GNTR: ఫిరంగిపురం మండలంలోని పొనుగుపాడు గ్రామంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు సర్దార్ భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురుల 95వ వర్ధంతి సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జి. బాలకృష్ణ పాల్గొని, మాట్లాడారు. స్వాతంత్ర పోరాటంలో అనేక మంది దేశభక్తులు ప్రాణాలను పణంగా పెట్టి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారని పేర్కొన్నారు. అమరవీరుల ఆశయాలు కొనసాగించాలన్నారు.
బాపట్ల పట్టణంలో అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే భారీ జరిమానాలు విధిస్తామని మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి తెలిపారు. ముందుగా పట్టణ ప్రణాళిక విభాగం అనుమతి తీసుకోవాలని, కేటాయించిన ప్రదేశాల్లో మాత్రమే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. నియమాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
TG: ఎక్సైజ్ ఆదాయంపై హరీష్ రావు వర్సెస్ మంత్రి జూపల్లి మధ్య వాగ్వాదం నడిచింది. ఎక్సైజ్ ఆదాయం భారీగా పెరుగుతుందని బడ్జెట్‌లో పెట్టారని.. దీంతో ప్రజలతో ఎక్కువ తాగించాలని అనుకుంటున్నారా? అని హరీష్ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన జూపల్లి.. రాష్ట్రం వచ్చినప్పుడు ఎక్సైజ్ ఆదాయం ఎంత? పదేళ్ల తర్వాత ఎంత పెరిగిందని అడిగారు. అంటే BRS ప్రజలను తాగుబోతులను చేసిందా? అని నిలదీశారు.
ADB: సమిష్టి నిర్ణయాలతోనే గ్రామ అభివృద్ధి సాధ్యమని సర్పంచ్ సామ సంతోష్ రెడ్డి అన్నారు. తాంసి మండల కేంద్రంలోని నాగేశ్వర ఆలయంలో రూ. 5 లక్షల నిధులతో షెడ్డు నిర్మాణానికి గ్రామస్తులతో కలిసి సోమవారం భూమి పూజ చేశారు. ఆలయాల అభివృద్ధితో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో జిల్లా ఎస్పీ విశ్వనాథ్ పాల్గొని ప్రజల నుంచి 92 ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుదారులతో ఎస్పీ ప్రత్యక్షంగా మాట్లాడారు. సంబంధిత అధికారులతో ఫోన్‌లోనే మాట్లాడి నిర్ణీత గడువులోపు చట్టపరంగా పరిష్కరించాలని ఆదేశించారు. వృద్ధులు, దివ్యాంగుల వద్దకే వెళ్లి ఫిర్యాదులు స్వీకరించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
NRML: ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే స్పందించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఆమె మాట్లాడుతూ.. మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు.
WNP: బడ్జెట్‌లో బీసీలకు జరిగిన అన్యాయంపై రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సోమవారం వనపర్తి జిల్లాలోని రాజీవ్ చౌరస్తా దగ్గర నిరసన తెలిపి మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఏటా రూ.20,000 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, బీసీలకు మొండి చేయి చూపిందని విజయ్ యాదవ్ విమర్శించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.
IPL-2026 సీజన్ ప్రారంభానికి ముందే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఈ సీజన్‌లో అందుబాటులో ఉండటంపై సందిగ్ధత నెలకొంది. స్టార్క్ IPL ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి ఇంకా NOC అందలేదని ఢిల్లీ కోచ్ హేమంగ్ బదానీ స్వయంగా వెల్లడించాడు. ఈ జాప్యం కారణంగా స్టార్క్ IPL ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
SDPT: భగత్ సింగ్ ఆశయాల సాధనకు విద్యార్థులు, యువత కృషి చేయాలని AIPSU రాష్ట్ర ప్రధాన కార్య దర్శి మన్నె కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా సిద్దిపేటలోని భగత్ సింగ్ విగ్రహం వద్ద అమర వీరులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లను స్మరించుకుంటూ భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
MBNR: రైతు భరోసా పథకానికి కొత్త దరఖాస్తులు, బ్యాంక్ వివరాల అప్డేట్ కోసం ఈ నెల 25వ తేదీ లోగా దరఖాస్తులు చేసుకోవాలని పోల్కంపల్లి ఏఈవో శివ తెలిపారు. దరఖాస్తుదారులు ఆధార్, 28-02-2026 నాటికి ఉన్న పట్టాదార్ పాస్‌బుక్, బ్యాంక్ పాస్‌బుక్, మొబైల్ నంబర్‌తో పాటు అప్లికేషన్ ఫారాన్ని సమర్పించాలని సూచించారు. అర్హత గల రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
SRD: సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ ప్రావీణ్యతో పాటు అదనపు కలెక్టర్ పాండు, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 49 మంది తమ సమస్యలను విన్నవించారు. ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.
ఇటీవలే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీతో వచ్చిన పవన్ కళ్యాణ్ తాజాగా మరో సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దర్శకుడు దేవ కట్టాతో సినిమా చేయనున్నట్లు సమాచారం. గతంలోనే పవన్ కోసం దేవ ఓ పవర్‌ఫుల్ కథను సిద్ధం చేశాడట. అయితే పవన్.. సురేందర్ రెడ్డి, దేవ కట్టాలతో ఏకకాలంలో సినిమాలను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
WG: భీమవరం పట్టణంలోని ఉండి రోడ్డులో వైసీపీ జిల్లా కార్యాలయాన్ని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సోమవారం ప్రారంభించిన విషయం తెలిసందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి శూన్యమని విమర్శించారు. 2029లో తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ రాజు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
ATP: జిల్లాలో పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గుత్తి కోటకు సంబంధించి నడక మెట్లు ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు అనుమతి ఇవ్వడం జరిగిందని, ఈ మెట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
TG: తమ ప్రభుత్వం 1.65 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రకటించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజీవ్ యువవికాసం ఎప్పుడు అమలు చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ బడ్జెట్‌లో జాబ్ క్యాలెండర్ గురించి ప్రస్తావనే లేదని మండిపడ్డారు. అశోక్ నగర్‌లో ఉద్యోగాలు అడిగిన నిరుద్యోగులపై లాఠీఛార్జి చేశారని ధ్వజమెత్తారు.