• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »భక్తి

పూజకు ఉత్తమ ఫలితాల కోసం..

పూజ పుణ్యదాయకం. అయితే పూజ ఎప్పుడు ఎలా చేయాలనేది చాలా మందికి అవగాహన ఉండదు. ఈ నేపథ్యంలో సూర్యోదయమైన తొలి 2/3 గంటల్లోనే పూజ ముగించడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు. 8, 8:30 గంటల లోపు అయితే మానసిక ప్రశాంతతతో పాటు దైవంపై ఏకాగ్రత కుదురుతుందట. ఉదయం వేళలో పూజ చేసేవారికి రోజంతా ఉత్సాహం, ఉల్లాసంగా గడుస్తుందని వివరిస్తున్నారు. సూర్యోదయానికి ముందే అయితే ఇంకా ఉత్తమమని సూచిస్తున్నారు.

March 29, 2026 / 06:37 AM IST

మార్చి 29: ఆదివారం పంచాంగం

శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు, చైత్ర మాసం, శుక్ల పక్షం ఏకాదశి: ఉ. 8-55 తదుపరి ద్వాదశి ఆశ్లేష: సా. 3-43 తదుపరి మఘ వర్జ్యం: ఉ.6-28 వరకు, తిరిగి తె.3-31 నుంచి 5-05 వరకు అమృత ఘడియలు: మ.2-11 నుంచి 3-43 వరకు దుర్ముహూర్తం: సా.4-31 నుంచి 5-19 వరకు రాహుకాలం: సా.4.30 నుంచి 6-00 వరకు సూర్యోదయం: ఉ.6.01; సూర్యాస్తమయం: సా.6.08 మతత్రయ ఏకాదశి, వాడపల్లి తీర్థం.

March 29, 2026 / 01:09 AM IST

తిరుమలలో 3 రోజులపాటు వసంతోత్సవాలు

తిరుమలలో ఈనెల 30 నుంచి ఏప్రిల్ 1 వరకు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు నిర్వహించనున్నారు. 30న ఉ.6:30 గంటలకు శ్రీదేవిభూదేవి సమేతంగా 4 మాడవీధుల్లో మలయప్పస్వామిని ఊరేగిస్తారు. 31న ఉ.8 నుంచి 10 గంటల వరకు మలయప్పస్వామి రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధుల్లో ఊరేగుతారు. ఏప్రిల్ 1న స్వామి అమ్మవార్లను ఊరేగిస్తారు. ప్రతిరోజు అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం, ఆస్థానం నిర్వహిస్తారు.

March 28, 2026 / 02:10 PM IST

నేడు తిరుమలలో రామయ్యకు కళ్యాణోత్సవం

శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ తిరుమలలోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీసీతారాముల కళ్యాణోత్సవం జరగనుంది. ఉదయం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు అభిషేకం చేస్తారు. సా.6-రా.9 గంటల మధ్య వేడుకగా సీతారామ కళ్యాణం నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా రేపు రా.7-8:30 గంటల మధ్య శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది.

March 28, 2026 / 07:57 AM IST

శ్రీవారి దర్శనానికి 12 గంటలు

తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుండగా.. 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 67,526 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,780 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

March 28, 2026 / 07:25 AM IST

మార్చి 28: శనివారం పంచాంగం

శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు, చైత్ర మాసం, శుక్ల పక్షం దశమి: ఉ. 10-35 తదుపరి ఏకాదశి; పుష్యమి: సా. 4-33 తదుపరి ఆశ్లేష; వర్జ్యం: తె. 4-55 నుంచి; అమృత ఘడియలు: ఉ. 10-27 నుంచి 11 59 వరకు; దుర్ముహూర్తం: ఉ. 6-01 నుంచి 7-37 వరకు; రాహుకాలం: ఉ. 9.00 నుంచి 10-30 వరకు; సూర్యోదయం: ఉ.6.01; సూర్యాస్తమయం: సా.6.08.

March 28, 2026 / 02:13 AM IST

పద్మాక్షి ఆలయంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

HNK: శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవస్థానంలో 16 రకాల పుష్పాలతో అమ్మవారికి పుష్పయాగం నిర్వహించారు. శ్రీ సీతారామ చంద్రస్వామి వారి కళ్యాణ వైభవ ప్రతి ఘట్టాన్ని ఆలయ వేదపండితులు నాగిళ్ళ షణ్ముఖ పద్మనాభ అవధాని, శిష్యబృందం గోపీకృష్ణ శర్మ, రంజిత్ ఆచార్యులు నిర్వహించారు. పద్మాక్షి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు సదానందం, సంతోష్, వినయ్, నాగరాజు సుమారు 300 మందికి అన్నప్రసాదాన్ని అందించారు.

March 27, 2026 / 06:20 PM IST

ఒంటిమిట్టలో పౌర్ణమి రోజున కళ్యాణం.. ఎందుకు?

AP: సాధారణంగా శ్రీరామనవమి రోజున పగలు కళ్యాణం జరుగుతుంది. కానీ, అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో ఐదు రోజుల తర్వాత పౌర్ణమి రోజు రాత్రివేళ నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం, ఈ ఆలయంలోని విగ్రహాలను హనుమంతుడు ప్రతిష్ఠించలేదు. లక్ష్మణుడు బాణంతో సృష్టించిన కోనేరు తీరాన, చంద్రుడు వెన్నెలలో సీతారాముల కళ్యాణం చూడాలని కోరుకోవడంతో ఇక్కడ వెన్నెలలో కళ్యాణం జరిపించడం ఆనవాయితీ.

March 27, 2026 / 02:36 PM IST

అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం

TG: భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. మిథులా స్టేడియంలో సీతారాముల కళ్యాణ వేడుకను వేదపండితులు ఘనంగా నిర్వహించారు. రామదాసు చేయించిన మంగళసూత్రంతో అభిజిత్ లగ్నంలో 12PMకు సీతారాముల కళ్యాణం జరిగింది. సీతారాములవారికి వేద పండితులు ముత్యాల తలంబ్రాలు పోశారు. రామదాసు చేయించిన ఆభరణాలు.. రామయ్యకు పచ్చలహారం, సీతమ్మకు  చింతాకు పతకంతో అలంకరించారు.

March 27, 2026 / 12:51 PM IST

ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు

AP: అన్నమయ్య జిల్లా ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ఏప్రిల్ 1న కోదండరాముడి కల్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి తర్వాత 5 రోజులకు చైత్ర శుద్ధ చతుర్ధశి రోజున అధికార లాంఛనాలతో పౌర్ణమికి ఒక రోజు ముందు కల్యాణం జరుగుతుంది. దీనిని ‘ఏకశిలా నగర’ కల్యాణం అని కూడా పిలుస్తారు.

March 27, 2026 / 11:22 AM IST

రూ.2.50 కోట్ల ఆభరణాలను సమర్పించిన జగ్గారెడ్డి

TG: సంగారెడ్డిలో రామ్ మందిర్ ఆలయానికి రూ.2.50 కోట్ల విలువ చేసే అభరణాలను కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కుటుంబ సభ్యులు సమర్పించారు. శ్రీరామనవమి సందర్భంగా జగ్గారెడ్డి, నిర్మల దంపతులు వేద మంత్రోచ్ఛరణల మధ్య ఊరేగింపుగా వారి ఇంటి వద్ద నుంచి ఆభరణాలు తీసుకుని వెళ్లి ఆలయంలో సమర్పించారు. రంగపేట పీఠాధిపతులు మాధవానంద సరస్వతి స్వామి వారి పర్యవేక్షణలో సీతారాముల కళ్యాణం జరగుతోంది.

March 27, 2026 / 10:37 AM IST

సీతారాముల కళ్యాణ‌ క్రతువు ప్రారంభం

TG: భద్రాచలం శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన సీతారాముల కళ్యాణ‌ క్రతువు ప్రారంభమైంది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్న మందు మాంగల్య ధారణ ఉంటుంది. రేపు రాములవారికి మహా పట్టాభిషేకం నిర్వహిస్తారు. స్వామివారి కళ్యాణానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.

March 27, 2026 / 10:32 AM IST

సీతారాముల కళ్యాణం ఈరోజే ఎందుకు?

నిజానికి సీతారామ కళ్యాణం ఉత్తర ఫల్గుణి నక్షత్ర యుక్త వైశాఖ శుద్ధ దశమి నాడు జరిగింది. కానీ, ‘మహతాం జన్మనక్షత్రే వివాహం’ అంటుంది ఆగమశాస్త్రం. మహాత్ములు, అవతారమూర్తుల జన్మతిథి నాడు ఆ నక్షత్రంలో కళ్యాణం చేయాలని శాస్త్ర వచనం. చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు జన్మించాడు. ఆ పర్వదినాన్ని శ్రీరామనవమిగా చేసుకుంటారు.

March 27, 2026 / 10:14 AM IST

ఆదర్శ దంపతులు.. ఇద్దరు కాదు ఒక్కరే!

TG: సీతారాములు ఒకే ఆత్మగా మసిలిన ఆదర్శదంపతులు. వారు ఇద్దరు కాదు.. ఒక్కరే అని చెప్పడానికి రామాయణమంతా నిదర్శనమే! వారి ప్రేమానురాగాలు, దాంపత్య జీవితాన్ని గురించి బాల, అయోధ్యకాండల్లో అందంగా వివరించారు. సుందరకాండలో చాలాచోట్ల సీతారాముల ఏకత్వాన్ని, ఎడబాటులోనూ ఉన్న సాన్నిహిత్యాన్ని, వారిద్దరూ ఒకరేనంటూ రుజువు చేసే అంశాలను ఆవిష్కరించారు.

March 27, 2026 / 09:38 AM IST

ఆదర్శ దాంపత్యానికి నిదర్శనం ‘సీతారాములు’

శక్యా లోభయితుం నాహమైశ్వర్యేణ ధనేన వా! అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభా యథా॥ అనే ఈ శ్లోకాన్ని రావణాసురుడితో సీతమ్మ పలికిందట. ‘ఎట్టి ధనాశలకు గానీ, ఐశ్వర్యాది ప్రలోభాలకు గానీ నేను లొంగేదానిని కాను. సూర్యుడి నుంచి కాంతి వేరుకానట్టుగా శ్రీరాముడి నుంచి నేను వేరుగాను’ అని చెబుతుంది సీతమ్మ. ‘నీకు తెలియక సీతారాములు ఇద్దరు అని భ్రమిస్తున్నావు. మేమిద్దరం ఒకటే’ అని అంటుందట.

March 27, 2026 / 09:10 AM IST