• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి

విశాఖలో 20 మంది ట్రాన్స్‌జెండర్లు గురువారం పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చిని కలసి కృతజ్ఞతలు తెలిపారు. జీ‌వీఎంసీ స్వీపర్ ఉద్యోగాల్లో చేరిన వారికి 72 రోజుల జీతం జమ కావడంతో ఆనందం వ్యక్తం చేశారు. సీపీని పూలమాల, శాలువాతో సత్కరించారు. ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే గౌరవప్రద జీవనం సాధ్యమని సీపీ అన్నారు.

April 9, 2026 / 08:58 PM IST

నీటి భద్రతపై కలెక్టర్ సిరి దృష్టి

KRNL:‘నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా సి.బెలగల్‌లో జిల్లా కలెక్టర్ సిరి, JC నూరుల్ ఖమర్ చెక్‌డ్యామ్‌ను పరిశీలించారు. నాగమ్మ చెరువును సందర్శించి నీటి నిల్వ పరిస్థితులపై అధికారులతో చర్చించారు. సాగునీటి సదుపాయాల మెరుగుదలకు అవసరమైన సూచనలు చేశారు. రైతులకు నీటి వినియోగం, భూగర్భ జలాల పరిరక్షణపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.

April 9, 2026 / 08:46 PM IST

రోడ్డు ప్రమాదాల నివారణకు ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్

కడప జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు చిన్నచౌక్ ఎస్‌ఐ రాజరాజేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయాణికుల భద్రత దృష్ట్యా పరిమితికి మించి ఎక్కించకూడదని, యూనిఫామ్ ధరించడం తప్పనిసరి అని సూచించారు.

April 9, 2026 / 08:45 PM IST

గౌహతిలో పెనమలూరు ఎమ్మెల్యే పర్యటన

కృష్ణా: పెనమలూరు MLA  బోడే ప్రసాద్‌కు గౌహతిలో టీడీపీ శ్రేణులు గురువారం ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారదర్శకమైన పరిపాలన సాగుతుందని, అమరావతి శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పించడం ద్వారా పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఉత్సాహంగా ఉన్నారన్నారు. యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు.

April 9, 2026 / 08:45 PM IST

‘రైతులకు కొత్త గోనె సంచులు ఇవ్వాలని డిమాండ్’

W.G: రబీ పంట కొనుగోలుకు ప్రభుత్వం కొత్త గోనెసంచులు ఇవ్వాలని, గత ఖరీఫ్ పంటకు రైతాంగానికి రావల్సిన రూ.15 కోట్లపై బడి రవాణా వాహన ఛార్జీలు వెంటనే ఇవ్వాలని ఏపీ కౌలురైతుల సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. మార్టేరులో గురువారం జిల్లా కమిటీ సమావేశాన్ని అధ్యక్షుడు శ్రీనివాసరావు నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చే చిరిగిన గోనె సంచులతో రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటురన్నారు.

April 9, 2026 / 08:43 PM IST

జనగణన‌పై మున్సిపల్ కమిషనర్ శిక్షణ

GNTR: తెనాలి బుర్రిపాలెం రోడ్‌లోని గుప్త కళాశాలలో తొలివిడత జనగణన శిక్షణ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ రామా అప్పలనాయుడు ఆధ్వర్యంలో గురువారం జరిగినది. ఈ కార్యక్రమానికి మాస్టర్ ట్రైనర్స్ విచ్చేసి సెక్రటరీలకు, టీచర్స్‌కు జనగణనపై శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరుగుతుందని వారు తెలిపారు.

April 9, 2026 / 08:42 PM IST

జనగణన‌పై మున్సిపల్ కమిషనర్ శిక్షణ

GNTR: తెనాలి బుర్రిపాలెం రోడ్‌లోని గుప్త కళాశాలలో తొలివిడత జనగణన శిక్షణ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ రామా అప్పలనాయుడు ఆధ్వర్యంలో గురువారం జరిగినది. ఈ కార్యక్రమానికి మాస్టర్ ట్రైనర్స్ విచ్చేసి సెక్రటరీలకు, టీచర్స్‌కు జనగణనపై శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరుగుతుందని వారు తెలిపారు.

April 9, 2026 / 08:42 PM IST

‘ఏఐటీయూసీ మహాసభలు జయప్రదం చేయండి’

KRNL: ఈ నెల 26, 27, 28వ తేదీల్లో తిరుపతిలో జరిగే ఏఐటీయూసీ 18వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు ఎన్.కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి ఎన్.లెనిన్ బాబు కార్మికులకు పిలుపునిచ్చారు. పత్తికొండలోని చదువుల రామయ్య భవన్‌లో ఈ రోజు నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ మహాసభలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

April 9, 2026 / 08:37 PM IST

లక్ష్మీపురం మిర్చి పొలాల్లో పోలీసుల కూంబింగ్

NTR: చందర్లపాడు పోలీసులు డ్రగ్స్‌పై దండయాత్ర-2.0లో భాగంగా గురువారం లక్ష్మీపురం మిర్చి పొలాల్లో కూబింగ్ నిర్వహించారు. అనంతరం గ్రామసభలో గంజాయి వాడకం, సరఫరాపై చట్టపరమైన చర్యల గురించి వివరించారు. సమాచారం ఉంటే 1930, 1972కు కాల్ చేయాలని సూచించారు. సైబర్ నేరాలు, బాలల రక్షణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ లక్ష్మీనారాయణ, ఏసీపీ తిలక్ తదితరులు పాల్గొన్నారు.

April 9, 2026 / 08:35 PM IST

పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్

VSP: జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ గురువారం ‘8వ పోషణ పక్వాడ’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ నెల 9 నుంచి 23 వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో శిశువుల తొలి 1000 రోజుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. పోషకాహారం, ఆరోగ్యకర అలవాట్లపై అవగాహన పెంచుతూ, జంక్ ఫుడ్ నియంత్రణకు చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు.

April 9, 2026 / 08:34 PM IST

ప్రసూతి ఆసుపత్రిలో చలివేంద్రం ప్రారంభం

తిరుపతి ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో వేసవి దృష్ట్యా ప్రజల కోసం చలివేంద్రం కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. మెడికల్ సూపరింటెండెంట్ డా.ప్రమీల దేవి సూచనలతో, ఇంఛార్జ్ సూపరింటెండెంట్ డా.నిర్మలాదేవి సహకారంతో సివిల్ సర్జన్ డా. రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దాత శ్రీ పెడమాళ్ల సతీష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.

April 9, 2026 / 08:34 PM IST

కడపలో డ్రైనేజీ పనులపై కమిషనర్ పరిశీలన

KDP: కడప నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్ర 12వ డివిజన్‌లో స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ పనులను పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. డ్రైనేజీ పనులకు ఆటంకంగా ఉన్న విద్యుత్ స్తంభాల మార్పిడి అత్యవసరమని తెలిపారు. ఏపీఎస్పీడీసీఎల్ అధికారులతో కలిసి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అవసరమైన ప్రాంతాల్లో వెంటనే స్తంభాల మార్పిడి చేయాలని సూచించారు.

April 9, 2026 / 08:33 PM IST

కడపలో డ్రైనేజీ పనులపై కమిషనర్ పరిశీలన

KDP: కడప నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్ర 12వ డివిజన్‌లో స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ పనులను పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. డ్రైనేజీ పనులకు ఆటంకంగా ఉన్న విద్యుత్ స్తంభాల మార్పిడి అత్యవసరమని తెలిపారు. ఏపీఎస్పీడీసీఎల్ అధికారులతో కలిసి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అవసరమైన ప్రాంతాల్లో వెంటనే స్తంభాల మార్పిడి చేయాలని సూచించారు.

April 9, 2026 / 08:33 PM IST

జిల్లా టీడీపీ కార్యాలయ నిర్మాణ పనులు పరిశీలన

CTR: చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్ పక్కన నిర్మాణంలో కొనసాగుతున్న జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయ భవన పనులను ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు షణ్ముగం రెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని సమీక్షిస్తూ,పనులను వేగవంతంగా పూర్తి చేయాలని గుత్తేదారులకు సూచించారు. పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు రాష్ట్ర పార్టీకి నివేదించాలని ఆదేశించారు.

April 9, 2026 / 08:32 PM IST

‘త్రాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలి’

కృష్ణా: మచిలీపట్నం జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ ఉప్పాల హారిక మాట్లాడుతూ.. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వేసవిలో ప్రజలకు త్రాగునీటి కొరత వల్ల ఎటు వంటి ఇబ్బంది కలగకూడదని ఆమె స్పష్టం చేశారు.

April 9, 2026 / 08:32 PM IST