బాలీవుడ్ లెజెండరీ నటి మధుబాల బయోపిక్కు రంగం సిద్ధమైంది. సంజయ్‌లీలా భన్సాలీ నిర్మాణంలో జస్మిత్ కె. రీన్ ఈ మూవీని తెరకెక్కించనున్నాడట. మధుబాల పాత్రలో కియారా అద్వానీ నటించనున్నట్లు టాక్. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో నటించేందుకు కియారా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, త్వరలోనే సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.