కుమార్ రెడ్డి సోమవారం తెలిపారు.

March 23, 2026 / 07:18 PM IST

‘రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి’

ASR: నాణ్యమైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే వ్యవసాయ సాగులో అధిక దిగుబడులు సాధించవచ్చని రైతు సాధికార సంస్థ ఏపీసీఎన్ఎఫ్ యూనిట్ ఇంఛార్జ్ ఎస్.శ్రీనివాసరావు, ఐసీఆర్పీ ఎస్.వరలక్ష్మి తెలిపారు. కొయ్యూరు మండలం గింజర్తిలో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యవసాయ సాగులో రసాయన ఎరువుల వాడకం తగ్గించాలన్నారు.

March 23, 2026 / 07:15 PM IST

అదనపు కట్నం వేధింపులు.. వివాహిత ఆత్మహత్య

WG: అదనపు కట్నం వేధింపులు తాళలేక నాగలక్ష్మి (23) అనే మహిళ సోమవారం అత్తిలి మండలం స్కిన్నెరపురంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాళ్ల మండలం జక్కరంకు చెందిన నాగలక్ష్మికి 2018లో కళ్యాణి దుర్గారావుతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతోనే తన కుమార్తె ప్రాణాలు తీసుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

March 23, 2026 / 07:15 PM IST

‘నెల్లి చెరువులో నిర్మాణాల లెక్కలు తేల్చండి’

పార్వతీపురం నెల్లి చెరువులో నిర్మాణాల లెక్కలు తేల్చాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. ఈమేరకు సోమవారం కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు వంగల దాలినాయుడు నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు DRO కె. హేమలతకు వినతి పత్రాలు అందజేశారు.

March 23, 2026 / 07:15 PM IST

‘ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి’

MHBD: ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ అధికారులను ఆదేశించారు. ఇవాళ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం వచ్చిన దరఖాస్తుదారుల వినతులను సవివరంగా విని సంబంధిత విభాగాల అధికారులకు వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.

March 23, 2026 / 07:14 PM IST

RRR కస్టడీ టార్చర్ కేసు.. ముగిసిన విచారణ

AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టడీయల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ విచారణ పూర్తి అయ్యింది. గుంటూరులోని సీసీఎస్ స్టేషన్లో 8 రోజుల పాటు ఈ విచారణ కొనసాగింది. దర్యాప్తు అధికారి, విజయనగరం ఎస్పీ దామోదర్ సునీల్ నాయక్‌ను విచారించారు. త్వరలోనే ఈ కేసు పూర్తి వివరాలు అధికారులు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

March 23, 2026 / 07:14 PM IST

కాలనీ సమస్యలపై డిప్యూటీ కమిషనర్‌కు వినతి

MDCL: అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ పరిధి సాయిబాబా నగర్ కాలనీలో రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులు కల్పించాలని కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు కోరారు. సోమవారం అల్వాల్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో డిప్యూటీ కమిషనర్ బోగేశ్వర్లును కలిసి తమ కాలని సమస్యలపై వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

March 23, 2026 / 07:12 PM IST

‘మేధస్సుతో అసాధ్యాలు సుసాధ్యం’

VSP: భారతదేశం అత్యుత్తమ మేధో సంపదకు నిలయమని ఐఐటి ఖరగ్‌పూర్ పూర్వ ఆచార్యుడు ఎం.ఆర్. మాధవ్ అన్నారు. ఏయూలో సోమవారం నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను భారత్ సమర్థవంతంగా నిర్వహిస్తోందన్నారు. మానవ మేధస్సుతో అసాధ్యాలను కూడా సాధ్యంగా మార్చవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జియోసూత్రాస్ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

March 23, 2026 / 07:12 PM IST

హెయిర్ కలర్ తాగి యువకుడి ఆత్మహత్యాయత్నం

MNCL: కాసిపేట మండలం ధర్మారావుపేట గ్రామంలో హెయిర్ కలర్ తాగి యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సాగర్ కుటుంబ కలహాల వల్ల మద్యం మత్తులో హెయిర్ కలర్ సేవించినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు 108కి సమాచారం ఇవ్వగా, సిబ్బంది బాధితుడికి ప్రథమ చికిత్స అందించి మంచిర్యాల జిల్లా ఆస్పత్రికి తరలించారు.

March 23, 2026 / 07:12 PM IST

‘పాండవగల్లు చెరువు కేసులో అధికారుల నిర్లక్ష్యం’

KRNL: పాండవగల్లు గ్రామంలోని సర్వే నంబర్ 135లో ఉన్న 20 ఎకరాల పెద్ద చెరువు కేసులో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీపీఎం నేతలు ఇవాళ తీవ్రంగా విమర్శించారు. సబ్ కోర్టు, జిల్లా కోర్టులు చెరువును ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించినప్పటికీ అధికారులు స్వాధీనం చేసుకోలేదని ఆరోపించారు. తక్షణమే చర్యలు తీసుకోకపోతే గ్రామస్తులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

March 23, 2026 / 07:12 PM IST

భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి

MDK: మనోహరాబాద్ మండలం జీడిపల్లి వద్ద భవనం పైనుంచి పడి ఒడిస్సా కార్మికుడు జ్యోతి రంజన్ (36) మృతి చెందినట్లు ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు. ఆదివారం రాత్రి భవనం పైకి ఎక్కగా కాలుజారి కింద పడ్డట్టు తెలిపారు. చికిత్స కోసం తూప్రాన్ ఆసుపత్రికి తరలించగా సోమవారం మృతి చెందినట్లు ఎస్సై వివరించారు.

March 23, 2026 / 07:11 PM IST

భవనం పైనుంచి పడి కార్మికుడు మృతి

MDK: మనోహరాబాద్ మండలం జీడిపల్లి వద్ద భవనం పైనుంచి పడి ఒడిస్సా కార్మికుడు జ్యోతి రంజన్ (36) మృతి చెందినట్లు ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు. ఆదివారం రాత్రి భవనం పైకి ఎక్కగా కాలుజారి కింద పడ్డట్టు తెలిపారు. చికిత్స కోసం తూప్రాన్ ఆసుపత్రికి తరలించగా సోమవారం మృతి చెందినట్లు ఎస్సై వివరించారు.

March 23, 2026 / 07:11 PM IST