జీ సినీ అవార్డ్స్ 2026 వేదికగా బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ ఉత్తమ నటి అవార్డను గెలుచుకుంది. ‘తేరే ఇష్క్ మే’ మూవీలో నటనకు గాను ఈ అవార్డు లభించింది. అయితే, ఆమెను విజేతగా ప్రకటించగానే SMలో విమర్శలు హోరెత్తాయి. ఈ అవార్డుకు యామీ గౌతమి అర్హురాలని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘హక్’ మూవీలో యామీ నటన అద్భుతమని, ఆమెను కాదని కృతికి అవార్డు ఇవ్వడం సరికాదని మండిపడుతున్నారు.
సన్నీ లియోన్ కుమార్తె నిషా(9) ‘బూ బాక్స్’ అనే టిష్యూ హోల్డార్‌ను కనిపెట్టి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. టిష్యూ వాడుకున్న తర్వాత పక్కనే పడేసేలా చిన్న డస్ట్ బిన్ కలిపి ఉండేలా దీన్ని డిజైన్ చేసింది. దీనికి అధికారికంగా పేటెంట్ హక్కులు కూడా లభించాయి. అలర్జీ సమస్యతో టిష్యూలు వాడే క్రమంలో వచ్చిన ఈ ఆలోచన ఇప్పుడు కమర్షియల్ ప్రోడక్ట్‌గా మారి నిషాకు డబ్బును తెచ్చిపెడుతోంది.
బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కీలక వ్యాఖ్యలు చేసింది. మన గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారని తెలిసినప్పుడు బాధగా అనిపిస్తుందంటుందని తెలిపింది. కొన్నాళ్లుగా ఆమె సోదరుడు అర్జున్ కపూర్ SMలో ట్రోల్స్‌కి గురవుతున్న నేపథ్యంలో ఆమె స్పందించింది. అలాంటి వేధింపులను క్షమించాల్సిన అవసరం లేదని చెప్పింది. అలాగే, ఇలాంటి నెగిటివిటికీ ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పుకొచ్చింది.
విజయ్ దేవరకొండ, రష్మికల వెడ్డింగ్ రిసెప్షన్ ఇవాళ హైదరాబాద్ లోని బంజారాహిల్ల్ తాజ్ కృష్ణ హోటల్ లో ఘనంగా జరగనుంది. ఫిబ్రవరి 26న ఉదయపూర్ లో వివాహం చేసుకున్న ఈ జంట, నేడు సినీ, రాజకీయ ప్రముఖులకు విందు ఇవ్వనుంది. భద్రత దృష్ట్యా అతిథులకు పంపిన వన్ టైమ్ QR కోడ్ స్కాన్ చేసిన తర్వాతే లోపలి అనుమతిస్తారు. సాయంత్రం 7 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది.
సీనియర్ నటి రాధికా ప్రధాన పాత్రలో నటించిన ‘తాయి కిళవి’ కోలీవుడ్‌లో సెన్సేషన్ సృష్టిస్తోంది. స్టార్ హీరో శివకార్తికేయన్ నిర్మించిన ఈ చిత్రం తొలి వారంలోనే సుమారు రూ.25 కోట్ల వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ‘పసుపు తాయి’గా రాధికా పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, ఆమె ప్రోస్థటిక్ మేకప్ సినిమాను బ్లాక్ బస్టర్ దిశగా నడిపిస్తున్నాయి.
శివాజీ, లయ, రోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన సిినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. ఈనెల 6న ఈ మూవీ విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయికృష్ణ ప్రత్యేక ఆఫర్ ప్రకటించారు. సింగిల్ స్ర్కీన్స్ లో రూ.499కే నాలుగు టికెట్లు, లార్జ్ పాప్ కార్న్, మల్టీప్లెక్స్‌లో రూ.799కే 4 టికెట్లతోపాటు లార్జ్ పాప్ కార్న్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో పెన్సిబుల్ సినిమాలకు కేరాఫ్ దర్శకుడు శేఖర్ కమ్ముల. ‘కుబేర’ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల రెండు కథలను సిద్ధం చేస్తున్నాడట. అందులో ఒకటి ‘హ్యాపీడేస్ 2’ అని సమాచారం. ఇప్పటికే ఈ కథ కూడా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఈ కథతోపాటు మరో రెగ్యులర్ కథను కూడా రెడీ చేస్తున్నాడట. ఈ రెండు కథల్లో ఏది ముందు ఓకే అయితే అదే కథతో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడట.
విజయ్ సేతుపతి హీరోగా, సంజయ్ దత్ విలన్‌గా ఒక క్రేజీ కాంబినేషన్ తెరకెక్కబోతున్నట్లు నెట్టింట ప్రచారం సాగుతోంది. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. ఇక కథానాయికగా శ్రద్ధా కపూర్‌ను దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కన్నడ ఇండస్ట్రీలో మరో ఉద్యమం మొదలైంది. పబ్లిక్ ఈవెంట్స్‌లో హీరోయిన్ల ఫొటోలు, వీడియోలు జూమ్ చేసి తీయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ అభ్యరాలను సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ.. పోస్ట్‌లు పెడుతున్నారు. హీరోయిన్లు సప్తమి గౌడ, ఆషికారంగనాథ్, రుక్మిణివసంత్ నెట్టింట ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కొంతమంది కెమెరామెన్లు హీరోయిన్ల ప్రైవేట్ పార్ట్స్ పై జూమ్ చేసి వీడియో షూట్ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై నటి ఆషికా రంగనాథ్ స్పందించింది. ‘కెమెరామెన్లు తమ క్రాఫ్ట్ మీద కంటే మా శరీరాలపై ఫోకస్ పెట్టడం చాలా అగౌరవంగా అనిపిస్తుంది. ఇకపై ఇలాంటి వాటిని సహించం, ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. సినీ పరిశ్రమ అంతా ఏకతాటిపై నిలబడాలని నిర్ణయించుకున్నాం’ అని పేర్కొంది.
సోషల్ మీడియాపై నటుడు తనికెళ్ల భరణి అసహనం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంపై అవాస్తవాలు రాస్తున్నారని మండిపడ్డారు. తాను అన్ని మతాలను, వర్గాలను గౌరవిస్తాని పేర్కొన్నారు. తాను ఇప్పటి వరకు ఎవరినీ కించపరచలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీల పేరుతో ఫేక్ కొటేషన్లు సృష్టించడం ఈ మధ్య కాలంలో పెరిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీనియర్ జర్నలిస్ట్ మూర్తిని తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది. ఈ నిర్ణయంపై నటి మంచు లక్ష్మి స్పందిస్తూ.. ‘ఆయనకు తగిన శాస్తి జరిగింది’ అంటూ ట్విట్టర్ వేదికగా పేర్కొంది. ఇతరులను ఇబ్బంది పెట్టే ప్రవర్తనకు ఇలాంటి చర్యలు అవసరమని నెటిజన్లు కూడా అభిప్రాయపడుతున్నారు.
సీనియర్ జర్నలిస్ట్ వి.ఎస్.ఎన్. మూర్తి(దేవీప్రియ)ని తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది. తోటి జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుంటూ ట్విట్టర్ వేదికగా పదే పదే విమర్శలు చేస్తున్నారనే కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కాలంలో ఆయనకు ఇంటర్వ్యూలు ఇవ్వవద్దని, ప్రెస్ మీట్‌లకు ఆహ్వానించవద్దని అసోసియేషన్ PROలను కోరింది.
టాలీవుడ్ స్టార్ హీరో హనుమంతుడి గెటప్‌లో ఉన్న ఓ పాత ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. గుర్తుపట్టలేనంతగా ఉన్న ఈ ఫొటోలో ఉన్న నటుడు ఎవరై ఉంటారా? అంటూ అభిమానుల మధ్య పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే, ఈ ఫొటో చూస్తున్న మీకైనా ఆయన ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చేస్తారో చూద్దాం.
టాలీవుడ్ స్టార్ హీరో హనుమంతుడి గెటప్‌లో ఉన్న ఓ పాత ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. గుర్తుపట్టలేనంతగా ఉన్న ఈ ఫొటోలో ఉన్న నటుడు ఎవరై ఉంటారా? అంటూ అభిమానుల మధ్య పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే, ఈ ఫొటో చూస్తున్న మీకైనా ఆయన ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చేస్తారో చూద్దాం.