• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

ప్రారంభానికి సిద్ధమైన ‘అల్లు సినిమాస్’!

అల్లు అరవింద్, అల్లు అర్జున్‌ల ప్రతిష్టాత్మక మల్టీప్లెక్స్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభానికి ముస్తాబైంది. మార్చి 19న ఉగాది సందర్భంగా ‘ధురంధర్ 2’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలతో ఇది గ్రాండ్‌గా ఓపెన్ కానున్నట్లు తెలుస్తోంది. అత్యాధునిక లేజర్ ప్రొజెక్షన్, డాల్బీ అట్మాస్ సౌండ్‌తో ప్రేక్షకులకు ప్రపంచస్థాయి అనుభూతిని ఇది అందించనుంది.

March 8, 2026 / 02:42 PM IST

టాక్ ఆఫ్ ది టౌన్‌గా కమల్ హాసన్ రెమ్యూనరేషన్!

‘కల్కి 2898 AD’ సినిమా కోసం కమల్ హాసన్ అందుకున్న పారితోషికం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. కేవలం 10 రోజుల కాల్‌షీట్స్ కేటాయించినందుకు గాను నిర్మాత అశ్వినీదత్ ఆయనకు రూ. 150 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. అంటే రోజుకు దాదాపు రూ. 15 కోట్లు అన్నమాట. భారతీయ సినీ చరిత్రలో ఒక సీనియర్ హీరో ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోవడం ఇదే మొదటిసారి అని సినీవర్గాలు చెబుతున్నాయి.

March 8, 2026 / 02:15 PM IST

‘ది బ్లాక్ గోల్డ్’ నుంచి స్పెషల్ పోస్టర్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సంయుక్త నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘ది బ్లాక్ గోల్డ్’ నుంచి స్పెషల్ పోస్టర్ విడుదలైంది. ఈ మూవీలో సంయుక్త ఫియర్ లెస్, పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. ఈ పోస్టర్‌కి ‘ఆయుధాల కంటే న్యాయాన్ని నమ్మే మహిళ’ అనే క్యాప్షన్ ఇచ్చారు. ఇక, యోగేష్ KMC తెరకెక్కిస్తున్న ఈ మూవీకి శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు.

March 8, 2026 / 02:00 PM IST

‘ఆదర్శ కుటుంబం’ ప్రమోషన్స్ ఎప్పుడంటే?

విక్టరీ వెంకటేష్‌తో దర్శకుడు త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాను 2026 అక్టోబర్ 2న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి.. వేసవి నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

March 8, 2026 / 01:15 PM IST

‘జన నాయగన్’ వివాదానికి తెరపడనుందా?

విజయ్ దళపతి ‘జన నాయగన్’ సెన్సార్ చిక్కులు త్వరలోనే వీడనున్నాయి. ఈ మూవీని మార్చి 9న మధ్యాహ్నం 2 గంటలకు సెన్సార్ రివిజన్ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా వీక్షించనున్నారట. వారు ఇచ్చే సర్టిఫికేట్, సూచించే కట్స్ ఆధారంగా విడుదలపై స్పష్టత రానుంది. సెన్సార్ పూర్తికాగానే మేకర్స్ రిలీజ్ డేట్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఈ అప్‌డేట్ ఆసక్తికరంగా మారింది.

March 8, 2026 / 12:28 PM IST

‘వారణాసి’లో హైలైట్ కానున్న ఈ సీక్వెన్స్..?

రాజమౌళి, మహేష్ బాబు ‘వారణాసి’ మూవీ ప్రస్తుతం మంచు కొండల్లో షూటింగ్ జరుపుకుంటోంది. మహేష్, పృథ్వీరాజ్ సుకుమారన్ మధ్య వచ్చే భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారట. ఈ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ కానుందట. 2026 జూన్/జూలై నాటికి చిత్రీకరణ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. ఈ విజువల్ వండర్ 2027 ఏప్రిల్ 7న థియేటర్లలో సందడి చేయనుంది.

March 8, 2026 / 11:37 AM IST

‘ఆదర్శ కుటుంబం’పై క్రేజీ అప్‌డేట్

వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో రానున్న ‘ఆదర్శ కుటుంబం’పై అప్‌డేట్ వచ్చేసింది. ఇది కేవలం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మాత్రమే కాదు, AK47 తరహా పవర్‌ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడి ఉంటుందట. ఫస్టాఫ్ అంతా కడుపుబ్బ నవ్వించే వినోదంతో సాగి, ఇంటర్వెల్ వద్ద ఇచ్చే ఊహించని ట్విస్ట్ ప్రేక్షకులకు షాక్ ఇస్తుందని సమాచారం. అక్కడి నుంచే కథ సీరియస్ మోడ్‌లోకి మారుతుందని టాక్.

March 8, 2026 / 11:06 AM IST

రాజ‌కీయాల‌పై నటుడు శివాజీ వ్యాఖ్యలు

రాజకీయాలపై నటుడు శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటానని, అయితే పరిధులు దాటితే మాత్రం స్పందిస్తానని తెలిపాడు. పవన్ కళ్యాణ్‌ను విమర్శించిన వారే ఇప్పుడు ఆయన విజయాన్ని చూస్తున్నారని, అలాగే లోకేష్‌ను ‘పప్పు’ అని వెక్కిరించిన వారే ఇప్పుడు ఆయనలోని ‘నిప్పు’ లాంటి నాయకత్వాన్ని గుర్తిస్తున్నారని శివాజీ పేర్కొన్నాడు.

March 8, 2026 / 10:12 AM IST

‘ధురంధర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో సెన్సేషన్..!

రణ్‌వీర్ సింగ్, ఆదిత్య ధర్ క్రేజీ కాంబోలో వస్తున్న మూవీ ‘ధురంధర్ 2’. 2026, మార్చి 19న విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ప్రారంభమైన ప్రీమియర్ షో బుకింగ్స్‌లో కేవలం కొద్దిసేపట్లోనే 86,680 టికెట్లు అమ్ముడవడం విశేషం. మొదటి భాగం విజయం అందించిన జోష్‌తో, రెండో భాగం భారీ వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

March 8, 2026 / 09:44 AM IST

OFFICIAL: ఓటీటీలోకి ‘ఫంకీ’.. ఎప్పుడంటే..?

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా దర్శకుడు అనుదీప్ KV రూపొందించిన ‘ఫంకీ’ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీ OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. దీని డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మార్చి 13 నుంచి సదరు OTTలో స్ట్రీమింగ్ కానుంది. కాగా, దాదాపు రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా రూ.10 కోట్లకుపైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం.

March 8, 2026 / 09:36 AM IST

సినిమాలు వదిలేసి వ్యవసాయం చేయాలనుకున్నా: నటి

నటి యామీ గౌతమ్ తన సినీ ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘అవార్డు వేడుకల్లో నామినేషన్లు వచ్చినా పెద్ద అవార్డులు గెలవలేకపోయాను. కానీ ప్రేక్షకుల ప్రేమే నాకు నిజమైన గుర్తింపు. ఒక దశలో అవకాశాలు లేక సినిమాలను వదిలేయాలని అనుకున్నాను. హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లి వ్యవసాయం చేయాలని కూడా ఆలోచించాను’ అంటూ చెప్పుకొచ్చింది.

March 8, 2026 / 09:08 AM IST

శౌర్యువ్ దర్శకత్వంలో రౌడీ హీరో?

వరుస సినిమాలతో బిజీగా ఉన్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరో ప్రాజెక్టు చేయడానికి సిద్ధమవుతున్నాడు. దర్శకుడు శౌర్యువ్‌తో క్లాసిక్ సినిమా చేయనున్నాడట. ఈ మేరకు శౌర్యువ్ చెప్పిన కథకు విజయ్ ఓకే చెప్పాడట. త్వరలోనే దీనిపై అధికారికగా ప్రకటన వచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్. దీంతో వీరి కాంబోలో సినిమా ఎలా ఉండబోతుందంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. 

March 8, 2026 / 08:47 AM IST

మరో స్టార్ హీరోతో నయనతార ప్రాజెక్ట్!

లేడీ సూపర్ స్టార్ నయనతారకు మరో భారీ ఆఫర్ వరించినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన ఒక క్రేజీ ప్రాజెక్టులో ఆమెకు అవకాశం దక్కిందని సమాచారం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా ద్వారా ఈ ఇద్దరు స్టార్స్ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

March 8, 2026 / 07:44 AM IST

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రిలీజ్ ఎప్పుడంటే?

తమిళ హీరో సూర్య ప్రధాన పాత్రలో దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తోన్న మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఈ చిత్రాన్ని 2026 జూలైలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్ రెడీ అయినట్లు తెలుస్తోంది. అయితే మార్చి 19, 2026న రిలీజయ్యే ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ధురంధర్ 2’ సినిమాల థియేటర్లలో ఈ టీజర్‌ను ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది.

March 8, 2026 / 07:44 AM IST

మధుబాల బయోపిక్‌లో కియారా అద్వానీ!

బాలీవుడ్ లెజెండరీ నటి మధుబాల బయోపిక్‌కు రంగం సిద్ధమైంది. సంజయ్‌లీలా భన్సాలీ నిర్మాణంలో జస్మిత్ కె. రీన్ ఈ మూవీని తెరకెక్కించనున్నాడట. మధుబాల పాత్రలో కియారా అద్వానీ నటించనున్నట్లు టాక్. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో నటించేందుకు కియారా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, త్వరలోనే సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

March 8, 2026 / 07:12 AM IST