కోనసీమ: ఇవాళ భారత్- న్యూజిలాండ్ మధ్య జరిగే T-20 ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు యానాం GMC బాలయోగి క్రీడా ప్రాంగణంలో భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్‌పై రాత్రి 6 గంటల నుంచి ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. క్రీడాభిమానులతో కలిసి మల్లాడి మ్యాచ్ వీక్షించనున్నారు.