W.G: యలమంచిలి మండలం దొడ్డిపట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్‌గా పనిచేస్తున్న కర్రి చంద్రరేఖ (30) నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం అధిక మోతాదులో నిద్ర మాత్రలు మింగడంతో ఆపస్మారక స్థితిలోకి చేరారు. పాలకొల్లులోని హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ.. శనివారం ఆమే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.