• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

దుబాయ్‌లో చిక్కుకున్న వారికి ఉచిత వసతి!

దుబాయ్‌లో చిక్కుకుపోయి ఇబ్బంది పడుతున్న వారికి నటుడు సోనూసూద్ ఉచిత వసతి కల్పిస్తున్నారు. ఏ దేశస్థులైనా పర్వాలేదు, ఎలాంటి షరతులు లేకుండా మీరు ఉచితంగా బస చేయవచ్చు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మానవత్వం మాత్రమే ముఖ్యం అని సోనూసూద్ పేర్కొన్నారు. ఇబ్బందుల్లో ఉన్నవారు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మెసేజ్ చేస్తే, తన టీమ్ సంప్రదించి ఏర్పాట్లు చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

March 6, 2026 / 06:45 AM IST

‘మృత్యుంజయ్‌’ని ఎంజాయ్‌ చేస్తారు: శ్రీ విష్ణు

‘మృత్యుంజయ్’ ప్రీమియర్ షోకి వచ్చిన వారి స్పందన చూశానని, అందరూ ఎంజాయ్ చేశారని హీరో శ్రీవిష్ణు తెలిపాడు. సిినిమా చూశాక ప్రేక్షకులు కూడా ఎంజయ్ చేస్తారని, రాజమౌళి నుంచి ఈ సినిమా చూశాక ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారని అన్నారు. రాజమౌళి నుంచి మా సినిమా ప్రమోషన్‌ స్టార్ట్‌ అయిందన్నాడు. NTR ట్రైలర్‌ రిలీజ్‌ చేశారని, నానీ తమ మూవీ చూసి మెచ్చుకున్నారని గుర్తుచేశాడు.

March 6, 2026 / 02:00 AM IST

విజయ్ దేవరకొండ ఇంటికి సీఎం రేవంత్

సీఎం రేవంత్ రెడ్డి నటుడు విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా విజయ్, రష్మిక దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, హైదరాబాద్ తాజ్ కృష్ణలో విజయ్ దేవరకొండ, రష్మిక వివాహావిందు నిన్న ఘనంగా జరిగింది. వీరి పెళ్లి ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్‌లో జరిగిన విషయం తెలిసిందే.

March 5, 2026 / 09:42 PM IST

చిరు ‘మెగా 158’కు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్!

మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు బాబీ ‘మెగా 158’ మూవీని తెరకెక్కించనున్నాడు. మార్చి 14న ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనుండగా.. ఏప్రిల్ 9 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు టాక్. తాజాగా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా AR రెహమాన్ పేరు వినిపించగా.. చివరికి తమన్‌ను ఫైనల్ చేసినట్లు సమాచారం.

March 5, 2026 / 05:20 PM IST

చైతూకి కెరీర్ హిట్ ఇస్తా: దర్శకుడు

‘వృషకర్మ’ ఈవెంట్‌లో దర్శకుడు కార్తీక్ దండు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు సినిమాపై ఇష్టం కలగడానికి కింగ్ నాగార్జునే కారణమని, ఆయనే తన మొదటి హీరో అని తెలిపాడు. ఇప్పుడు ఆయన తనయుడు నాగచైతన్యతో సినిమా చేయడం తన అదృష్టమని పేర్కొన్నాడు. చైతన్య కెరీర్‌లోనే ది బెస్ట్ సినిమా ఇస్తానని, ఈ చిత్రం భారీ స్థాయిలో ఉండబోతోందని ఎంతో ధీమాగా వ్యక్తం చేశాడు.

March 5, 2026 / 05:06 PM IST

ఓటీటీలో రికార్డు సృష్టించిన ‘D/O ప్రసాద్‌రావు’

ప్రముఖ OTT వేదిక జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న ‘D/O ప్రసాద్‌రావు కనబడుటలేదు’ వెబ్ సిరీస్ సాలిడ్ రెస్పాన్స్ అందుకుంటోంది. ఫిబ్రవరి 27న ఓటీటీలోకి వచ్చిన ఈ సిరీస్‌కు 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ వచ్చినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సిరీస్‌లో రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక తదితరులు కీలక పాత్రలు పోషించారు.

March 5, 2026 / 04:43 PM IST

విజయ్, రష్మిక వెడ్డింగ్… ఖ‌ర్చు ఎంతంటే?

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకల ఖర్చుపై నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. రాజస్థాన్ వేడుకలు, నగలు, షాపింగ్, సంగీత్, హైదరాబాద్ రిసెప్షన్, అభిమానుల మీట్ ఇలా అన్నింటికీ కలిపి సుమారు రూ. 20 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ జంట ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది.

March 5, 2026 / 04:28 PM IST

కార్తీక్ దండుపై నాగచైతన్య ప్రశంసలు

‘వృషకర్మ’ గ్లింప్స్ లాంచ్‌లో నాగచైతన్య దర్శకుడు కార్తీక్ దండుపై ప్రశంసలు కురిపించాడు. తొలుత కథ విన్నప్పుడు విజువల్స్ విషయంలో సందేహాలు కలిగినా, గ్లింప్స్ చూశాక కార్తీక్ విజన్ అర్థమైందని తెలిపాడు. ‘కార్తీక్ అద్భుతమైన విజనరీ, ఆయన గురించి జీవితాంతం మాట్లాడుతూనే ఉంటాను’ అని తెలిపాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

March 5, 2026 / 03:50 PM IST

తాతయ్య, అమ్మమ్మ సమాధుల వద్ద విజయ్, రష్మిక ఆశీస్సులు

టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం తర్వాత మొదటిసారి విజయ్ అమ్మమ్మ ఊరికి వెళ్లారు. అక్కడ విజయ్ తన తాతయ్య గోపాల్ రావు, అమ్మమ్మ ప్రమీల సమాధుల వద్ద భార్య రష్మికతో కలిసి నివాళులర్పించి, ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం బంధువుల ఇళ్లకు వెళ్లి పెద్దల దీవెనలు పొందారు. వీరి ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

March 5, 2026 / 03:25 PM IST

విజయ్‌ సేతుపతికి జోడీగా శ్రద్ధా కపూర్!

వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ సేతుపతి మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పాడట. దర్శకుడు మగిళ్ తిరుమేనితో విజయ్ సినిమా చేయనున్నట్లు సమాచారం. ఇందులో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించనున్నట్లు టాక్. ఈ మేరకు చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో హిందీ నటుడు సంజయ్ దత్ విలన్‌గా చేయనున్నాడట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

March 5, 2026 / 03:24 PM IST

‘పెద్ది’లో మృణాల్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు క్రేజీ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ మృణాల్ ఠాకూర్‌ను సంప్రదించగా, ఆమె ఏకంగా రూ. 3 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు టాక్. చరణ్ మాస్ ఇమేజ్‌కు తగ్గట్లుగా ఈ సాంగ్ ఉండబోతుందట. భారీ అంచనాలున్న ఈ చిత్రం ఏప్రిల్ 30, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.

March 5, 2026 / 02:43 PM IST

 ‘వృషకర్మ’ టీజర్ ఈవెంట్‌లో అపశ్రుతి

హీరో నాగచైతన్య ‘వృషకర్మ’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. నాగచైతన్య వేదికపైకి వచ్చి తన కోసం కేటాయించిన సీటులో కూర్చోగానే, ఆ కుర్చీ వెనక భాగం ఒక్కసారిగా విరిగిపోయింది. ఊహించని విధంగా కుర్చీ బ్యాలెన్స్ తప్పడంతో చైతన్య వెనక్కి పడిపోయారు. పక్కనే ఉన్న చిత్ర యూనిట్ సభ్యులు వెంటనే స్పందించి ఆయన్ని పట్టుకున్నారు.

March 5, 2026 / 02:25 PM IST

హీరో నాగచైతన్యకు తప్పిన ప్రమాదం

హీరో నాగచైతన్య ‘వృషకర్మ’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. నాగచైతన్య వేదికపైకి వచ్చి తన కోసం కేటాయించిన సీటులో కూర్చోగానే, ఆ కుర్చీ వెనక భాగం ఒక్కసారిగా విరిగిపోయింది. ఊహించని విధంగా కుర్చీ బ్యాలెన్స్ తప్పడంతో చైతన్య వెనక్కి పడిపోయాడు. పక్కనే ఉన్న చిత్ర యూనిట్ సభ్యులు వెంటనే స్పందించి ఆయన్ని పట్టుకున్నాడు.

March 5, 2026 / 02:25 PM IST

పేరు మార్చుకున్న ‘సరస్వతి’

నటి వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న ‘సరస్వతి’ మూవీ పేరు ‘ఎస్.సరస్వతి’గా మారింది. సెన్సార్ బోర్డు సూచనతో చిత్ర యూనిట్ ఈ మార్పు చేసింది. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ లభించింది. మార్చి 6న విడుదల కానున్న ఈ చిత్రం కేవలం 2 గంటల 1 నిమిషం నిడివితో రాబోతుంది. గతంలో చాయ్ వాలా వంటి చిత్రాలు కూడా ఇలాగే పేర్లు మార్చుకున్నాయి.

March 5, 2026 / 01:59 PM IST

యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న మాస్ బీట్ సాంగ్స్

యూట్యూబ్‌లో ప్రస్తుతం మాస్ బీట్ సాంగ్స్ ట్రెండ్ నడుస్తోంది. రామ్ చరణ్ ‘రైరై రారా’ సాంగ్ 24 గంటల్లోనే 31 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. AR రెహమాన్ మ్యూజిక్, చరణ్ డ్యాన్స్ ప్రేక్షకులను ఫిదా చేశాయి. మరోవైపు నాని ‘ ది ప్యారడైజ్’లోని ఆయా షేర్ పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ పాటలోని నాని లుక్, స్టెప్పులకు యూత్ కనెక్ట్ అయి రీల్స్ చేస్తున్నారు.

March 5, 2026 / 01:38 PM IST