• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »భక్తి

హైదరాబాద్ నగరంలో మరో అగ్నిప్రమాదం

TG: హైదరాబాద్ బాచుపల్లి పీఎస్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రగతినగర్ దగ్గర ఫర్నిచర్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షాపు నుంచి మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు. షార్ట్ సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 3, 2026 / 11:42 PM IST

ఆకాశంలో ఖగోళ అద్భుతం

ఈ సంవత్సరం మొదటి ఖగోళ అద్భుతం ముగిసింది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాలతో పాటు భారతదేశంలోనూ చంద్రగ్రహణం ఏర్పడింది. ఈ అరుదైన దృశ్యాన్ని ఖగోళ ప్రేమికులు ఆసక్తిగా తిలకించారు. ఎరుపు రంగులో చంద్రుడు కనువిందు చేశాడు. చాలా ప్రాంతాల్లో గ్రహణం చివరి దశలో ఉండగా చంద్రోదయం జరిగింది. గ్రహణం ఏర్పడుతున్న నేపథ్యంలో భారతదేశంలో ఆధ్యాత్మికంగా ‘సూతక కాలం’ ప్రాధాన్యత సంతరించుకుంది.

March 3, 2026 / 07:13 PM IST

ముగిసిన గ్రహణం.. ఏం చేయాలంటే..?

దేశంలో చంద్రగ్రహణం ముగిసింది. గ్రంథాల ప్రకారం గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేయడం, కొన్ని దానాలు చేయడం పుణ్యప్రదంగా పరిగణిస్తారు. ఇది మానసిక అశాంతి, ప్రతికూలత, బాధలను తగ్గిస్తుంది. కుటుంబంలో ఆనందం, శాంతిని కొనసాగిస్తుంది. ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలి. 

March 3, 2026 / 07:01 PM IST

మార్చి 03: మంగళవారం పంచాంగం

➠ తిథి: పౌర్ణమి సా.4:53 వరకు తదుపరి పాడ్యమి ➠ నక్షత్రం: మఖ ఉ.7:31 వరకు, తదుపరి పుబ్బ ➠ శుభ సమయాలు: ఉ.8:15-8:37, ఉ.9:26-11:11, మ.12:09-మ.1:08, మ.3:05-3:32, సా.5:10-6.00 వరకు ➠ రాహుకాలం: మ.3-4:30 వరకు ➠ యమగండం: ఉ.9-10:30 వరకు ➠ దుర్ముహూర్తం: ఉ.8:38-9:25, రా.10:55-11:44 వరకు ➠ వర్జ్యం: మ.3:33-సా.5:09 ➠ అమృత ఘడియలు: ఉ.6:43 వరకు తిరిగి అర్ధరాత్రి రా.1:11 నుంచి 2.48 వరకు

March 3, 2026 / 12:30 AM IST

మార్చి 02: సోమవారం పంచాంగం

✦ తిథి: శుద్ధ చతుర్దశి సా.5.42 వరకు తదుపరి పౌర్ణమి ✦ నక్షత్రం: ఆశ్లేష ఉ.7.51 వరకు, తదుపరి మఖ ✦ శుభ సమయాలు: ఉ.6.19-7.17, ఉ.8.16-9.14, ఉ.11.11-మ.12.30, మ.1.21-2.06, మ.3.40-సా.4.03 వరకు ✦ రాహుకాలం: ఉ.7.30-9.00 వరకు ✦ యమగండం: ఉ.10.30-12.00 వరకు ✦ దుర్ముహూర్తం: మ.12.33-1.20, మ.2.53-3.40 వరకు ✦ వర్జ్యం: రా.7.41-9.16 ✦ అమృత ఘడియలు: ఉ.7.51 వరకు తిరిగి మరుసటి రోజు తె.5.09లకు.

March 2, 2026 / 12:55 AM IST

నేడు, రేపు శ్రీవారి SSD టోకెన్ల జారీ రద్దు

AP: ఈనెల 3న చంద్రగ్రహణం కారణంగా రేపు, ఎల్లుండి శ్రీవారి SSD టోకెన్లను రద్దు చేసినట్లు టీటీడీ నిన్న ప్రకటించింది. అంటే 3వ తేదీకి ముందు ఇవాళ, రేపు తిరుపతిలో టోకెన్లు జారీ చేయరు. తిరిగి ఈనెల 4న దర్శనానికి సంబంధించిన టోకెన్లను ఎల్లుండి జారీ చేస్తారు. ఎల్లుండి వీఐపీ దర్శనాలు కూడా రద్దు చేయడంతో రేపు ఆ సిఫార్సు లేఖలు స్వీకరించరు.

March 1, 2026 / 06:58 AM IST

శ్రీవారి సన్నిధిలో భారీగా భక్తుల రద్దీ

AP: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తుల రద్దీ భారీగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండాయి. టోకెన్లులేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 67,952 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,414 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా.. హుండీ ఆదాయం రూ.3.97 కోట్లు వచ్చింది.

February 28, 2026 / 07:48 AM IST

ఫిబ్రవరి 28: శనివారం పంచాంగం

శ్రీవిశ్వావసు నామ సంవత్సరం; ఉత్తరాయణం; శిశిర రుతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్ష ద్వాదశి: రా8-40 తదుపరి త్రయోదశి; పునర్వసు: ఉ9-43 తదుపరి పుష్యమి; వర్జ్యం: సా5-22 నుంచి 6-54 వరకు; అమృత ఘడియలు: రా7-27 నుంచి 8-58 వకు; దుర్ముహూర్తం: ఉ6-24 నుంచి 7-56 వరకు; రాహుకాలం: ఉ9 నుంచి 10-30 వరకు; సూర్యోదయం: ఉ6-24; సూర్యాస్తమయం: సా6-01.

February 28, 2026 / 02:20 AM IST

వైభవంగా లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

TG: యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కన్నులపండువగా లక్ష్మీనరసింహస్వామి కళ్యాణమహోత్సవం జరగనుంది. అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో తిరుకళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో స్వామివారి కళ్యాణమహోత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలిరానున్నారు.

February 26, 2026 / 08:30 AM IST

తిరుమల సమాచారం

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. 25 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.48 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

February 26, 2026 / 07:59 AM IST

నేటి నుంచి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

AP: ఇవాళ్టి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఈ తెప్పోత్సవాలు మార్చి 2 వరకు జరగనున్నాయి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవార్ల దర్శనం జరగనుంది. ఈ కారణంగా ఈనెల 28, మార్చి 1, 2న ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను అధికారులు రద్దు చేశారు.

February 26, 2026 / 07:45 AM IST

భక్తులకు టీటీడీ కీలక సూచన

AP: తిరుమలలో వసతి గదులు ఇప్పిస్తామంటూ భక్తులను మోసం చేస్తున్న నకిలీ వెబ్‌సైట్లపై టీటీడీ అప్రమత్తమైంది. ఓ భక్తుడు మోసపోయిన ఘటనలో TTD విజిలెన్స్ విభాగం సమగ్ర విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో దీనిపై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు TTD ఐటీ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్శనం, వసతి గదులు, సేవా టికెట్లను అధికారిక వెబ్‌సైట్ ద్వారానే బుక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

February 25, 2026 / 08:47 PM IST

ఫిబ్రవరి 25: బుధవారం పంచాంగం

శ్రీవిశ్వావసు నామ సంవత్సరం; ఉత్తరాయణం; శిశిర రుతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్ష నవమి: రా2-57 తదుపరి దశమి; రోహిణి: మ2-09 తదుపరి మృగశిర; వర్జ్యం: ఉ6-45 నుంచి 8-13 వరకు, తిరిగి రా7-24 నుంచి 8-54 వరకు; అమృత ఘడియలు: ఉ11-11 నుంచి 12-40 వరకు, తిరిగి తె4-23 నుంచి 5-53 వరకు; దుర్ముహూర్తం: ఉ11-50 నుంచి 12-36 వరకు; రాహుకాలం: మ12 నుంచి 1-30 వరకు; సూర్యోదయం: ఉ6-26; సూర్యాస్తమయం: సా6-01.

February 25, 2026 / 01:20 AM IST

GOOD NEWS: కాసేపట్లో టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి దర్శనం మే నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా ఇవాళ విడుదల కానున్నాయి. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లను టీటీడీ అధికారులు రిలీజ్ చేయనున్నారు. అలాగే, తిరుమల, తిరుపతి గదుల కోటాను కూడా విడదల చేయనున్నారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌ సేవ‌లు, ద‌ర్శన టికెట్లు బుక్ చేసుకోవాలి.

February 24, 2026 / 10:07 AM IST

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు

తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు సర్వదర్శనానికి వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 77,803 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,766 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.66 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

February 24, 2026 / 08:33 AM IST