నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న పీరియాడిక్ మూవీ షూటింగ్ నిన్న రాత్రి ప్రారంభమైంది. సతీష్ కిలారు (వృద్ధి సినిమాస్) నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం నవంబర్ 2025లో ప్రారంభమైన విహాయం తెలిసిందే. తాజాగా సినిమాటోగ్రాఫర్ అరవింద్ ఎస్ కశ్యప్ లొకేషన్ పిక్ షేర్ చేస్తూ అప్‌డేట్ ఇచ్చాడు. ఇక ఈ మూవీలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నాడు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వెడ్డింగ్ రిసెప్షన్‌లో రష్మిక తల్లిదండ్రులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఖరీదైన దుస్తులకు పోకుండా, తమ కొడవా(కూర్గ్) గిరిజన సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా తండ్రి ‘కుప్యా’ కోటులో, తల్లి ప్రత్యేక కొడవ చీరకట్టులో మెరిశారు. సెలబ్రిటీ వేడుకలోనూ తమ మూలాలను, వారసత్వాన్ని ఘనంగా చాటిచెప్పిన ఈ జంట అందరి ప్రశంసలు అందుకుంటోంది.
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘నాగబంధం’. 1750 కాలం నాటి నేపథ్యంలో దేవాలయ నిధి రహస్యాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘నామోరే’ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ పాటను మార్చి 15న ఉదయం 11:11 గంటలకు విడుదల చేయనున్నారు. నభా నటేష్, ఐశ్వర్యా మేనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు.
మాస్ మహారాజా రవితేజ, రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ముగ్గురు ఒకేచోట కనిపించి నెటిజన్లను ఆశ్చర్యపరిచారు. మార్చి 4న జరిగిన విజయ్, రష్మిక రిసెప్షన్‌లో రవితేజ సందడి చేశాడు. వారికి కంగ్రాట్స్ చెప్పి ఫొటోలు దిగాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో విజయ్, రవితేజ కాంబోలో సినిమా వస్తే బాగుంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ మారింది. ముందుగా ప్రకటించిన మార్చి 26, 2026కు బదులుగా, ఉగాది కానుకగా మార్చి 19న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. పవర్ స్టార్ సినిమా థియేటర్లకు ముందుగానే వస్తుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
శ్రీవిష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్’ మార్చి 6న థియేటర్లలోకి రాబోతుంది. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కేవలం 1 గంట 58 నిమిషాల తక్కువ రన్ టైంతో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిన్న నిడివి ప్రేక్షకులను అబ్బురపరుస్తుందని చిత్ర యూనిట్ నమ్ముతోంది. ఇక ఈ మూవీలో రెబా మోనికా జాన్ నటించగా, కాల భైరవ సంగీతం అందించారు.
మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబోలో రాబోతున్న ‘మెగా 158’ మూవీకి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. మార్చి 14న ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నట్లు సమాచారం. KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ స్క్రిప్ట్ పక్కాగా లాక్ అయినట్లు టాక్. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.
మంచు మనోజ్ కథానాయకుడిగా హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో ‘డేవిడ్ రెడ్డి’ చిత్రం రూపొందుతోంది. స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ వారిపై పోరాడిన ఒక యోధుడి గాథగా ఈ సినిమా రానుంది. ఇందులో స్పెషల్ సాంగ్ కోసం కథానాయిక రాశి ఖన్నాని ఎంపిక చేసినట్లు సమాచారం. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మనోజ్ సరసన రాశి స్టెప్పులు వేయడం ఆసక్తికరంగా మారింది.
రజినీకాంత్, షారుఖ్ ఖాన్‌ల కాంబోలో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అనిరుధ్ రవిచందర్ తన ‘డ్రీమ్ కాంబినేషన్’ గురించి మాట్లాడుతూ, రజినీ, షారుఖ్‌లను ఒకే తెరపై చూడటమే తన లక్ష్యమని వెల్లడించాడు. వీరికి సంగీతం అందించడం తన కెరీర్‌లో అత్యంత పెద్ద ప్రాజెక్ట్ అవుతుందని అన్నాడు. దీంతో నెటిజన్లు ఈ కాంబో కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అక్కినేని అఖిల్ ప్రస్తుతం ‘లెనిన్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ వచ్చే వారం ప్రారంభం కానుందట. ఈ షెడ్యూల్ పూర్తికాగానే అఖిల్ డబ్బింగ్ పనులు మొదలుపెట్టనున్నట్లు సమాచారం. విశేషమేమిటంటే, చిత్తూరు యాసలో సాగే తన పాత్రకు అఖిల్ స్వయంగా డబ్బింగ్ చెప్పనున్నాడట.
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా క్రేజీ కాంబోలో వస్తున్న ‘స్పిరిట్’ మూవీ షూటింగ్‌కు చిన్న బ్రేక్ పడింది. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, తిరిగి మే నెలలో పట్టాలెక్కనుంది. సందీప్ వంగా పక్కా ప్లానింగ్‌తో ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తున్నాడు. ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తోన్న ఈ చిత్రం 2027 మార్చి 5న విడుదల కానుంది.
‘రై రై రారా’ పాట వెనుక దర్శకుడు బుచ్చిబాబు సానా పట్టుదల ఎంతో ఉందని అనంత శ్రీరామ్ కొనియాడాడు. ఈ పాట సాహిత్యం కోసం వారిద్దరూ ఎన్నో రాత్రులు రింగ్ రోడ్డుపై ప్రయాణిస్తూ, కాఫీ షాపుల్లో చర్చించారట. రెండు నెలల మథనం తర్వాతే ఈ పాట పుట్టిందని, భవిష్యత్ తరాలకు సందేశం ఇచ్చేలా పాట ఉంటుందని పేర్కొన్నాడు. సాహిత్యం పట్ల నెటిజన్ల నుంచి వస్తున్న ప్రశంసలపై ఆయన ఆనందం వ్యక్తం చేశాడు.
ప్రముఖ గాయని శ్రేయ ఘోషల్ తన పాటల ఎంపికపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘చిక్ని చమేలి’ వంటి పాటలు పాడే సమయంలో సాహిత్యంపై తనకు అవగాహన లేదని, ఆ పాటలను చిన్న పిల్లలు పాడుతుంటే తనకు ఇబ్బందిగా అనిపించేదని వెల్లడించారు. అందుకే సామాజిక బాధ్యతతో ఇకపై ఐటెం సాంగ్స్ పాడకూడదని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. విలువలకు ప్రాధాన్యం ఇస్తున్న ఆమెపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
‘పెద్ది’ మూవీలోని ‘రై రై రారా’ సాంగ్ మేకింగ్ గురించి రచయిత అనంత శ్రీరామ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. రెహమాన్ ప్రయోగాత్మక బాణీ కోసం దాదాపు 2 నెలలు కష్టపడి ఈ పాట రాశారట. మాస్ ట్యూన్‌లో తాత్వికతని రంగరించి అచ్చ తెలుగులో ఈ పాటను రూపొందించాడు. కేవలం ప్రేమ పాట మాత్రమే కాకుండా, జీవిత ప్రయాణం గురించి గొప్ప సందేశాన్ని అందించేలా ఈ మాస్ సాంగ్ సాగుతుందని ఆయన తెలిపాడు.
‘యుఫోరియా’, ‘ధురంధర్’ చిత్రాలతో మెప్పించిన సారా అర్జున్‌కు బాలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్ అలీ రూపొందించనున్న రొమాంటిక్ లవ్ స్టోరీ ‘హీర్ రంఝా’లో ఆమెను హీరోయిన్‌గా ఎంపిక చేసే ఆలోచనలో చిత్రబృందం ఉందట. ఇది ‘లైలా మజ్ను’కు సీక్వెల్‌గా రానుంది. ప్రస్తుతం చర్చలు జరుగుతుండగా, త్వరలోనే అధికారిక ప్ర...