జూ.ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘దేవర’కు సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ 2026 డిసెంబర్ నుంచి మొదలు కానున్నట్లు టాక్. ఎన్టీఆర్ కూడా డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా మ్యూజిక్‌పై వర్క్ జరుగుతున్నట్లు సమాచారం.అంతేకాదు పార్ట్ 2 కథలో చాలా మార్పులు చేసి షూట్ కోసం సన్నాహాలు చేస్తున్నారట.
ఉదయం నిద్రలేవగానే గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరంలోని విషతుల్యాలు తొలగిపోతాయి. కాసేపు ఎండలో నడవడం లేదా యోగా, ధ్యానం చేయడం వల్ల రోజంతా ఉత్సాహంగా, ఒత్తిడి లేకుండా ఉండవచ్చు. పోషకాలతో కూడిన అల్పాహారం (నానబెట్టిన బాదం, పండ్లు) తీసుకోవాలి. ఫోన్ చూడకుండా ప్రశాంతంగా రోజును ప్రారంభించడం మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ అలవాట్లు ఆరోగ్యంగా ఉంచుతాయి.
2025 గద్దర్ అవార్డుల్లో ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రానికి 4 పురస్కారాలు దక్కడంపై దర్శకుడు సాయిలు కంపాటి హర్షం వ్యక్తం చేశాడు. తన తొలి ప్రయత్నంలోనే ఇలాంటి ప్రతిష్ఠాత్మక గౌరవం లభిస్తుందని ఊహించలేదని, ఈ అవార్డులతో తమ కష్టం ఫలించిందని పేర్కొన్నాడు. ముఖ్యంగా ప్రీమియర్ షోలో ప్రేక్షకుల స్పందన చూసిన క్షణాలను తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని ఆయన భావోద్వేగంగా చెప్పాడు.
వయసు పెరుగుతున్నా నయనతార క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ దక్కించుకున్న ఆమె.. వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. షారుఖ్‌ఖాన్‌తో ‘జవాన్’, చిరంజీవితో ‘MSVPG’లో నటించి సూపర్ హిట్స్ అందుకుంది. ఇప్పుడు సల్మాన్ ఖాన్‌కి జంటగా నటించనున్నట్లు టాక్. ఈ మూవీకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తారని సమాచారం. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాలి.
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం విడుదలకు ముందే రికార్డుల వేటను మొదలుపెట్టింది. AR రెహమాన్ స్వరపరిచిన ఈ సినిమా పాటలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ‘చికిరి చికిరి’, ‘రై రై రా రా’ అనే రెండు పాటలు కలిపి యూట్యూబ్‌లో ఏకంగా 300 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న గ్రాండ్‌గా విడుదల క...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈనెల 19న విడుదల కాబోతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. చిత్ర యూనిట్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, తమన్ కలిసి డబ్బింగ్ స్టూడియోలో ఉన్న ఓ ఫొటోను విడుదల చేసింది. ఇక ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఈనెల 16న నిర్వహించనున్నట్లు సమాచారం.
సినిమా రంగంలో 8 గంటల పని విధానం కోసం దీపికా పదుకొనె చేస్తున్న పోరాటానికి కరీనా కపూర్ మద్దతు పలికింది. షూటింగ్ మొదలవ్వకముందే పని గంటలపై స్పష్టత అడగడంలో తప్పులేదని చెప్పింది. ముఖ్యంగా పిల్లలున్న తల్లులకు వారి కోసం సమయం కేటాయించడం చాలా అవసరమని, ‘ది బకింగ్‌హామ్ మర్డర్స్’ సమయంలో తాను కూడా ఇలాగే చేశానని పేర్కొంది. దీపికా డిమాండ్లలో న్యాయముందని నొక్కి చెప్పింది.
‘ఎస్. సరస్వతి’ కథా వివాదంపై వరలక్ష్మి శరత్‌కుమార్ స్పందించింది. ఈ మూవీ కథను రేప్ చేశారని రచయిత సాయి మాధవ్ బుర్రా ఆరోపణలను ఖండించింది. ‘నేను కథను దొంగిలించలేదు. సరైన పద్ధతిలో డబ్బు చెల్లించి కొనుగోలు చేశాను. ఆరేళ్లుగా ఆయన వద్దే ఉన్న బేసిక్ ప్లాట్‌ను తీసుకుని, నేటి అభిరుచికి తగ్గట్లు స్క్రీన్‌ప్లే మార్చాను. రచయితగా ఆయనకు పూర్తి క్రెడిట్ ఇచ్చాను’ అని పేర్కొంది.
తమిళ హీరో సూర్య, వెంకీ అట్లూరి క్రేజీ కాంబోలో రాబోతున్న మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఈ సినిమా పృథ్వీరాజ్ సుకుమారన్ మలయాళ మూవీ ‘కంగారూ’కి రీమేక్ అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. 2007లో విడుదలై భారీ విజయం అందుకున్న ‘కంగారూ’ కథను తెలుగు, తమిళ నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ‘వారణాసి’ మూవీ తెరకెక్కుతోంది. ఇండియాతో పాటు ఓవర్సీస్‌లో కూడా ఈ మూవీకి భారీ బజ్ నెలకొంది. ఈ క్రమంలో ఈ చిత్రం ఓవర్సీస్ రైట్స్ కోసం ఫార్స్ ఫిలిమ్స్ ఏకంగా రూ.160 కోట్ల భారీ ఆఫర్‌ను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అన్ని ఇండియన్ భాషలకు కలిపి ఈ స్థాయిలో ధర పలకడం రికార్డు అని సినీ వర్గాలు పేర్కొన్నాయి.
“90’s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్” వెబ్ సిరీస్ తర్వాత డైరెక్టర్ ఆదిత్య హాసన్‌తో నటుడు శివాజీ ‘ఎపిక్’ సినిమా చేస్తున్నాడు. ఆదిత్య తెరకెక్కిస్తున్న ‘ఎపిక్’ మూవీలో తాను తండ్రి పాత్రలో కనిపించనున్నట్లు శివాజీ తెలిపాడు. ఆ పాత్రలో తన లుక్ కాస్త డిఫరెంట్‌గా ఉంటుందన్నాడు. ఇక ‘ఎపిక్’లో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కాంబోలో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ ‘AA23’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో విజయ్ భాగం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
గద్దర్ అవార్డుల్లో ఈటీవీ విన్ అద్భుత ప్రతిభ కనబరిచి 6 అవార్డులను కైవసం చేసుకుంది. ఈ సంస్థ నిర్మించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ నాలుగు విభాగాల్లో అవార్డులు సాధించగా, ఉత్తమ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్‌గా ‘లిటిల్ హార్ట్స్’, ఉత్తమ బాలల చిత్రంగా ‘అనగనగా’ నిలిచాయి. నాణ్యమైన కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తూ, అవార్డుల పంట పండించిన ఈటీవీ విన్‌పై ప్రశంసలు వెల్లువెత్...
టాలీవుడ్‌లో ఒక క్రేజీ కాంబో సెట్ కానుంది. వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకునే అడివి శేష్, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ చెప్పిన ఓ కొత్త కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కథలోని సస్పెన్స్, కొత్తదనం శేష్‌ను బాగా ఆకట్టుకున్నాయట. ప్రస్తుతం ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో, డేట్స్ అడ్జస్ట్ అయ్యాక ఈ మూవీ పట్టాలెక్కననున్నట్లు సమాచారం.
2025 గద్దర్ అవార్డు గ్రహీతలకు అక్కినేని నాగార్జున అభినందనలు తెలిపారు. ‘అక్కినేని నాగేశ్వరరావు గౌరవార్థం ANR అవార్డును నెలకొల్పినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, CM రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. జయసుధకి ఈ గౌరవం దక్కడం సంతోషకరం. NTR అవార్డు పొందిన చిరంజీవికి, ‘తండేల్’ చిత్రానికి ఉత్తమ నటుడిగా నిలిచిన నా కొడుకు నాగచైతన్యకు శుభాకాంక్షలు. దుమ్ములేపావు నాన్న’ అంటూ పోస్ట్ పెట్టారు.