ఏలూరు: మాదేపల్లి రోడ్డులో ఉన్న కేజీఎన్ వెల్డింగ్ దుకాణంలో మందుగుండు సామాగ్రి పేలుడు ప్రమాదంలో మృతి చెందిన బషీర్‌కు న్యాయం చేయాలని శనివారం రాత్రి ఆయన బంధువులు తీవ్ర ఆందోళనకు దిగారు. కబేలా సెంటర్ వద్ద మృతదేహంతో బేటాయించి నిరసన వ్యక్తం చేశారు. బషీర్‌కు తెలియకుండా ఒక వ్యాపారి తన వద్ద ఉన్న మందుగుండు సామాగ్రిని దుకాణంలో దాచిపెట్టాడని ఆరోపించారు.