• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

‘ఫౌజీ’ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్

రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబోలో ‘ఫౌజీ’ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఇమాన్వీ, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇవాళ అనుపమ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఆయనకు విషెస్ చెప్పారు. ఈ మేరకు ఈ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా 2026 దసరా కానుకగా విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

March 7, 2026 / 02:10 PM IST

అప్పుడు దీపిక 8 గంటలు అడగలేదు: అనన్య

దీపికా పదుకొనెతో గతంలో కలిసి పనిచేసిన అనుభవాలను అనన్య పాండే గుర్తుచేసుకుంది. అప్పట్లో పని గంటల విషయంలో దీపికా ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదని, వృత్తిపట్ల ఆమెకు ఉన్న అంకితభావాన్ని కొనియాడింది. అయితే, ప్రస్తుతం దీపికా తల్లి కావడంతో ఆమె ప్రాధాన్యతలు మారాయని, ఇప్పుడు ఆమెకు తగిన విశ్రాంతి, సమయం అవసరమని పేర్కొంది. మాతృత్వ సమయంలో ఆమెకు మద్దతుగా నిలవాలని ఆకాక్షించింది.

March 7, 2026 / 01:53 PM IST

ఉగాది నుంచి క్రిష్ కొత్త సినిమా ప్రారంభం!.

డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తన తదుపరి చిత్రాన్ని ఉగాది పర్వదినం సందర్భంగా ప్రారంభించనున్నాడట. అయితే ఇందులో నలుగురు హీరోలు, నలుగురు హీరోయిన్లు నటించబోతున్నారని, వారంతా కొత్తవారే నని టాక్ నడుస్తోంది. స్నేహం, జీవితం, బలమైన భావోద్వేగాల సమ్మేళనంగా ఈ కథ సాగనుందట. విభిన్నమైన కథాంశాలతో మెప్పించే క్రిష్, ఈసారి యువతను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

March 7, 2026 / 01:40 PM IST

యువతితో అసభ్య వీడియోలు తీసిన దర్శకుడు

సినిమా అవకాశాల పేరుతో ఓ యువతిని దర్శకుడు శంకర్ మోసం చేసిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. వెబ్ సిరీస్‌లో పాత్ర ఇస్తానని నమ్మించి, కాకినాడకు చెందిన బాధితురాలి(23)తో అసభ్యకర దృశ్యాలు చిత్రీకరించాడు. అంతటితో ఆగక ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ఆమెను బ్లాక్‌మెయిల్ చేశాడు. దీంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించగా, నిందితుడిపై కేసు నమోదైంది.

March 7, 2026 / 01:18 PM IST

‘ధురంధర్‌ 2’ ఒకరోజు ముందుగానే

రణ్‌వీర్ సింగ్ నటించిన భారీ యాక్షన్ చిత్రం ‘ధురంధర్ 2’ విడుదలకు సిద్ధమైంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మార్చి 19న థియేటర్లలోకి రానుంది. అయితే, చిత్ర యూనిట్ ఒకరోజు ముందుగానే, అంటే మార్చి 18న పెయిడ్ ప్రీమియర్స్ నిర్వహించనుంది. హైదరాబాద్‌లో ఇప్పటికే బుకింగ్స్ షురూ అయ్యాయి. క్రేజీ ట్రైలర్‌తో అంచనాలు పెంచేసిన ఈ మూవీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

March 7, 2026 / 01:07 PM IST

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ ట్రీట్!

తమిళ హీరో సూర్య, వెంకీ అట్లూరి క్రేజీ కాంబోలో రాబోతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని 2026 జూలైలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా 1 నిమిషం 44 సెకన్ల నిడివితో ఒక ఎమోషనల్ టీజర్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ టీజర్ రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన రానుంది.

March 7, 2026 / 01:03 PM IST

విజయ్‌ భార్య సంగీతకు కోర్టులో చుక్కెదురు

నటుడు విజయ్, ఆయన భార్య సంగీత మధ్య కొనసాగుతున్న విడాకుల వ్యవహారంలో తాజాగా సంగీతకు కోర్టులో చుక్కెదురైంది. విడాకుల కేసు ముగిసే వరకు తన భర్త విజయ్ ఇంట్లోనే ఉండడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేసింది. అయితే, దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆమె విన్నపాన్ని తిరస్కరించింది. ఈ పరిణామంతో విజయ్ వ్యక్తిగత జీవితం మరోసారి చర్చనీయాంశంగా మారింది

March 7, 2026 / 12:43 PM IST

సప్తమి గౌడ ఉద్య‌మానికి శివ‌న్న మ‌ద్ద‌తు

హీరోయిన్స్‌ను  అనుచిత కోణాల్లో చిత్రీకరిస్తున్న తీరుపై కన్నడ నటి సప్తమి గౌడ #ActorsNotObjects పేరుతో ఉద్యమం ప్రారంభించింది. నటీమణులను వస్తువుల్లా కాకుండా కళాకారులుగా గౌరవించాలని ఆమె పిలుపునిచ్చింది. ఈ ఉద్యమానికి స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ మద్దతు తెలుపుతూ, మహిళలను గౌరవించడం మన సంస్కారమని, వారిని కేవలం శరీరంగా చూసే ధోరణి వెంటనే ఆగిపోవాలని స్పష్టం చేశారు.

March 7, 2026 / 12:38 PM IST

‘EPIC’ ఫస్ట్ సింగిల్‌కు డేట్ ఫిక్స్

‘బేబీ’ ఫేమ్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తోన్న కొత్త చిత్రం ‘EPIC- First Semester’. దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా రిలీజైన గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇటీవల ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘సంచారమే’ ప్రోమో విడుదల కాగా..  ఫుల్ పాట మార్చి 9న విడుదల కానుంది. ఈ మేరకు పోస్టర్‌ను షేర్ చేశారు మేకర్స్.

March 7, 2026 / 12:22 PM IST

‘ధురంధర్ 2’తో రాబోతున్న ‘రాజా శివాజీ’ టీజ‌ర్.!

బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ మార్చి 19న విడుదల కానుంది. ఈ మూవీ కోసం జియో స్టూడియోస్ ప్రేక్షకులకు అదిరిపోయే సర్‌ప్రైజ్  ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ థియేటర్లలో ‘రాజా శివాజీ’, ‘కాక్టెయిల్ 2’ చిత్రాల టీజర్లను కూడా ప్రదర్శించనున్నారట. దీంతో ఒకేసారి మూడు చిత్రాల అప్‌డేట్స్‌ను వెండితెరపై చూసే అవకాశం ప్రేక్షకులక...

March 7, 2026 / 11:52 AM IST

ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమాలో ఖుష్బూ?

జూ.ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న మూవీ ‘డ్రాగన్’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో సీనియర్ నటి ఖుష్బూ భాగం కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆమె పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండనున్నట్లు సమాచారం. అంతేకాదు మలయాళ నటుడు టొవినో థామస్ విలన్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

March 7, 2026 / 11:12 AM IST

విజయ్, త్రిష రిలేషన్‌పై నటి సంచలన పోస్ట్

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి, నటి త్రిష రిలేషన్‌లో ఉన్నారంటూ వస్తున్న వార్తలపై నటి, విజయ్ అభిమాని సనమ్ శెట్టి తీవ్రంగా స్పందించింది. వీరిద్దరి వీడియోను షేర్ చేస్తూ.. ‘ఒక భార్య పడుతున్న బాధను పట్టించుకోకపోవడం విచారకరం. అభిమానులను నిరాశపరిచారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం సనమ్ శెట్టి చేసిన ఈ ఘాటు పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పెను దుమారం రేపుతోంది.

March 7, 2026 / 10:55 AM IST

బాలయ్య కొత్త మూవీపై UPDATE

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీ సిద్ధమవుతోంది. ముంబై నేపథ్యంలో సాగే ఈ మూవీలో బాలయ్య గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారట. ప్రస్తుతం HYDలోని ప్రత్యేక సెట్‌లో రాత్రిపూట కీలక యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ షెడ్యూల్ మరో 2 వారాలు సాగనున్నట్లు టాక్.

March 7, 2026 / 10:31 AM IST

పాలిటిక్స్‌లోకి త్రిష ఎంట్రీ ఖాయమా?

ఇటీవల చెన్నైలో ఓ వివాహ రిసెప్షన్‌లో విజయ్, త్రిష జంటగా కనిపించి సందడి చేశారు. వీరిద్దరూ ఒకే కారులో, మ్యాచింగ్ దుస్తుల్లో రావడం చర్చకు దారితీసింది. ఇదే సమయంలో త్రిష రాజకీయ అరంగేట్రంపై ప్రచారం ఊపందుకుంది. ఆమె విజయ్ ‘TVK’ పార్టీలో చేరి, చెన్నై నుంచి MLAగా పోటీ చేస్తారని తెలుస్తోంది. 15 ఏళ్ల క్రితమే తనకు CM అవ్వాలని ఉందన్న త్రిష వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

March 7, 2026 / 10:31 AM IST

‘శ్రీనివాస మంగాపురం’పై నయా UPDATE

అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘శ్రీనివాస మంగాపురం’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంతో సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయ కృష్ణ ఘట్టమనేని హీరోగా, రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. ఇటీవల తిరుపతిలో జరిగిన మూడో షెడ్యూల్ తాజాగా పూర్తి కావడంతో 60% చిత్రీకరణ పూర్తయింది. మోహన్ బాబు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు.

March 7, 2026 / 10:07 AM IST