తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి బాట గంగమ్మ ఆలయం వరకు భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 77,864 మంది భక్తులు దర్శించుకున్నారు. 39,348 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.33 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 69,008 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,001 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.36 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
TG: భద్రాచలంలో శ్రీరామనవమి రోజున జరిగే స్వామివారి కల్యాణ మహోత్సవంలో గోటి తలంబ్రాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఈ తలంబ్రాలను AP చీరాల నుంచి భక్తులు పంపిస్తున్నారు. ఈ మహత్తర కార్యక్రమం 13 ఏళ్లుగా కొనసాగుతోంది. 2014లో తొలిసారి 500 కిలోలతో ప్రారంభమైన ఈ ప్రక్రియ 25 వేల కిలోల వరకు పంపుతూ స్వామి సేవలో పునీతులవుతున్నారు. వీటిని కల్యాణంలో వినియోగించిన తర్వాత భక్తులకు పంపిణీ చేస్తారు.
TG: వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉగాది పండగ సందర్భంగా అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాలతో పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. భద్రకాళి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయ అధికారులు భక్తుల దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఉగాది అంటే పచ్చడి తినడమే కాదు, ప్రకృతితో మమేకమయ్యే అద్భుతమైన వేడుక. చాలామందికి ‘ఉగాది’ పేరు వెనుక ఉన్న అర్థం తెలియదు. ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం లేదా జన్మ ఆయుష్షు అని అర్థాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి ఆయుష్షు లెక్క మొదలయ్యే రోజే ఉగాది. చైత్ర శుద్ధ పాడ్యమి రోజు కలియుగం ప్రారంభమైందని పెద్దలు చెబుతారు. అందుకే, ఇది తెలుగు వారికి పండుగ మాత్రమే కాదు.. కొత్త బిగినింగ్.
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతుండగా.. 17 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 72,332 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.53 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ ఉగాది ఆస్థానం కార్యక్రమం నిర్వహించనున్నారు. బంగారు వాకిలి చెంతకు సర్వభూపాల వాహనంపై మలయప్పస్వామి రానున్నారు. మరో పల్లకిపై శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షుడు విష్వక్సేనుల వేంచేపు, ఉత్సవమూర్తులకు నివేదనలు, పూజల తర్వాత నూతన వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేయనున్నారు.
తెలుగు సంవత్సరాల్లో పరాభవ 40వది. ఈ ఏడాది పేరు పరాభవ. మనలోని అరిషడ్వర్గాలను జయిస్తే పరాభవమన్నది ఉండదని ఈ ఉగాది సందేశం. పరాభవ అంటే ఓడిపోవడం, అపజయం అనుకుంటున్నప్పటికీ.. బాహ్యప్రపంచంలో ఓడిపోవడం అనేది కాదు. బయటి శత్రువుల కంటే మనలోని చెడు ఆలోచనలను ఓడించడానికి ఈ ఏడాది సరైనది. అహంకారాన్ని విడనాడి, సత్యం, ధర్మం వైపు సాగేవారికి ఈ సంవత్సరం గొప్ప ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదిస్తుంది.
AP: జూన్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల కోటా ఇవాళ్టి నుంచి విడుదల కానుంది. ఉ.10 గంటల నుంచి ఎలక్ట్రానిక్ డిప్ కోసం భక్తులు పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఈ నెల 21న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ వంటి టికెట్లు, 23న అంగప్రదక్షిణ టోకెన్లు, 24న రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లను TTD ఆన్లైన్లో విడుదల చేయనుంది.
AP: తిరుమల శ్రీవారి ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. ఉగాది ఆస్థానం సందర్భంగా శుద్ధి కార్యక్రమంలో బోర్డు సభ్యులు పాల్గొన్నారని తెలిపారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించామన్నారు. ఆనంద నిలయం నుంచి ఆలయ ప్రాకారాల వరకు ప్రత్యేక సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పవిత్ర ద్రావణంతో శుద్ధి నిర్వహించామన్నారు.
AP: కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి తెలిపారు. ఏడాదికి నాలుగుసార్లు ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశికి ఆలయం శుద్ధి చేస్తామన్నారు. ఆలయ మూలమూర్తికి వస్త్రం కప్పి ఉప ఆలయాలను శుద్ధి చేశామన్నారు. శుద్ధి అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, నివేదనలు సమర్పిస్తామన్నారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు.