AP: తిరుమల శ్రీవారి జూన్ నెల దర్శన కోటాను టీటీడీ విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన వంటి ఆర్జిత సేవలకు సంబంధించి మే నెల కోటాను ఈనెల 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఇతర దర్శన టికెట్లు, గదుల కోటా వివరాలను కూడా టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
AP: శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ యాగశాలలో అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. యాగశాల ప్రవేశంతో ఉత్సవాలకు ఆలయ ఈవో శ్రీనివాసరావు శ్రీకారం చుట్టారు. సాయంత్రం స్వామి, అమ్మవారికి భృంగి వాహన సేవ నిర్వహించనున్నారు. ఈనెల 20 వరకు స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. స్పర్శ దర్శనంపై పరిమితులు విధించారు.
TG: కొమురవెల్లి మల్లన్న ఆలయంలో అగ్నిగుండ ప్రవేశం వైభవంగా నిర్వహించారు. 3 నెలలుగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలకు అగ్నిగుండ ప్రవేశంతో ముగించారు. భారీగా తరలొచ్చిన భక్తులు నిప్పులపై నడిచి స్వామివారిని దర్శించుకున్నారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత అగ్నిగుండానికి భూమిపూజ చేశారు. భద్రకాళీ మాత అష్టోత్తర శతనామ పూజతో అగ్నిప్రతిష్ఠ చేశారు. ఒక్కొక్కరిని అగ్నిగుండంలోకి అనుమతించారు.
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనానికి కృష్ణతేజ సర్కిల్ వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 82,057 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,990 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. అదేవిధంగా హుండీ ఆదాయం రూ.4.22 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
ATP: డి. హీరేహల్ మండలం మురడి గ్రామంలో వెలసిన ప్రసిద్ద ఆంజనేయుడు ప్రత్యేక అలంకరణలో భక్తులకు కనువిందు చేశాడు. వేకువజామునే స్వామి మూల విరాట్‌కి సుప్రభాత సేవ, పంచామృత వివిధ అభిషేకాలు చేపట్టి పుష్పాలు, తమలాపాకుల హారాలతో విశేషంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. స్థానిక భక్తులే కాక ఇతర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; ఉత్తరాయణం; శిశిర రుతువు, ఫాల్గుణ మాసం, బహుళ పక్షం ఏకాదశి: పూర్తి ఉత్తరాషాఢ: తె. 3-02 తదుపరి శ్రవణ వర్జ్యం: ఉ. 9-48 నుంచి 11-32 వరకు అమృత ఘడియలు: రా. 8-08 నుంచి 9-52 వరకు దుర్ముహూర్తం: ఉ. 6-14 నుంచి 9-48 వరకు రాహుకాలం: ఉ. 9-00 నుంచి 10-30 వరకు సూర్యోదయం: ఉ.6.14; సూర్యాస్తమయం: సా.6.06
AP: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 25 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.78 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; ఉత్తరాయణం; శిశిర రుతువు, ఫాల్గుణ మాసం, బహుళ పక్షం నవమి: తె. 4-20 తదుపరి దశమి; మూల: రా 11-00 తదుపరి పూర్వాషాఢ; వర్జ్యం: ఉ. 7-06 వరకు; అమృత ఘడియలు: మ. 3-55 నుంచి 5-41 వరకు దుర్ముహూర్తం: ఉ. 10-11 నుంచి 10-59 వరకు; తిరిగి మ. 2-55 నుంచి 3-43 వరకు; రాహుకాలం: మ. 1-30 నుంచి 3-00 వరకు సూర్యోదయం: ఉ.6.15; సూర్యాస్తమయం: సా.6.05
CTR: పుంగనూరులో సుగుటూరు గంగమ్మ జాతర సందడి మొదలైంది. మంగళవారం రాత్రి ప్యాలస్‌లో జమీందారీ వంశస్తుల ఆధ్వర్యంలో అమ్మవారికి తొలి పూజ నిర్వహించారు. పూజా కార్యక్రమాలలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. మున్సిపల్ పరిధిలోని పలు అమ్మవారి ఆలయాలలోనూ భక్తులు పూజలు చేశారు.
AP: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి సన్నిధిలో భక్తుల రద్దీ భారీగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 72,526 మంది భక్తులు దర్శించుకోగా 26,664 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.41 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; ఉత్తరాయణం; శిశిర రుతువు, ఫాల్గుణ మాసం, బహుళ పక్షం సప్తమి: రా 12-19 తదుపరి అష్టమి అనురాధ: సా. 5-55 తదుపరి జ్యేష్ఠ వర్జ్యం: రా. 12-07 నుంచి 1-54 వరకు అమృత ఘడియలు: ఉ. 6-24 నుంచి 8-10 వరకు దుర్ముహూర్తం: ఉ. 8-38 నుంచి 9-25 వరకు తిరిగి రా. 10-57 నుంచి 11-46 వరకు రాహుకాలం: సా. 3-00 నుంచి 4-30 వరకు సూర్యోదయం: ఉ.6.17; సూర్యాస్తమయం: […]
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; ఉత్తరాయణం; శిశిర రుతువు, ఫాల్గుణ మాసం, బహుళ పక్షం షష్ఠి: రా 10-13 తదుపరి సప్తమి విశాఖ: మ. 3-21 తదుపరి అనురాధ వర్జ్యం: రా. 7-47 నుంచి 9-33 వరకు అమృత ఘడియలు: ఉ. 7-28 వరకు దుర్ముహూర్తం: మ. 12-34 నుంచి 1-21 వరకు తిరిగి 2-55 నుంచి 3-42 వరకు రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు సూర్యోదయం: ఉ.6.17; సూర్యాస్తమయం: సా.6.04