ASF: ప్రజావాణి ధరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ హరిత అన్నారు. సోమవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇల్లు, భూ కొలతలు, రహదారి పనుల బిల్లులు, వ్యవసాయ బావులు, ప్రభుత్వ భూముల పట్టాలు వంటి వివిధ సమస్యలపై ధరఖాస్తులు స్వీకరించారు.