• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

‘శ్రీనివాస మంగాపురం’పై నయా UPDATE

అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘శ్రీనివాస మంగాపురం’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంతో సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయ కృష్ణ ఘట్టమనేని హీరోగా, రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. ఇటీవల తిరుపతిలో జరిగిన మూడో షెడ్యూల్ తాజాగా పూర్తి కావడంతో 60% చిత్రీకరణ పూర్తయింది. మోహన్ బాబు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు.

March 7, 2026 / 10:07 AM IST

వెంకటేష్ మూవీ కోసం హీరోయిన్ ఫిక్స్!

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబోతో దర్శకుడు అనిల్ రావిపూడి ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో వెంకీ సరసన కీర్తి సురేష్ నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమె ఈ ప్రాజెక్టుపై సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తుండగా.. 2027 సంక్రాంతికి విడుదల కానుంది.

March 7, 2026 / 09:46 AM IST

‘ధురంధర్ 2’ పెయిడ్ ప్రీమియర్స్‌కు డేట్ ఫిక్స్..!

రణ్‌వీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబోలో వస్తున్న చిత్రం ‘దురంధర్ 2’ ఈనెల 19న విడుదల కానుంది. దాదాపు 4 గంటల నిడివి గల ఈ సినిమా కోసం ఈనెల 18 సాయంత్రం 5 నుంచే పెయిడ్ ప్రివ్యూస్ నిర్వహించాలని జియో స్టూడియోస్ నిర్ణయించింది. షోల సంఖ్య పరిమితంగా ఉన్నందున, ముందుగానే పాజిటివ్ టాక్ తెచ్చి సినిమాకు బూస్ట్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

March 7, 2026 / 09:30 AM IST

టాలీవుడ్ డైరెక్టర్‌కు సల్మాన్ ఖాన్ గ్రీన్ సిగ్నల్..?

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో మూవీ చేయనున్నట్లు సమాచారం. దిల్ రాజు నిర్మించే ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ఏప్రిల్ 2026లో ప్రారంభం కానుందట. ఇందులో సల్మాన్ సరికొత్త మేకోవర్‌లో కనిపించనున్నాడట. మరోవైపు రాజ్ & డీకే దర్శకత్వంలో రిటైరింగ్ సూపర్ హీరోగా ఓ చిత్రానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు, ఇది నవంబర్ 2026న పట్టాలెక్కనున్నట్లు టాక్.

March 7, 2026 / 09:04 AM IST

20 నిమిషాల్లోనే ‘ఉస్తాద్‌’ ఓటీటీ డీల్ క్లోజ్

పవన్‌ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ సినిమా ఈనెల 19న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా దర్శకుడు హరీశ్‌ శంకర్ ఓ ఆసక్తికర విషయం వెల్లడించాడు. ఈ సినిమా OTT హక్కుల డీల్ కేవలం 20 నిమిషాల్లోనే పూర్తయిందని ఆయన తెలిపాడు. పవన్‌ క్రేజ్ దృష్ట్యా ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ధరకు ఈ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం.

March 7, 2026 / 08:37 AM IST

రూ.31.5 కోట్లతో విల్లా కొన్న లేడీ సూపర్ స్టార్

లేడీ సూపర్ స్టార్ నయనతార చెన్నైలోని ప్రతిష్టాత్మక ‘పోయెస్ గార్డెన్’లో రూ.31.5 కోట్లతో ఒక భారీ లగ్జరీ డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది. 14,369 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ నివాసం ‘లెగసీ’ అనే ప్రీమియం కాంప్లెక్స్‌లో ఉంది. ఇప్పటికే HYDలోని బంజారా హిల్స్‌లో ఆమెకు రెండు విల్లాలు ఉండగా, ఇప్పుడు ఈ కొత్త ఇల్లు ఆమె ఆస్తుల జాబితాలో చేరింది.

March 7, 2026 / 08:19 AM IST

‘కథను మానభంగం చేశారు’.. రచయిత సంచలన పోస్ట్

ప్రముఖ రచయిత సాయిమాధవ్‌ బుర్ర తన కథను మార్చడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘నా కథతో మొదలై వేరే కథతో పూర్తయింది.. ఒక్క మాట చెప్పకుండా ఇష్టమొచ్చినట్టు మార్చేసి కథను మానభంగం చేశారు’ అంటూ ఆయన పోస్ట్ పెట్టారు. ఈ వ్యాఖ్యలు వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘ఎస్. సరస్వతి’ సినిమాను ఉద్దేశించినవేనని నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది.

March 7, 2026 / 07:43 AM IST

మార్చి 07: చరిత్రలో ఈరోజు

1921: తెలుగు సినిమా తొలి నేపథ్య గాయకుడు ఎమ్ఎస్ రామారావు జననం1938: నోబెల్ గ్రహీత, అమెరికా జీవశాస్త్రవేత్త డేవిడ్ బాల్టిమోర్ జననం1952: వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ జననం1955: బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ జననం1952: ఆధ్యాత్మిక గురువు పరమహంస యోగానంద మరణం1979: గ్రంథాలయోద్యమకారుడు అయ్యంకి వెంకటరమణయ్య మరణం

March 7, 2026 / 01:30 AM IST

న్యూస్ ఛానళ్లకు TRP రేటింగ్‌ల నిలిపివేత

దేశంలోని వార్తా ఛానళ్లలో పెరుగుతున్న సంచలనాత్మక ధోరణిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. న్యూస్ ఛానళ్ల టెలివిజన్ రేటింగ్ పాయింట్స్(TRP) నివేదికలను 4 వారాల పాటు, ఆదేశాలు ఇచ్చే వరకు నిలిపివేయాలని బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (BARC)ను ఆదేశించింది. రేటింగ్‌ కోసం పోటీ పడుతూ, బాధ్యతను విస్మరించి వార్తలను ప్రసారం చేయడం సరికాదంది.

March 7, 2026 / 12:10 AM IST

వైభవంగా అల్లు శిరీష్‌ వివాహం.. సీఎం విషెస్

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ తనయుడు, నటుడు అల్లు శిరీష్‌, నయనిక వివాహం వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాలు, అతిథుల సమక్షంలో వారు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరి వివాహ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కాగా, అల్లు అర్జున్‌ వివాహ వార్షికోత్సవమూ ఇవాళే కావడం విశేషం.

March 6, 2026 / 10:07 PM IST

మెగాస్టార్ మూవీలో బండ్ల గణేష్

మెగాస్టార్ చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్‌లో తాను ఒక ఆసక్తికరమైన పాత్రలో నటిస్తున్నట్లు బండ్ల గణేష్ వెల్లడించాడు. తన వ్యాపార బాధ్యతల వల్ల ప్రస్తుతం సినిమాల్లో నటించడానికి సమయం లేదని, అందుకే నటనకు కాస్త దూరంగా ఉంటున్నానని తెలిపాడు. అయితే, మెగాస్టార్ సినిమాలో పాత్ర రావడంతో, దాన్ని వదులుకోలేక నటిస్తున్నట్లు బండ్ల పేర్కొన్నాడు.

March 6, 2026 / 09:43 PM IST

నా కథను మానభంగం చేశారు: సాయి మాధవ్

రచయిత సాయి మాధవ్ బుర్రా SM వేదికగా సంచలన పోస్ట్ చేశాడు. ‘నా కథతో మొదలై వేరే కథతో పూర్తవుతుంది. కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా కథను ఇష్టమొచ్చినట్టు మార్చేశారు. నా కథను మానభంగం చేశారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే, ఏ సినిమాను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనేది స్పష్టం చేయలేదు. ‘సరస్వతి’ చిత్రం గురించే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

March 6, 2026 / 06:57 PM IST

మంచు మనోజ్ సరసన ‘ప్రిన్స్’ బ్యూటీ

మంచు మనోజ్ హీరోగా హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డేవిడ్ రెడ్డి’. ఈ సినిమాలో ఉక్రెయిన్ నటి మరియా రియాబోషప్కా హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ విషయాన్ని తెలుపుతూ.. చిత్రబృందం తాజాగా ఆమె లుక్‌ను విడుదల చేసింది. ఇందులో ఆమె క్లారా పాత్రలో నటిస్తుంది. గతంలో శివకార్తికేయన్ ‘ప్రిన్స్’ సినిమాలో మరియా హీరోయిన్‌గా నటించింది.

March 6, 2026 / 06:10 PM IST

శర్వా బర్త్‌డే.. ‘భోగి’ స్పెషల్ పోస్టర్ రిలీజ్

శర్వానంద్ బర్త్‌డే సందర్భంగా ‘భోగి’ చిత్ర యూనిట్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమా నుంచి శర్వానంద్ మాస్ లుక్ ఉన్న పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. గడ్డం, చెదిరిన జుట్టుతో శర్వానంద్ చాలా ఇంటెన్స్ అండ్ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్నాడు. అనుపమ, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

March 6, 2026 / 05:35 PM IST

నేటి OTT రిలీజ్‌లు ఇవే!

నెట్‌ఫ్లిక్స్‌: విత్ లవ్ – తెలుగు డబ్బింగ్, హలో బచ్చోన్ – తెలుగు డబ్బింగ్ సిరీస్, వార్ మెషీన్ – తెలుగు డబ్బింగ్ సినిమా, ది డైనోసార్స్ – తెలుగు డబ్బింగ్ సిరీస్; జియో హాట్‌స్టార్: విక్రమ్ ఆన్ డ్యూటీ – తెలుగు సిరీస్; జీ5 ఓటీటీ: గాంధీ టాక్స్ – తెలుగు సినిమా; ఆహా: అనగనగా ఆస్ట్రేలియాలో- తెలుగు సినిమా.

March 6, 2026 / 05:23 PM IST