అన్నమయ్య: వాల్మీకిపురం బైపాస్‌లో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో 40 ఏళ్ల రెడ్డిలక్ష్మీ మృతి చెందగా, ఆమె కుమారుడు బాలాజీ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. గుర్రంకొండ మండలం రామాపురానికి చెందిన వీరు, చింతపర్తిలో పని ముగించుకుని బైకుపై తిరిగి వెళ్తుండగా ఓ స్కూటర్ బలంగా ఢీకొట్టినట్లు వారు పేర్కొన్నారు. గాయపడిన బాలాజీని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించమన్నారు.