KRNL: పెద్దకడబూరులో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు కట్టుదిట్టమైన భద్రతా నడుమ జరుగుతున్నాయి. ఇవాళ జరిగిన గణితం పరీక్షకు KGBV పాఠశాలలో 135 మందికి గానూ 133 మంది హాజరు కాగా, ఇద్దరు గైర్హాజరయ్యారు. APమోడల్ స్కూల్లో 277 మందికి గాను 270మంది హాజరు కాగా, 7గురు గైర్హాజరయ్యారు. ZP పాఠశాల 254 మందికి గాను 248 మంది హాజరు కాగా, 6మంది గైర్హాజరైనట్లు MEO ఉస్మాన్ తెలిపారు.