MDK: జిల్లాలో చికెన్ ధరలు షాకిస్తున్నాయి. బర్డ్ ఫ్లూ భయంతో ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇక ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. డ్రస్డ్ చికెన్ రూ.260 నుంచి రూ.270 వరకు, స్కిన్ లెస్ చికెన్ రూ.290 నుంచి 300 వరకు పలుకుతోంది. ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉండొచ్చు. చికెన్ రేట్లు ఇలా పెరుగుతూ ఉంటే సామాన్యులు కొనడం కష్టమేనని నెటిజెన్లు అంటున్నారు.