• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మూవీ రివ్యూ

శివాజీ, లయ జంటగా నటించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ నేడు థియేటర్లలో విడుదలైంది. ఓ మధ్యతరగతి కుటుంబం అనుకోని క్రైమ్ చిక్కుల్లో ఎలా ఇరుక్కుంది, ఆ తర్వాత వారు పడిన ఇబ్బందులు ఏంటి..? అనేది కథ. శివాజీ కామెడీ టైమింగ్‌, శివాజీ-లయ కెమిస్ట్రీ, రంజిన్ సంగీతం ప్లస్ పాయింట్. అక్కడక్కడా సాగతీత, కొన్ని కామెడీ సీన్స్ పండకపోవడం, కొత్తదనం లేని కథ మైనస్. రేటింగ్:2.5/5

March 6, 2026 / 05:04 PM IST

రూ.31 కోట్లతో నయనతార దంపతుల కొత్త నివాసం

కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార – విఘ్నేష్ చెన్నైలోని ప్రతిష్టాత్మక పోయెస్ గార్డెన్‌లో రూ. 31.5 కోట్ల విలువైన లగ్జరీ డూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. సుమారు 14,369 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిలో 8 కార్ పార్కింగ్ స్లాట్లు ఉండటం విశేషం. సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి దిగ్గజాలు నివసించే ఈ ప్రాంతంలోని ప్రాపర్టీలో.. నయనతారకు 90% వాటా ఉండటం గమనార్హం.

March 6, 2026 / 04:42 PM IST

రేపే ‘ధురంధ‌ర్ 2’ ట్రైలర్

రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ మూవీ ట్రైలర్ రేపు ఉ.11:01 గంటలకు విడుదల కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో సంజయ్ దత్, మాధవన్, సారా అర్జున్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘ధురంధర్’ రూ.1,300 కోట్లకు పైగా వసూళ్లతో భారీ విజయాన్ని అందుకోవడంతో సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

March 6, 2026 / 03:33 PM IST

ఓటీటీలోకి ‘నవాబ్స్‌ కేఫ్‌’

యంగ్ హీరో శివ కందుకూరి, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘నవాబ్ కేఫ్’. బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ‘ఈటీవీ విన్’లో మార్చి 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఓల్డ్ సిటీ నేపథ్యంలో సాగే ఈ రియలిస్టిక్ డ్రామాను రవికాంత్ జెట్టి దర్శకత్వం వహించగా, ఆర్.ఎమ్. ప్రొడక్షన్స్ నిర్మించింది.

March 6, 2026 / 02:25 PM IST

‘భారత్‌లో ఆ సినిమాలకే క్రేజ్’.. రానా

హీరోగా, నిర్మాతగా రానా తన కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రేక్షకులకు నచ్చే సినిమాలు నిర్మించడంలో తాను ఎల్లప్పుడూ ముందుంటానని తెలిపాడు. భారత్‌లో కుటుంబ కథా చిత్రాలకు (Family Entertainers) ఎప్పుడూ ఆదరణ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డాడు. వైవిధ్యమైన కంటెంట్‌ను ప్రోత్సహిస్తూ, ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా సినిమాలు తీయడమే తన ప్రాధాన్యత అని రానా వెల్లడించాడు.

March 6, 2026 / 01:55 PM IST

DUI కేసులో పాప్‌స్టార్ అరెస్ట్

అమెరికాకు చెందిన ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ DUI కేసులో అరెస్ట్ అయ్యింది. కాలిఫోర్నియాలో ఆమె మద్యం తాగి కార్ నడుపుతున్నట్లు గుర్తించిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెపై DUI కేసు నమోదు చేసి విడుదల చేశారు. విచారణ నిమిత్తం మే 4న కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. కాగా మద్యం, డ్రగ్స్ వంటివి తీసుకుని డ్రైవ్ చేసేవారిపై DUI కేసు ఫైల్ చేస్తారు.

March 6, 2026 / 12:07 PM IST

‘ఎస్. సరస్వతి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

వరలక్ష్మి శరత్‌ కుమార్ తొలిసారి దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటించిన ‘ఎస్‌.సరస్వతి’ ఇవాళ విడుదలైంది. ఇదొక సైకలాజికల్ కోర్ట్ రూమ్ థ్రిల్లర్. అదృశ్యమైన కూతురి కోసం ఓ తల్లి పోరాటం, చైల్డ్ అబ్యూజ్ నేపథ్యంలో సాగుతుంది. వరలక్ష్మి, ప్రకాష్ రాజ్ నటన.. తమన్ మ్యూజిక్ సినిమాకు బలాలు. పాత కథలా అనిపించడం, ఊహలకందే స్క్రీన్‌ప్లే నిరాశపరుస్తాయి. రేటింగ్: 2.5/5.

March 6, 2026 / 12:02 PM IST

అది మర్చిపోలేని అనుభూతి: ప్రియాంక చోప్రా

మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కించనున్న చిత్రం ‘వారణాసి’. ఈ మూవీలో భాగంగా కెన్యాలో జరిగిన షూటింగ్‌ను ప్రియాంక చోప్రా గుర్తుచేసుకుంది. కెన్యాలోని అడవుల్లో వేల సంఖ్యలో జింకలు వలస వెళ్తున్న సమయంలో, వాటి మధ్యలో నిలబడి షూటింగ్ చేయడం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని పేర్కొంది. ప్రకృతి ఎంత శక్తిమంతమైనదో వాటిని చూస్తే తెలిసిందని ప్రియాంక చెప్పుకొచ్చింది.

March 6, 2026 / 11:56 AM IST

‘మృత్యుంజయ్‌’ మూవీ రివ్యూ&రేటింగ్

శ్రీవిష్ణు హీరోగా హుస్సేన్ షా దర్శకత్వంలో ‘మృత్యుంజయ్‌’ ఇవాళ విడుదలైంది. ప్రమాదాలుగా చిత్రీకరించిన హత్యల వెనుక గుట్టును రిపోర్టర్ జయ్ ఎలా ఛేదించాడనేదే ఈ ప‌రిశోధ‌నాత్మ‌క థ్రిల్లర్ కథ. శ్రీవిష్ణు నటన, ద్వితీయార్ధంలో మైండ్ గేమ్ సినిమాకు బలం. కాలభైరవ సంగీతం ఉత్కంఠను పెంచింది. సాగదీత సీన్లు ఉన్నా, థ్రిల్లర్ ప్రియులను ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. రేటింగ్: 2.75/5

March 6, 2026 / 11:55 AM IST

శ్రీవిష్ణు ‘మృత్యుంజయ్‌’ మూవీ రివ్యూ

శ్రీవిష్ణు హీరోగా హుస్సేన్ షా దర్శకత్వంలో ‘మృత్యుంజయ్‌’ ఇవాళ విడుదలైంది. ప్రమాదాలుగా చిత్రీకరించిన హత్యల వెనుక గుట్టును రిపోర్టర్ జయ్ ఎలా ఛేదించాడనేదే ఈ ప‌రిశోధ‌నాత్మ‌క థ్రిల్లర్ కథ. శ్రీవిష్ణు నటన, ద్వితీయార్ధంలో మైండ్ గేమ్ సినిమాకు బలం. కాలభైరవ సంగీతం ఉత్కంఠను పెంచింది. సాగదీత సీన్లు ఉన్నా, థ్రిల్లర్ ప్రియులను ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. రేటింగ్: 2.75/5

March 6, 2026 / 11:55 AM IST

ఆస్కార్‌ ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఓ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. మార్చి 15న జరగనున్న ఆస్కార్ వేడుకల్లో ఆమె ప్రజెంటర్‌గా వ్యవహరించనుంది. హాలీవుడ్ ప్రముఖులతో కలసి ఆమె ఒక విజేతకు అవార్డు అందించనుంది. దీంతో ఆమెకు పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇటీవల జరిగిన గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల్లోనూ ఆమె ప్రజెంటర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. 

March 6, 2026 / 11:33 AM IST

ట్రోల్స్‌పై అనసూయ పోస్ట్‌

యాంకర్, నటి అనసూయ ఇటీవల పాల్గొన్న హోలీ సంబరాల్లో ట్రోలింగ్‌కు గురైన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ఆమె అసహనం వ్యక్తం చేసింది. ‘ఇతరుల బాధలో కూడా వినోదం వెతికేవారిని సమాజం నిలదీసే రోజు రావాలి. మహిళలపై వివక్ష చూపడం సరికాదు. ఇలాంటివారిని చూసి సమాజం సిగ్గుపడాలి. ఎన్నో ఎదుర్కొని పైకి వచ్చేవారిని విమర్శించడానికి మీరెవరు?’ అంటూ ఆమె పోస్ట్ పెట్టింది.

March 6, 2026 / 09:46 AM IST

బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ప్రీతి ముకుందన్!

ఇటీవల మలయాళ చిత్రం ‘సర్వం మాయ’లో ప్రీతి ముకుందన్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. కార్తిక్ ఆర్యన్ ‘నాగ్జిల్లా’ సినిమాలో ఆమె నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమాలోని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేసినట్లు సమాచారం. మృగ్‌దీప్ సింగ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

March 6, 2026 / 07:42 AM IST

అలాంటి పాత్రలు ఇక చేయను: భూమి

బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కెరీర్‌లో కొన్నిసార్లు హిట్ కొట్టాలనే ఆత్రుతతో పాత్రలను అంగీకరించి తప్పు చేశానని తెలిపింది. ఇకపై తనని అగౌరవపరిచే పాత్రలు చేయనని వెల్లడించింది. అలాగే, కెరీర్‌లో ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడినట్లు భూమి చెప్పుకొచ్చింది.

March 6, 2026 / 07:30 AM IST

దుబాయ్‌లో చిక్కుకున్న వారికి ఉచిత వసతి!

దుబాయ్‌లో చిక్కుకుపోయి ఇబ్బంది పడుతున్న వారికి నటుడు సోనూసూద్ ఉచిత వసతి కల్పిస్తున్నారు. ఏ దేశస్థులైనా పర్వాలేదు, ఎలాంటి షరతులు లేకుండా మీరు ఉచితంగా బస చేయవచ్చు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మానవత్వం మాత్రమే ముఖ్యం అని సోనూసూద్ పేర్కొన్నారు. ఇబ్బందుల్లో ఉన్నవారు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మెసేజ్ చేస్తే, తన టీమ్ సంప్రదించి ఏర్పాట్లు చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

March 6, 2026 / 06:45 AM IST