ATP: తాడిపత్రి మండలం గంగాదేవిపల్లిలో ఆదివారం శ్రీ గంగమ్మతల్లి అమ్మవారు భక్తులకు విశేష దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారిని రంగురంగుల పుష్పాలు, విశిష్ట ఆభరణాలతో అత్యంత సుందరంగా అలంకరించారు. ఈ వేడుకను చూడటానికి పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో భజనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సత్యసాయి: కదిరిలోని ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజైన శనివారం రాత్రి స్వామి వారు ‘మోహన నరసింహుడై’ పల్లకిపై భక్తులకు దర్శనమిచ్చారు. క్షిరసాగర మథనంలో రాక్షసులను మాయావిలాసంతో మోహింపజేసి, దేవతలకు అమృతాన్ని దక్కించిన మోహినీ అవతార విశిష్టతను ఈ ఉత్సవం చాటిచెప్పింది. ఈ దివ్య ఉత్సవాన్ని కనులారా వీక్షించి భక్తులు తరించారు.
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేనివారికి స్వామి దర్శనం కోసం 8 గంటల సమయం పడుతుండగా.. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 82,838 మంది భక్తులు దర్శించుకోగా.. 31,006 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.94 కోట్లుగా నమోదైనట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
NLR: బోగోలు మండలం కొండబిట్రగుంటలో శ్రీప్రసన్న వెంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నూతనంగా నిర్మించిన కోనేరులో తెప్పోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యుత్ దీపాలతో అలంకరించిన తెప్పపై కోనేరులో స్వామివారిని ఊరేగిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు.
➠ తిథి: బహుళ పంచమి రా.8:10 వరకు తదుపరి షష్టి ➠ నక్షత్రం: స్వాతి మ.12:53 వరకు, తదుపరి విశాఖ ➠ శుభ సమయాలు: ఉ.7:13 నుంచి 10:10, ఉ.11:09-మ.12:08, మ.2.06-సా.4:26 ➠ రాహుకాలం: సా.4:30-సా.6:00 వరకు ➠ యమగండం: మ.12.00-మ.1.30 వరకు దుర్ముహూర్తం: సా.4.27-సా.5.15 వరకు ➠ వర్జ్యం: రా.7:01-8:47 వరకు ➠ అమృత ఘడియలు: తె.5:34 నుంచి.
GDWL: అయిజ మండలం బింగి దొడ్డి పెద్ద చెరువు కట్ట కింద ఉన్న తిమ్మప్ప స్వామికి శనివారం విశేష పూజలు జరిగాయి. అర్చకులు కోనేరు జలాలతో స్వయంభూ విగ్రహానికి అభిషేకం చేసి అర్చన, ఆకు పూజ, హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. రాత్రి భజన కార్యక్రమం ఉంటుందని సేవకులు తెలిపారు.
➠ తిథి: బహుళ చవితి సా.6:34 వరకు తదుపరి పంచమి ➠ నక్షత్రం: చిత్త ఉ.10:52 వరకు, తదుపరి స్వాతి ➠ శుభ సమయాలు: ఉ.7:50-8:13, ఉ.10:11-మ.1:07, మ.2:06-3:05 వరకు ➠ రాహుకాలం: ఉ.9:00-10:30 వరకు ➠ యమగండం: మ.1.30-3.00 వరకు ➠ దుర్ముహూర్తం: ఉ.6:15-7:49 వరకు ➠ వర్జ్యం: సా.4:56-6:40 వరకు ➠ అమృత ఘడియలు: తె.3:21 నుంచి 5:05 వరకు
E.G: కోరుకొండ మండలం గాదరాడలో శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఈ జాతర మహోత్సవాలలో భాగంగా జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి అమ్మవారికి శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన గరగల నృత్యాలు, కోలాటం, బోనాల ముత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి.
ATP: గుంతకల్లు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో అమ్మవారి మూలమూర్తికి పవిత్ర గంగాజలాలతో అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేక పుష్పాలతో వెండి, బంగారు ఆభరణాలతో అమ్మవారిని అలంకరించారు. భక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొని అష్టోత్తర శతనామావళి పఠించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 19న ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని 17వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. దీంతో 17న వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.
➠ తిథి: బహుళ తదియ సా.5:24 వరకు తదుపరి చవితి ➠ నక్షత్రం: హస్త ఉ.9:18 వరకు, తదుపరి చిత్త ➠ శుభ సమయాలు: ఉ.6:16-8:36, ఉ.10:11-11:10, మ.1:19-సా.4:04, సా.5:02-5:48 వరకు ➠ రాహుకాలం: ఉ.10:30-12:00 వరకు ➠ యమగండం: మ.3:00-4:30 వరకు ➠ దుర్ముహూర్తం: ఉ.8:37-9:24, మ.12:32-1:19 వరకు ➠ వర్జ్యం: సా.5:49-రా.7:32 వరకు ➠ అమృత ఘడియలు: తె.4:03 నుంచి 5:46 వరకు
AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి మూడు రోజుల పాటు మహా కుంభాభిషేక కార్యక్రమాలు వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దుర్గగుడి అధికారులు భక్తులకు కీలక సూచన చేశారు. ఈనెల 8వ తేదీ వరకు అమ్మవారి అంతరాలయ దర్శనాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, ఈనెల 9వ తేదీ వరకు అన్ని రకాల ఆర్జిత సేవలను సైతం రద్దు చేసినట్లు వెల్లడించారు.
కోనసీమ: కొత్తపేట మండలం వానపల్లిలో ఉన్న శ్రీ పల్లాలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో బుధవారం హుండీ లెక్కింపును నిర్వహించారు. ఈ మేరకు 4 నెలల 18 రోజులకు గాను రూ.3,95,570 ఆదాయం లభించిందని ఆలయ ఈవో వెంకటరమణ మూర్తి తెలిపారు. పలివెల ఈవో పి.కామేశ్వర రావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ మద్దింశెట్టి ఆదినారాయణ, సర్పంచ్ పల్లి భీమారావు తదితరులు పాల్గొన్నారు.
నిన్న చంద్రగ్రహణం కావడంతో తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ తగ్గింది. స్వామి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుండగా.. భక్తులు 4 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 27,300 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.46 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
➠ తిథి: బహుళ పాడ్యమి సా.4:33 వరకు తదుపరి విదియ ➠ నక్షత్రం: పుబ్బ ఉ.7:37 వరకు, తదుపరి ఉత్తర ➠ శుభ సమయాలు: ఉ.6:17-8:14, ఉ.9:13-10:12, మ.12:33-మ.2:59, సా.4:39-5:02 వరకు ➠ రాహుకాలం: మ.12-1:30 వరకు ➠ యమగండం: ఉ.7:30-9 వరకు ➠ దుర్ముహూర్తం: ఉ.11:46-మ.12:32 వరకు ➠ వర్జ్యం: మ.3:00-సా.4:38 ➠ అమృత ఘడియలు: రా.12.50 నుంచి 2.48 వరకు