తమిళ హీరో సూర్య ప్రధాన పాత్రలో దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తోన్న మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఈ చిత్రాన్ని 2026 జూలైలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్ రెడీ అయినట్లు తెలుస్తోంది. అయితే మార్చి 19, 2026న రిలీజయ్యే ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ధురంధర్ 2’ సినిమాల థియేటర్లలో ఈ టీజర్‌ను ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది.