• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘ఉపాది పనుల వద్ద నీరు.. నీడ ఏర్పాటు చేయాలి’

VZM: ఉపాధి పనుల వద్ద నీరు, నీడ ఏర్పాటు చేయాలని బొబ్బిలి MPDO సూచించారు. మంగళవారం స్దానిక రంగరాయపురంలోని రంగరాయ చెరువులో పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాటయ కనీస వేతనాలు వచ్చేలా రెండు పూటలు పనులు చేయుంచాలన్నారు. పనులపై వేతనదారులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పనులలో సమయపాలన పాటించాలని అన్నారు.

April 14, 2026 / 10:00 AM IST

‘పిల్లలకు మొబైల్స్ ఇవ్వొద్దు’

BPT: కర్లపాలెం అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం 8వ పోషణ పక్షోత్సవాలు నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ నాగమల్లేశ్వరి ఇందులో పాల్గొన్నారు. పిల్లలకు మొబైల్స్ ఇస్తే రేడియేషన్ వల్ల అనారోగ్యం పాలవుతారని ఆమె హెచ్చరించారు. ఫోన్లకు బదులు పిల్లలకు కథలు, పాటలు చెబుతూ వారితో సమయం గడపాలని తల్లిదండ్రులకు సూచించారు. అనంతరం సూపర్ డాడ్ వంటల పోటీలు నిర్వహించారు.

April 14, 2026 / 10:00 AM IST

త్వరలో యార్డుల విస్తరింప పనులు ప్రారంభం: రైల్వే డీఆర్ఎం

ATP: సరుకు రవాణా పెరిగినందున రైళ్ల రద్దీని తట్టుకోవడానికి గుంతకల్లు రైల్వే డివిజన్‌లోని గుంతకల్లు, రేణిగుంట, గుత్తి యార్డులను విస్తరింప చేస్తున్నామని డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా ఓ ప్రకటనలో తెలిపారు. గుంతకల్లు రైల్వే స్టేషన్‌లోని 1, 2, 3వ నెంబర్ ఫ్లాట్ ఫామ్‌లను ఇతర ఫ్లాట్ ఫామ్‌ల లైనులతో అనుసంధానం పనులు త్వరలో చేపట్టనున్నట్లు వెల్లడించారు. 

April 14, 2026 / 09:54 AM IST

రావులచెరువు వీఆర్ఏపై దాడి

సత్యసాయి: ధర్మవరం మండలం రావులచెరువు వీఆర్ఏ శివానందపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. బాధితుడు తన ఇంటి వద్ద ఉండగా గ్రామానికి చెందిన మేకల ఉపేంద్ర, లక్ష్మయ్య, నరసమ్మ, కుమార్ కలిసి కట్టెలు, రాళ్లతో దాడి చేశారని ఆయన వాపోయారు. శివానంద ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

April 14, 2026 / 09:51 AM IST

‘బీసీ హాస్టళ్ల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదు’

ELR: బీసీ హాస్టళ్ల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ స్పష్టం చేశారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించే విషయంలో అధికారులు బాధ్యతతో పనిచేయాలన్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి వెనుకబడిన తరగతుల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. విద్యార్ధులతో కాసేపు ఆయన ముచ్చటించారు.

April 14, 2026 / 09:49 AM IST

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

SKLM: నరసన్నపేట స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ డా.శాంతి హేమ్ మాట్లాడుతూ.. అంబేద్కర్ గారి ఆలోచనలు సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు.

April 14, 2026 / 09:47 AM IST

అన్న క్యాంటీన్‌ను పరిశీలించిన కలెక్టర్

ఏలూరు తంగెళ్లమూడిలోని అన్న క్యాంటీన్‌ను కలెక్టర్ వెట్రి సెల్వి సందర్శించారు. ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఆహర నాణ్యత, సిబ్బంది ప్రవర్తనను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అన్న క్యాంటీన్‌లో ప్రజలతో కలిసి ఆహారాన్ని తింటూ వారి అభిప్రాయాలను అడిగారు. అనంతరం క్యాంటీన్‌ల పరిసరాలలో పరిశుభ్రతను పరిశీలించారు.

April 14, 2026 / 09:39 AM IST

చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఎక్సైజ్ సీఐ

NTR: నందిగామ ప్రొహిబిషన్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధ్వర్యంలో చందర్లపాడు బస్టాండ్ సమీపంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. రోజు రోజుకి ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో నందిగామ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చాలనే సంకల్పంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఎక్సైజ్ సీఐ రమాదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.

April 14, 2026 / 09:39 AM IST

కడపలో ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమం

KDP: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు “ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమం కొనసాగుతోంది. అర్ధరాత్రి తర్వాత నిద్ర మత్తులో వాహనాలు నడిపే డ్రైవర్లను ఆపి, నీళ్లతో ముఖం కడిగించి జాగ్రత్తలు సూచిస్తూ పంపిస్తున్నారు. డ్రైవర్లు తమ కుటుంబాలను గుర్తు చేసుకుంటూ అప్రమత్తంగా వాహనాలు నడపాలన్నారు.

April 14, 2026 / 09:36 AM IST

బాలికను కాపాడిన పోలీసులు

CTR: ఆత్మహత్య చేసుకుంటానని సోషల్ మీడియాలో వెల్లడించిన ఓ బాలికను కార్వేటినగరం పోలీసులు కాపాడారు. మండలానికి చెందిన ఓ బాలిక తనకు జీవితం మీద ఆసక్తి లేదని ఆత్మహత్య చేసుకున్నట్టు సోషల్ మీడియాలో నిన్న రాత్రి పోస్ట్ చేసింది. సోషల్ మీడియా సెల్ పోలీసు సిబ్బంది కార్వేటినగరం పోలీసులను అప్రమత్తం చేశారు. సీఐ హనుమంతప్ప సాంకేతిక పరిజ్ఞానంతో 15 నిమిషాల్లో బాలిక ఆచూకీ కనిపెట్టారు.

April 14, 2026 / 09:34 AM IST

‘పి.జీ.ఆర్.ఎస్. వినతుల్లో జాప్యం లేకుండా చూడాలి’

VZM: పిజీఆర్ఎస్ మరియు రెవెన్యూ క్లినిక్ కు వేదికగా ప్రజల నుంచి వచ్చిన వినతుల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ, జాప్యం లేకుండా సత్వరమే పరిష్కరించాలని జె. సి.సేధు మాధవన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన పి.జీ.ఆర్.ఎస్ / రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో ఆయన డిఆర్వో సత్తిబాబు, ఇతర అధికారులతో కలిసి వినతులను స్వీకరించారు.

April 14, 2026 / 09:32 AM IST

‘తాళ్లకోడులో మౌలిక సదుపాయాలు కల్పించాలి’

W.G: తాళ్లకోడు ఎన్టీఆర్ కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఆకివీడు విచ్చేసిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ నాగ నరసింహారావును కలిసి వినతిపత్రం అందజేశారు. కాలనీలో తాగునీరు, డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు తవిటి నాయుడు, రవితేజ, వల్లి ఉన్నారు.

April 14, 2026 / 09:29 AM IST

బాలిక మృతిపై విచారణకు త్రిసభ్య కమిటీ

AKP: అచ్యుతాపురం కేజీబీవీలో బాలిక మృతి చెందిన ఘటనపై విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్లు డీఈవో అప్పారావు నాయుడు తెలిపారు. సంఘటనపై ప్రాథమిక విచారణ నిర్వహించి ఐదుగురిని సస్పెండ్ చేశామన్నారు. కమిటీలో ఎలమంచిలి, కె. కోటపాడు ఎంఈఓలు సూర్యప్రకాష్, ప్రసాద్, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ అధికారిని జెనీమా ఉన్నట్లు తెలిపారు.

April 14, 2026 / 09:28 AM IST

‘పీఎం కుసుమ్ పథకంను పటిష్టంగా అమలు చేయాలి’

నెల్లూరు జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ హిమాన్సు శుక్ల అధ్యక్షతనలో విద్యుత్ శాఖ అధికారులతో సోమవారం పీఎం కుసుమ్ పథకంపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ పథకం అమలుకు 437 ఎకరాల భూమిని గుర్తించగా, 215 ఎకరాలు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నాట్లు అధికారులు తెలిపారు. మిగిలిన 22 ఎకరాలను త్వరలో స్వాధీనం చేసుకునే ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడించారు.

April 14, 2026 / 09:21 AM IST

సీఎం చంద్రబాబును కలిసిన AFCOF ఛైర్మన్

KDP: సీఎం చంద్రబాబును నిన్న సాయంత్రం అమరావతిలోని సచివాలయంలో ఫిషర్మెన్ కో-ఆపరేటివ్ సొసైటిస్ ఫెడరేషన్ (AFCOF) ఛైర్మన్ యాటగిరి రాంప్రసాద్ కలిశారు. మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు, ఫెడరేషన్ ప్రస్తుత పరిస్థితులపై చర్చించి వినతి పత్రం సమర్పించారు. దీంతో పాటు కడపలో టీడీపీ అభివృద్ధికి పాటుపడాలని సీఎం చంద్రబాబు సూచించారని ఆయన తెలిపారు.

April 14, 2026 / 09:20 AM IST