‘యుఫోరియా’, ‘ధురంధర్’ చిత్రాలతో మెప్పించిన సారా అర్జున్‌కు బాలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్ అలీ రూపొందించనున్న రొమాంటిక్ లవ్ స్టోరీ ‘హీర్ రంఝా’లో ఆమెను హీరోయిన్‌గా ఎంపిక చేసే ఆలోచనలో చిత్రబృందం ఉందట. ఇది ‘లైలా మజ్ను’కు సీక్వెల్‌గా రానుంది. ప్రస్తుతం చర్చలు జరుగుతుండగా, త్వరలోనే అధికారిక ప్ర...
హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో విజయ్ దేవరకొండ- రష్మిక మందన వెడ్డింగ్ రిసెప్షన్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ తదితర రంగాల ప్రముఖులు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నాగచైతన్య, దర్శకుడు కార్తీక్ దండు కాంబినేషన్‌లో ‘వృషకర్మ’ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ విడుదలకు సంబంధించి మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. రేపు మధ్యాహ్నం 12:12 గంటలకు గ్లింప్స్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. కాగా, ఇందులో నాగచైతన్య నిధి అన్వేషకుడిగా నటిస్తున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది.
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి సంబంధించి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాకు దేవిశ్రీ కేవలం పాటలకే పరిమితం కానుండగా, BGM తమన్ అందించబోతున్నాడు. ఈ మేరకు మేకర్స్ తాజాగా ప్రకటన విడుదల చేశారు. ఇద్దరు అగ్ర సంగీత దర్శకులు ఒకే సినిమా కోసం పనిచేస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ చిత్రం మార్చి 26న విడుదల కానుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. 2026 మార్చి 26న ఈ సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 19న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఆ రోజు రిలీజ్ కావాల్సిన ‘టాక్సిక్’, ‘డెకాయిట్’ సినిమాలు వాయిదా పడటంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్.
దర్శకనటుడు తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘గాయపడ్డ సింహం’. తాజాగా ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో అతిథి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆ హీరో ఎంట్రీ ఇచ్చే సీన్ సినిమాకే మేజర్ హైలైట్‌గా నిలుస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆ ఎపిసోడ్‌లో వచ్చే హిలేరియస్ కామెడీ థియేటర్లలో నవ్వులు పూయించడం ఖాయమని టాక్ వినిపిస్తోంది.
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ క్రేజీ కాంబో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ కేవలం పాటలకే పరిమితం కానున్నారని సమాచారం. మాస్ ఎలివేషన్లు, కీలక సన్నివేశాల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం మేకర్స్ తమన్‌ను రంగంలోకి దించుతున్నట్లు టాక్. మార్చి 26, 2026న విడుదల కానున్న ఈ చిత్రంపై ఈ మార్పుతో అంచనాలు మరింత పెరిగాయి.
సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ తనను బాధించలేదని నటి వరలక్ష్మి శరత్‌కుమార్ చెప్పింది. స్వీయ దర్శకత్వంలో వస్తున్న ‘సరస్వతి’ సినిమా ప్రచారంలో పాల్గొన్న ఆమె.. తన పెళ్లిపై వస్తున్న రూమర్లపై స్పందించింది. తన పెళ్లికి రూ.800 కోట్లు ఖర్చు అయ్యిందని వచ్చిన వార్తలు చూసి నవ్వుకున్నానని, అన్ని కోట్లు ఉంటే తాను ఇక్కడ ఎందుకు ఉంటానని చమత్కరించింది.
తమిళ నటుడు, TVK అధినేత విజయ్ దళపతి తన భార్య సంగీతతో విడాకుల వ్యవహారాన్ని సామరస్యంగా ముగించాలని చూస్తున్నట్లు సమాచారం. కోర్టు మెట్లు ఎక్కకుండా ఉండేందుకు ఆమెకు రూ.250 కోట్ల భారీ భరణాన్ని ఆఫర్ చేసినట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. పిల్లల భవిష్యత్తు, కుటుంబ గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వ్యక్తిగత విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచాలని విజయ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ లుక్ వచ్చే వరకు ఎలాంటి విజువల్స్ లీక్ కాకూడదని మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ లేదా గ్లింప్స్‌ను విడుదల చేసి సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీ పోస్టర్ అభిమానుల్లో ఒక్కసారిగా భారీ ఇంపాక్ట్ ఇచ్చేలా ఉండబోతుందని టాక్.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘కల్కి’ సీక్వెల్‌గా ‘కల్కి 2’ రాబోతుంది. తాజాగా ఈ సినిమాపై నటి దిశా పటానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘కల్కి 2’లో తన పాత్ర నిడివి మొదటి భాగంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుందని తెలిపింది. అయితే తొలి భాగంలో ‘రోక్సీ’ అనే పాత్రలో మెరిసిన దిశా, రెండో భాగంలో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిప...
తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘క్రేజీ కళ్యాణం’. బద్రప్ప గాజుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి హోలీ సందర్భంగా ‘బాల్ రాజ్’ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో తరుణ్ భాస్కర్ ‘సూపర్ మ్యాన్’ గెటప్‌లో ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నాడు. ఈ మూవీలో నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబోలో ‘NBK111’ రాబోతుంది. ఈ మూవీ మార్చి 5న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒక కీలక పాత్ర కోసం మంచు మనోజ్‌ను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ‘ఊ కొడతారా ఉలిక్కిపడతారా’లో కలిసి నటించిన ఈ ఇద్దరూ, పదేళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై సందడి చేయనుండటం హాట్ టాపిక్‌గా మారింది.
RJ బాలాజీ దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న మూవీ ‘కరుప్పు’. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. 2026 ఏప్రిల్ 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ మూవీలో త్రిష కథానాయికగా నటిస్తుండగా.. సాయి అభ్యాంకర్ సంగీతం అందిస్తున్నాడు.
నందమూరి బాలకృష్ణ తన 112వ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో చేయనున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ భారీ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయట. ఈ చిత్రంలో బాలయ్య సరికొత్త మేకోవర్‌లో కనిపిస్తారని సమాచారం. ఈ ఏడాది ద్వితీయార్ధంలోనే సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.